నిన్న లాక్ డౌన్ చెకింగు తప్పించుకోవడానికి ఓ చెక్ పోస్టు గేటు కింద నుంచి, బైక్ మీద వేగంగా పారిపోవడానికి ప్రయత్నించి, ఒక వ్యక్తి దారుణంగా, అకారణంగా మరణించిన వీడియో నిన్నంతా వైరల్…. అక్కడ తప్పు ఖచ్చితంగా వాళ్లదే… పోలీసులు పట్టుకుంటే ఉరితీయరుగా… అయితే డబ్బులు లేదంటే చలాన్లు, అంతేగా… మరి ఎందుకా దుస్సాహసం..? తమిళనాడులో కోవిడ్ ఆంక్షలను తప్పించుకోవడానికి విమానం ఎక్కి పెళ్లి చేసుకున్న తీరు కూడా అంతే మూర్ఖంగా ఉంది… అతి తెలివి అనేది సరైన పదం అవుతుందేమో… కేవలం వధూవరులదే కాదు… బంధుగణం మొత్తం అంతే… కోవిడ్ కేసులు, భయాలు, మరణాలు, ఖర్చులు, కార్పొరేట్ దోపిడీ, ప్రభుత్వ ఆంక్షలు గట్రా ప్రజల్ని ఓ మానసిక వైకల్యం వైపు తీసుకుపోతున్నాయా…?
విషయం ఏమిటంటే..? నేల మీద అయితే ఆంక్షలు, అదే గాలిలో అయితే ఉండవుగా అనుకున్నారు… ఒక తప్పుడు అవగాహన, అతి తెలివి బుర్రల్ని కమ్మేస్తే ఇదుగో ఇలాంటి పిచ్చి ఆలోచనలే వస్తయ్… పెళ్లికి 50 మందికి మించి అతిథులు ఉండవద్దని ఆంక్షలు పెట్టారు కదా… నిజానికి సరిపోతారు… ఈ ఆంక్ష ఎల్లకాలమూ ఉంటే బెటర్… ఎక్కువ మంది అతిథుల కోసం రాకేష్, దక్షిణ ఓ ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకున్నారు… 161 మంది ఎక్కారు… విమానం గాలిలో కాస్త సెటిల్ కాగానే, పంతులు మంత్రాలు మొదలుపెట్టాడు… రాకేష్ తాళి కట్టేశాడు, అందరూ హర్షధ్వానాలు చేస్తూ అక్షింతలు జల్లారు… ఈ వీడియో బిట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది… అయితే..?
Ads
మాస్కుల్లేవు, సోషల్ డిస్టెన్స్ లేదు, కోవిడ్ జాగ్రత్తలు లేవు… కేవలం ఓ వంద మంది ఎక్కువ అతిథుల కోసం ఈ డ్రామా అవసరమా..? నిజానికి కేసుల వ్యాప్తి ఎక్కువగా సోషల్ గ్యాదరింగ్స్తోనే జరుగుతోంది… అందుకే ఈ ఆంక్షలు తప్పనిసరి… వ్యతిరేకించడం మూర్ఖత్వం… వాటిని బ్రేక్ చేసి, ఆహా, మేమెంత గొప్ప పనిచేశామో చూశారా అనే ఎగ్జిబిషన్ మరింత ప్రమాదం… అనేక జంటలు కోవిడ్ రూల్స్‌కు అనుగుణంగా తక్కువ మంది అతిథులతో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు… లేదా వాయిదా వేసుకుంటున్నారు… ఇప్పుడేం జరిగింది..? ఆ వధూవరుల మీద ప్లస్ పేరెంట్స్ మీద కేసులు పెట్టారు… అంతేకాదు, డీజీసీఏ అధికారులు ఆ ఫ్లయిట్ సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు… తప్పులేదు, ఇలాంటి తిక్క చేష్టల్ని గర్వంగా సొసైటీకి చూపించేవారికి వాతలు అవసరమే… అది ఇలా ఆలోచించే ఇతరులనూ కంట్రోల్ చేస్తుంది… ఫస్ట్ వేవ్ తరువాత కాస్త కేసులు తగ్గుముఖం పట్టిన తరుణంలో ప్రభుత్వాలు కూడా కోవిడ్ ఆంక్షల్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ సెకండ్ వేవ్ డెడ్లీగా మారింది… వేలకు వేల కేసులు నమోదవుతున్నాయి… మరణాలు సరేసరి… దేశం మొత్తమ్మీద తమిళనాడులోనే అదుపు తప్పింది… ఈ సమయంలో ఈ జంట చేసిన పనిని అభినందించలేం… వీలయితే మరో కేసు పెట్టి, మీడియాలో బాగా ప్రచారం వచ్చేలా చూడటం అవసరం…!!
Share this Article