.
రాజకీయాల్లో నాణేనికి రెండు మొహాలు కాదు… చాలా ఉంటయ్… వ్యక్తులకే చాలా వ్యూహాలు ఉంటే, పార్టీలకు ఎన్ని ఉండాలి..? అదీ బీజేపీ వంటి హార్డ్ కోర్ హిందుత్వ పార్టీలకు..?
ఎస్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా ఎపిసోడ్ వెనుక ఎన్నెన్నో సమీకరణాలు… అన్నింటికీ మించి చెప్పుకోదగిన విశేషం ఏమిటంటే…. తగ్గేదేలా అనే ధోరణిలో ఉపరాష్ట్రపతి అయితేనేం, అని ధన్కర్‌ను సింపుల్‌గా అంతటి రాజ్యాంగ పదవి నుంచి తరిమేసేంత బీజేపీ డిసిప్లిన్, పార్టీ విధేయత…
Ads
అందరూ అనుకున్నట్టు తను సంఘ్ నుంచి ఎమర్జ్ అయిన నేత కాదు… ష్, నిజం చెప్పాలా..? తను కాంగ్రెస్ మనిషి… తనెవరో, ఎందుకు ఉపరాష్ట్రపతి పదవి నుంచి తరిమేయబడ్డాడో వాస్తవ వివరాల్లోకి వెళ్దాం…
- ఈయన తొలుత జనతా పార్టీ… జుంఝును నియోజకవర్గం నుంచి అదే పార్టీ తరఫున 1989 ఎన్నికల్లో నిలబడ్డాడు, చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఏకంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి… తరువాత కాంగ్రెస్.,. 1993, రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కిషనగఢ్ ఎమ్మెల్యేగా పోటీచేశాడు, గెలిచాడు…
1998 లో కూడా కాంగ్రెస్ తరఫున అదే తన పాత జుంఝును ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి, మరీ మూడో స్థానంలో నిలిచాడు… 2003లో బీజేపీలో చేరాడు… సో, తను సంఘ్ మనిషి కాదు, వలసనాయకుడు…
2019లో నేరుగా బెంగాల్ గవర్నర్… తరువాత 2022లో ఉపరాష్ట్రపతి… వేగంగా ఎదుగుదల… బీజేపీలో ఈ స్పీడ్ ఎదుగుదలే అనూహ్యం… మరి మోడీకి ఎందుకు కోపం వచ్చింది..? అదీ ప్రశ్న…
ఏ సీన్ ఎలా ఉన్నా సరే… మోడీ అండ్ కో స్ట్రాటజీలు వేరు… చాలామందికి అర్థం కావు… ఈయన విషయంలోనూ అంతే… తను సంఘ్ మనిషి కాదు కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా లైట్ తీసుకుంది… జరిగిందేమిటి..?
కొన్నాళ్లుగా పాత వాసనలు పోని ధన్కర్ కేజ్రీవాల్, ఖర్గేలతో టచ్‌లో ఉంటున్నాడు, ఉద్దేశం ఏమిటో తెలియదు గానీ, మోడీ అండ్ కో ఆలోచనలకు భిన్నంగా వెళ్తున్నాడు… ఆల్రెడీ ఓ కన్నుంది తనపై… జస్టిస్ వర్మ అభిశంసనపై బీజేపీ ఓ స్టాండ్ తీసుకుంది… సమాజ్‌వాదీ వంటి నికృష్ట పార్టీలు తనకు సపోర్ట్ చేస్తున్నా సరే, వర్మను జుడిషియరీ నుంచి బయటికి పంపించడమే కాదు, ఈ దేశంలో సుప్రీం ఈ పార్టమెంటే అని సుప్రీంకు కూడా ఓ మెసేజ్ ఇవ్వాలనుకుంది…
తీరా ఏం జరిగింది..? ఈ ధన్కర్ ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని టేకప్ చేశాడు… మనకు రావల్సిన క్రెడిట్ విపక్షాలకు దక్కేలా వ్యవహరించడం ఏమిటి అనేది మోడీకి కోపం… మండిపోయింది… అసలే నాన్-సంఘ్ మనిషి… సహించలేదు…
అదే సమయంలో ధన్కర్‌కు టైమ్ ఇచ్చి, ఏవో విపక్షాల రాజకీయాలకు ఓ చాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు… స్పష్టమైన సంకేతం పంపించాడు… వెళ్లిపోతావా, వెళ్లగొట్టమంటావా..? స్ట్రెయిట్ క్వశ్చన్జ… ఏకంగా ఉపరాష్ట్రపతి మీదే అభిశంసన తీర్మానానికి రంగం సిద్ధమైంది… మోడీ బాసతు ట్రీట్‌మెంట్ ఏమిటో అర్థమైంది తనకు…
అప్పటికప్పుడు ఆరోగ్య కారణాలు అంటూ రాజీనామా చేసి, తక్షణ అమలుకు తగిన నిబంధనలను కూడా కోట్ చేసి, నిష్క్రమించాడు… ఒక్కొక్కరు ఒక్కోలా… అయ్యో, వామ్మో, రాజ్యాంగ పదవికి అవమానం, మన్నూమశానం అని గగ్గోలు… వేరే పార్టీ అయితే ఏమో గానీ, బీజేపీ ప్రదర్శించిన డిసిప్లినరీ యాక్షన్ దేశాన్ని నివ్వెరపరిచింది…
అంత పెద్ద రాజ్యాంగ పదవి విషయంలో సైతం ‘తగ్గేదేలా’ అనే ధోరణిని కనబర్చింది… రేప్పొద్దున ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారనేది చాలా రాజకీయ సంకీర్ణ, సంక్లిష్ట సమీకరణాలకు లోబడి ఉంటుంది… బట్ ధన్కర్ స్వయంకృతం… ఇదండీ ధన్కర్ విషయంలో జరిగింది… ఈ డిసిప్లిన్ అయితే పూర్తి లెఫ్ట్ లేదంటే పూర్తి రైట్ క్యాంపుల్లో మాత్రమే కనిపిస్తుంది… అది అర్థం చేసుకోలేని ధన్కర్ అనంత తీరాలకు సాగిపోయాడు…!!
.
చిత్రం ఏమిటంటే… అనేకసార్లు ఇదే ప్రతిపక్షం ఈయన్ని ఎగతాళి చేస్తూ పార్లమెంట్ ఎదుట స్కిట్స్ చేసేది… ఇప్పుడు అయ్యో అయ్యో ఫాఫం అంటోంది…
Share this Article