Subramanyam Dogiparthi…… మా నాన్నగారితో కలిసి చీరాలలో నాజ్ థియేటర్లో చూసా ఈ సినిమాను . 1968 లో బ్లాక్ బస్టర్ . 15 కేంద్రాలలో వంద రోజులు , విజయవాడ దుర్గా కళా మందిరంలో 186 రోజులు ఆడింది . ఎన్నో సినిమాల్లో NTR కు తల్లిగా నటించిన పుష్పలతకు ఈ సినిమా మొదటి సినిమా . NTR కు భార్యగా నటించింది . చాలా అందంగా , చక్కటి నటన కలిగి ఉంది, పెద్ద హీరోయిన్ అవుతుందని అనుకున్నారు . కానీ , తల్లిగా స్థిరపడిపోయింది .
రాము సినిమా అనగానే శ్రావ్యమైన పాటలు గుర్తుకొస్తాయి . వాటిల్లో ముందుగా గుర్తుకొచ్చేది దాశరధి గారు వ్రాసిన రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్య పాట . మిగిలిన వాటిల్లో మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే, మాటలు రాని కోయిలమ్మ కూయునులే , పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు , మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనమూ నీకేల పాటలు కూడా ఇప్పటికీ గొప్ప హిట్ సాంగ్సే . ఆర్ గోవర్ధనం సంగీత దర్శకులు .
Ads
కిషోర్ కుమార్ హిందీలో దూర్ గగన్ కి ఛావ్ అనే టైటిల్ తో సినిమా తీసారు . హిందీలో బాగా ఆడలేదు . AVM వారు కొద్ది మార్పులు చేర్పులతో ముందు తమిళంలో తీసారు . అక్కడ సక్సెస్ అయ్యాక తెలుగులో తీసారు . తెలుగులో సూపర్ సక్సెస్ అయింది . రెండు భాషల్లోనూ A C త్రిలోక్ చందరే దర్శకుడు .
మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో కూడా ఓ రెండు మూడు సార్లు చూసా . టి విలో వచ్చినప్పుడల్లా కాసేపు చూస్తా . యూట్యూబులో ఉంది . తప్పక చూడతగ్గ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema
Share this Article