డిజిటల్ ఎడిషన్స్, వాట్సప్ ఎడిషన్స్, ఈ-పేపర్స్ అంటూ మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నీ…. ప్రింటింగ్ మానేసి, డిజిటల్ బాట పట్టాయి… అఫ్ కోర్స్, అవి చేస్తూనే తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ప్రకటనల్ని అడ్డగోలు రేట్లకు యాడ్స్ పబ్లిష్ చేయడం…. మెదళ్లు మోకాళ్లలో ఉండే సమాచార శాఖ అధికారుల పుణ్యమాని కోట్లకుకోట్లు కొల్లగొట్టడం, ఆ కమీషన్ల బాగోతం అనేది వేరే సంగతి… (అత్యంత భారీ గొప్ప నిజాయితీ, శీలం ఉన్న ఎర్ర పత్రికలు సహా… వాటికి అంతకుమించిన శరణ్యం లేదు గనుక… )
ఈ నేపథ్యంలో ఓ పోస్టు చదవడటం తటస్థించింది… ఏమిటయ్యా అంటే… ఇదుగో ఇదీ…
Ads
A new problem arises in Hyderabad. Tiffin centres are facing acute shortage of news papers for tiffin parcels. They are saying that people almost stopped buying newspapers and it’s affected badly on tiffin parcels recently. Earlier, they buy newspapers Rs 10 per kg and now they will have to shell out more money to buy another quality paper for parcels. IT IS TRUE. This is ground reality.
హైదరాబాదులో టిఫిన్ సెంటర్లకు కొత్త సమస్య వచ్చిపడిందట… జనమేమో పత్రికలు కొనడం లేదు… వాటిని నమ్మడం లేదు అనేది వేరే సంగతి… ఆ రేటు చెల్లించి కొనడం, కరోనా రిస్క్ తీసుకోవడం జనానికి ఇష్టం లేదు… శానిటైజ్డ్ పత్రిక అనే ప్రపంచంలోకెల్లా పెద్ద జోకు…. రామోజీకి, జగన్కు ఇలా జనాన్ని పిచ్చి ఎదవల్ని చేయడం కొత్తేమీ కాకపోవచ్చు కానీ… ఒక పత్రికను శానిటైజ్ చేయడం సాధ్యమేనా..? గలీజు నాయకులు… గలీజు మాయోపాయాలు… దరిద్రం బ్యాచ్… సగటు పాఠకుడి ఉసురు తగిలి పోతార్రోయ్….
మార్కెట్లో పత్రికల రద్దీ లేదు… మరి టిఫిన్లు గట్రా ఎలా ప్యాక్ చేయడం..? అదీ సమస్య… అదే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం గమనించిన సమస్య… ఇంతకుముందయితే పాత పత్రిక కాగితాలు పరపరా చింపేసి, పార్శిల్ కట్టేసేవాళ్లు… అసలు దినపత్రికలకు ఇంతకుమించిన ప్రయోజనం, పరమార్థం ఏమీ లేదని చాలామంది పెద్దలు ఎంతోకాలంగా చెబుతున్నారు కూడా… అందుకని హైదరాబాదులో ఈ సమస్యకు పరిష్కారం ఒకటే… కేసీయార్ పూనుకుని, నమస్తే తెలంగాణను ఇంకా ఎక్కువగా ప్రింట్ చేసి… అఫ్ కోర్స్, ఇప్పటికీ అదెవరూ చదవరు కాబట్టి… వీలైనంతగా ఆ రద్దీ పేపర్ ఈ టిఫిన్ సెంటర్లకు అందుబాటులో ఉంచాలి… ఆఫ్టరాల్, హైదరాబాద్ జనం కోరికల్ని ఆనర్ చేయలేని పత్రిక దేనికట…! ఒక టిఫిన్ సెంటర్ ఇబ్బందిని తీర్చడం కేసీయార్ ధర్మమా, కాదా..? ఇంతమంది సెటిలర్స్ ఉన్నారు, జగన్ కూడా పట్టించుకోడా…? సాక్షి పేజీలు పెంచి, ఉచితంగా పంపిణీ చేయడాన్ని సీరియస్గా ఆలోచిస్తాడా లేదా..?!
Share this Article