కస్తూరి తెలుసు కదా… ఎప్పుడూ సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతూ ఉంటుంది… అటెన్షన్ కోసమో, అజ్ఞానమో గానీ… నోటికి ఏది తోస్తే అది… ప్రచారంలో ఉంటేసరి…
సుచిత్ర, చిన్మయిల కథ వేరు… మరీ కస్తూరి తీరు వేరు… సదరు కస్తూరి కూతలు, రాతల గురించి మళ్లీ మళ్లీ ఇక్కడ చెప్పుకోవాల్సిన పనిలేదు గానీ… ఆమె తాజా ఎడిషన్ చదివారా..?
అప్పటి రాజుల అంతఃపురం మహిళలకు సేవ చేయడానికి తెలుగు వారు వచ్చారట… (చెన్నైకి లేదా తమిళనాడుకు)… ఇప్పుడు వాళ్లంతా తమది తమిళజాతి అంటున్నారట… అధికారంలోనూ భాగస్వాములు అవుతున్నారట… ఇప్పటి ప్రభుత్వంలో ఐదుగురు మంత్రులు కూడా ఉన్నారట… (నిజానికి ఆమె విమర్శలు డీఎంకే మీద)…
Ads
అసలు అది కాదు ఆమె మాటల సారాంశం… తెలుగువాళ్లే తమిళులు అయిపోతే మరి ఎన్నేళ్ల క్రితమో వచ్చిన బ్రాహ్మణులు తమిళులు కాదని కొందరు అంటున్నారట, అదుగో అక్కడ ఆమెకు అభ్యంతరం… అంటే సోకాల్డ్ బ్రాహ్మణ జాతి బయట ఎక్కడి నుంచో వచ్చింది గానీ, తెలుగు జాతికన్నా ముందే వచ్చింది, సో ఈ వ్యతిరేకత దేనికి అని సోకాల్డ్ ద్రవిడ సిద్ధాంతకారుల్ని ప్రశ్నిస్తోంది…
ఇతరుల ఆస్తి లూటీ చేయవద్దు, ఇతరుల భార్యలపై మోజు పడవద్దు, ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవద్దు అని బ్రాహ్మణులు చెబుతున్నారు కాబట్టి వాళ్ల మీద తమిళనాడులో వ్యతిరేక ప్రచారం సాగుతోందని ఆమె విమర్శ… (ఆమె బ్రాహ్మణురాలే)…
సరే, బ్రాహ్మణుల మీద జరిగే వ్యతిరేక ప్రచారాన్ని ఖండించుకోనీ… తన అభిప్రాయం ఏదో చెప్పనీ… అక్కడి వరకూ ఎవరికీ అభ్యంతరం లేదు… కానీ దానికోసం తెలుగువారిని కించపరచడం దేనికి..? ఆమె నోరిప్పితే… అంటే ట్వీటితే ఖచ్చితంగా ఏదో ఓ పెంట…
అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తెలుగువాళ్లు అక్కడికి పోవడం ఏమిటో, తరువాత తామూ తమిళులమే అని చెప్పి అధికారంలో భాగస్వాములు కావడం ఏమిటో… ఆమెకే తెలిసిన ఈ చరిత్ర ఏమిటో… తమిళనాట కొందరు ఇలాంటి మెంటల్ కేసులకు సోషల్ మీడియాలో పిచ్చి కూతలు, రాతలు అలవాటే… కానీ..?
దాని మీద కౌంటర్లు, వ్యతిరేకత స్టార్టయితే చాలు, వెంటనే అబ్బే, మా వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయి అని డొల్ల సమర్థనలకు, వివరణలకు దిగుతారు… దీనికీ కస్తూరి ఎవర్ రెడీ… తెలుగు వారిని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆమెపై సోషల్ మీడియాలోనే ట్రోలింగ్, ఎదురు దాడి స్టార్టయ్యేసరికి, నాలుక కర్చుకుని… నో, నో, నా వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయి అని ఏదో తిక్క సమర్థనతో మరొకటి ట్వీటింది… తిక్కతనానికి ఐకన్..!
Share this Article