.
వెండి తెర, బుల్లి తెర, ఫ్యాషన్ ప్రపంచంలో జిలుగు వెలుగుల వెనుక ఎన్నో చీకట్లు, ఇక్కట్లు… ఈ మెరుపులు ఏవీ నిజాలు కావు… కృత్రిమం, ప్లాస్టిక్ నవ్వులు, మేకప్ తొడుగులు… ఇవి అందరికీ తెలిసిందే…
మెజారిటీ జీవితాలు పూలపాన్పలేవీ కావు… బిగ్‌టీవీలో వర్ష చాట్ షో కిస్సిక్ టాక్స్ టీవీ సెలబ్రిటీల జీవితాలను, వెతలను ఎంతోకొంత ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది… టీవీ షోలలో తన ఇమేజీకి భిన్నంగా వర్ష బాగానే చేస్తోంది ఈ షో…
Ads
సౌమ్యారావు అలియాస్ సౌమ్య శారద… కర్నాటక షిమోగా స్వస్థలం… టీవీ రీడర్, మోడల్, తరువాత టీవీ నటి… మామూలుగా మన టీవీల్లో ఫిమేల్ పాత్రలన్నింట్లోనూ కన్నడ తారలదే హవా కదా… అందరూ తెలుగును వాళ్ల మాతృభాష అన్నట్టుగా ఫ్లూయెంటుగా మాట్లాడతారు… కానీ ఈమెకు తెలుగు అంతగా రాదు…
కావాలని షోలలో, జబర్దస్త షోలో ఈమెతో తెలుగు మాట్లాడించి మరీ… ఆమె పదాల్లో బూతులు, తప్పులు వెతుకుతూ ట్రోల్ చేసి, దాన్నే హాస్యంగా ప్రొజెక్ట్ చేస్తుంటారు తోటి కమెడియన్లు… ప్రత్యేకించి హైపర్ ఆది… మనది కాని భాషలో మాట్లాడితే ఎలాగూ తప్పులు దొర్లుతాయి కదా… ఇదోరకం షేమింగ్…
గతంలో కూడా తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పింది సౌమ్య.,. ప్రత్యేకించి తండ్రి బాధ్యతారాహిత్యం… తల్లి అనారోగ్యం వంటివి… ఏదో షోలో చెబుతూ ఏడ్చేసింది అక్కడే… వర్ష టాక్ షోలో మాట్లాడుతూ తమకు తిండి లేని రోజులూ ఉన్నాయి అంటూ ఏవో ఉదాహరణలు కూడా చెబుతున్న ప్రోమో కనిపించింది…
ఒక్కమాట మాత్రం నిజం… ఈ ఫీల్డ్ అదే… ‘సీనియర్ యాంకర్ ఉదయభాను మొన్న చెప్పినట్టు టీవీ ఫీల్డ్ పెద్ద సిండికేట్… హార్డ్ వర్క్ కాదు, ఇక్కడ లక్కే ముఖ్యం, లేదా మ్యాజిక్కులు, గిమ్మిక్కులు ముఖ్యం, అన్నీ ఉన్నాయి ఇక్కడ… ఇప్పుడు వెలిగిపోతున్నవాళ్లు టాలెంటుతోనే వెలుగుతున్నారా..? హార్డ్ వర్క్‌ను ఎవడు పట్టించుకుంటాడు..?’
టీవీ సీరియళ్లలో విలనీ పాత్రలు కూడా వేస్తుంటుంది కదా… వేసీ వేసీ ఆమె మాటలు కూడా కటువుగా, నిష్ఠురంగా ధ్వనిస్తుంటయ్… నిజాలే అయినా కూడా..!!
Share this Article