Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లచ్చక్క అంత తేలికగా వదలదట..! ఈ జర్నలిస్టుపై ఫిర్యాదు..!

September 20, 2025 by M S R

.

నిజానికి మన తెలుగు ఫిలిమ్ జర్నలిస్టులకు సంబంధించి ఇది చిన్న వార్తేమీ కాదు… తమ విపరీత ధోరణులతో ఇండస్ట్రీ వాళ్లకు జర్నలిస్టులు షాకులు ఇస్తుంటే మంచు లక్ష్మి అలియాస్ కంచు లక్ష్మి ఓ షాక్ ఇచ్చింది…

రీసెంట్ వివాదం తెలుసు కదా… మూర్తి అనే సినిమా జర్నలిస్టు ఆల్రెడీ పలు వివాదాలతో అందరికీ పరిచయమే… మొన్న ఓ ఇంటర్వ్యూలో 50 ఏళ్ల మహిళ, పన్నెండేళ్ల కూతురున్న తల్లికి డ్రెస్ సెన్స్ ఉండాలి కదా, మిమ్మల్ని చూసి అందరూ ఫాలో అవుతారు కదా అనే అర్థంలో ప్రశ్నలు సంధించాడు…

Ads

ఆమె కూడా జర్నలిస్టులతో గోక్కోవద్దు అనే భయమున్న నటి కాదు కదా… ఇదే ప్రశ్న మగ నటులను అడుగుతావా..? మహేష్ బాబు చొక్కా విప్పుకుని తిరిగితే ఆయన్ని అడగగలవా అని ఎదురుదాడి చేసింది… సదరు జర్నలిస్టు చేతులెత్తేసి బ్బెబ్బెబ్బె… ఈ వివాదంపై అన్ని పత్రికలూ కథనాలు రాశాయి…

ఇప్పుడు ఆమె వదిలిపెట్టలేదు… సదరు జర్నలిస్టు మూర్తిపై ఫిల్మ్ ఛాంబర్‌కి కంప్లైంట్ చేసింది… మంచు ఫ్యామిలీ అంటేనే టెంపర్‌మెంట్ కదా… ఏదీ అంత తేలికగా వదిలిపెట్టరు… ఆ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసినప్పుడు తనని అడిగిన ప్రశ్న తన డిగ్నిటీకి భంగం కలిగించిందంటూ కంప్లైంట్ దాఖలు చేసింది…

తన వయసు, వేసుకునే బట్టల మీద ప్రశ్న అడగడంపై ఈ కంప్లైంట్… అది ఇంటర్వ్యూ కాదు.. అటాక్ అంటూ మంచు లక్ష్మి ఆవేదన… ‘‘ఇది జర్నలిజం కాదు, క్రిటిక్ కూడా కాదు.. పాపులర్, వైరల్ అవ్వడం కోసం చేస్తున్నారు… జర్నలిస్ట్‌ల మీద నాకు గౌరవం ఉంది… మేల్ డామినేట్ ఇండస్ట్రీలో ఉన్నాను.. ఎంతో కష్టపడి నిలదొక్కుకున్నాను…

manchu

సైలెంట్‌గా ఉంటే… ఇదే బిహేవియర్ కంటిన్యూ అవుతుంది… అందుకే కంప్లైంట్ చేస్తున్నా… డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్‌ను కోరుతున్నాను’’ ఇదీ ఆమె ఫిర్యాదు సారాంశం… అవునూ, ఓ జర్నలిస్టుపై ఫిలిమ్ ఛాంబర్ ఏం చర్య తీసుకోగలదు..? మహా అయితే తనకు ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదనీ, ఏ ఫిలిమ్ ఫంక్షన్‌కూ ఆహ్వానించకూడదని నిర్ణయం తీసుకుంటుందా..? ఏమో, వేచిచూడాలి…

ఫిలిమ్ ఛాంబర్ స్పందించకపోతే ఆమె పోలీస్ కేసు పెట్టడమో, కోర్టుకెక్కడమో జరగవచ్చునట… ఫిలిమ్ సర్కిళ్లలో వినిపిస్తోంది… మోహన్‌బాబు బ్లడ్డు కదా… ఆమె మొండిగానే ఈ ఇష్యూలో ముందుకెళ్తుంది..! ఇంకా ఫిలిమ్ జర్నలిస్టుల సంఘం ఏమీ స్పందించినట్టు లేదు..!! మాకేం, మేం ఏదిపడితే ఆ ప్రశ్న వేసేస్తాం అనే ధోరణికి పగ్గాలు పడతాయా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • H1B వీసా లక్ష డాలర్ల ఫీజు… ఎవరికి..? ప్రభావం ఎంత..? ప్రచారం ఏమిటి..?
  • ఓ మోస్తరు ’బ్యూటీ’ఫుల్ మూవీ..! ఈ కథానాయికకు ఫ్యూచర్ ఉంది..!
  • రష్యా ఆయిల్ కొంటే ట్రంపు పెనాల్టీలు… అసలు కుట్రదారులు ఎవరు..?
  • వరల్డ్ వార్ సన్నాహాలు షురూ..! ఆపరేషన్ సిందూర్ ఆపించింది ఎవరు..?!
  • గద్దను ఎలా బీభత్సంగా వేటాడాలో… అదేదో భాషలో చెబితే ఎలా స్వామీ..?!
  • మంచు లక్ష్మి నటన, ఖర్చు, ప్రయాస… ఏవీ వర్కవుట్ కాలేదు ఫాఫం…
  • లచ్చక్క అంత తేలికగా వదలదట..! ఈ జర్నలిస్టుపై ఫిర్యాదు..!
  • కశ్మీరీ పండిట్ల ఊచకోతల బాధ్యుడికి మన్మోహన్ అభినందన, థాంక్స్..!!
  • ఆస్కార్‌కు మన హోమ్‌బౌండ్ సినిమా… అసలేమిటీ ఈ కథాకమామీషు..!
  • పదహారు నందుల ఆకెళ్ల ఇక లేరు… పవర్ ఫుల్ పెన్నుమూశారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions