.
గజల్… గానంగానూ, కవిత్వంగానూ అంతర్జాతీయంగా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంది గజల్. ఉదాత్త స్థాయి అభిరుచి ఉన్నవాళ్ల ఎన్నిక గజల్. గజల్ సాహిత్యం, గానం ఉదాత్తమైనవి. అటువంటి గజల్ తెలుగులో వికారమూ, విదూషకత్వమూ అయిపోయింది.
సీ. నారాయణరెడ్డి … చాతకానితనంతో గజల్‌ను తెలుగులో భ్రష్టుపట్టించి వికారమూ, విదూషకత్వమూ చేసిన మొదటి వ్యక్తి సీ. నారాయణరెడ్డి. ఆ తరువాత తెలుగులో గజన్‌ను ‘డబ్బా కొట్టుడు లొల్లాయి గానం’ చేసేసిన ఘనుడు కేశిరాజు శ్రీనివాస్ ఉరఫ్ గజల్ శ్రీనివాస్.
Ads
గజల్ శ్రీనివాస్ తాను పాడడానికి రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, రసరాజు వంటి కొందరి చేత గజల్ అంటూ కొన్ని వికృత రచనల్ని చేయించి గజల్ పేరుతో తెలుగు సాహిత్యానికి కూడా హాని చేశారు.
- పేరుకు ముందు ఇంటి పేరులా గజల్ అని ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేని వికారం; ఒక్క తెలుగులో మాత్రమే కనిపించే వికారం. మహా గొప్ప గజల్ గాయకులు మెహ్‌దీహసన్, గులామ్ అలీ కూడా గజల్ మెహ్‌దీహసన్, గజల్ గులామ్ అలీ కాలేదు. గాలిబ్, జఫర్ వంటి గొప్ప గజల్ కవులు కూడా గజల్ గాలిబ్, గజల్ జఫర్ కాలేదు. అంతెందుకు గజల్ పిత ఫార్సీ కవి రూద్‌కీ కూడా గజల్ రూద్‌కీ అవలేదు. కానీ కేశిరాజు శ్రీనివాస్ ‘గజల్ శ్రీనివాస్’ అయిన వికృతం ఒక్క తెలుగులో మాత్రమే సాకారమైంది!
ఏది గజల్ గానం? అన్న తెలివిడి లేకుండా గజల్ శ్రీనివాస్ తెలుగులో గజల్ గానం అంటూ ఏదో చేసి, చేసి జాతీయ స్థాయిలో తెలుగును నవ్వులపాలు చెయ్యడం ఇప్పటికే గట్టిగా నమోదు అయి ఉంది. దేశంలోని ఏ గజల్ గాయకుడూ గజల్ గానం పేరుతో గజల్ శ్రీనివాస్ లాగా వికృత, విదూషక గానం చెయ్యలేదు.
అంతర్జాలంలో గజల్ అని అన్వేషిస్తే హరిహరన్, జగ్జీత్ సింహ్, తలత్ అజీజ్ వంటి దేశంలోని గజల్ గాయకుల గజల్ గానం దొరుకుతుంది. వాళ్ల గజల్ గానం విని గజల్ శ్రీనివాస్ గజల్ అని పాడింది వింటే ఎవరికైనా తేడా తెలిసిపోతుంది.
గజల్ అంటూ తెలుగు పరువు తీసేసిన గజల్ శ్రీనివాస్ 2018న లైంగిక నేరారోపణలతో జైలు పాలవడం సర్వ విదితమే.
(అంతర్జాలంలో ఆయన లైంగిక లీలల వీడియోలు ఉన్నాయి) గజల్ ప్రాతిపదికన తెలుగులోనే కాదు దేశంలోనే ‘నేరత్వం’ లేదా ‘అపరాధిత్వం’ (crimimality) వచ్చింది కూడా గజల్ శ్రీనివాస్ వల్లే!
ఈ గజల్ శ్రీనివాస్ ఇటీవల ‘ప్రపంచ తెలుగు మహా సభలు’ అంటూ నిర్వహిస్తూ ఏ లబ్ది కోసమో హడావిడి చేస్తూండడం తెలియవస్తోంది.
ఈ గజల్ శ్రీనివాస్ తెలుగులో గజల్‌ను ‘గలీజ్’ చేసేసినట్టే అతడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహా సభలతో తెలుగు సంస్కృతిని, తెలుగు భాషను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గలీజ్ చేసేస్తాడేమో అన్న భయం వేస్తోంది.
గజల్ అంటూ తెలుగును జాతీయ స్థాయిలో దెబ్బకొట్టిన గజల్ శ్రీనివాస్ ఇకపై ఇలా తెలుగు మహా సభలు అంటూ కూడా తెలుగు జాతిని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బకొడుతూంటారా?
ఏ వ్యక్తికైనా నైతిక భయం (moral fear) ఉండాలి. గజల్ శ్రీనివాస్‌కు ఆ నైతిక భయం ఉండుంటే ఏ లొల్లాయి గానాన్నో చేస్తూ దాన్ని గజల్ గానం అంటూ తెలుగు జాతి పరువుకు హాని చేసుండేవారు కాదేమో?
చట్టరీత్యా నమోదైన నేరాల విషయంలో కోర్ట్ ద్వారా గజల్ శ్రీనివాస్ నిర్దోషిత్వం నిరూపణ కాలేదు. అయినా అతడు ఇలా తెలుగు మహాసభలు అంటూ హడావిడి చేస్తూండడం తెలుగు జాతికి, ప్రభుత్వానికి గౌరవప్రదమా? అతడి వల్ల తెలుగు అప్రతిష్ఠపాలవడం లేదా? ప్రభుత్వమూ, ప్రజలు ఈ విషయంపై దృష్టి పెట్టాలి.
ఏ లొల్లాయి గానాన్నో గజల్ గానం అంటూ చేసి, చేసి పెద్ద డబ్బు సంపాయించిన వ్యక్తి గజల్ శ్రీనివాస్. ( గజల్ అంటూ పాడుతూ కొన్ని కోట్లు సంపాయించానని స్వయంగా ఆయనే నాకు 2016లో చెప్పారు) ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు అంటూ హడావిడి చెయ్యడం కూడా పెద్ద ధనార్జన కోసమే అనీ, అంతే కాకుండా ఏ ప్రభుత్వ పదవినో పొందడం కోసమే అనీ అనుకోవచ్చా? తెలుసుకోవచ్చా??
గజల్ శ్రీనివాస్ హిందూ ధార్మిక సంస్థలు కొన్నిటిలో ఏవో పదవుల్లో ఉన్నట్టుగానూ తెలుస్తోంది. లైంగిక సంబంధిత కేసుల్లో ఉన్న ఆయన ఆ పదవులకు తగిన వ్యక్తేనా? ఆ ధార్మిక సంస్థలకు కూడా నైతికత, నైతిక భయం లేవా? ఉండవా?
కేశిరాజు శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్ అయిపోయినట్టే ఇకపై ‘ప్రపంచ తెలుగు మహాసభల శ్రీనివాస్’ కానున్నారా?
గజల్ శ్రీనివాస్ నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రి వర్గం, ప్రభుత్వం, తెలుగు ప్రజలు సరైన ఆలోచన చెయ్యాలి; అప్రమత్తం కావాలి. గజల్ శ్రీనివాస్ వల్ల తెలుగు జాతికి, సంస్కృతికి హాని, అప్రతిష్ఠ రాకుండా ప్రభుత్వమూ, ప్రజలు కార్యాచరణ చెయ్యాలి…. రోచిష్మాన్ 9444012279
youtube.com/shorts/5hjjCjL-QoM?si=bF5F7O30qyoNmIhc
ఇక్కడే మరికొన్ని సందేహాలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి, అవీ చెప్పుకోవాలి… 1) తను ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నాడు కదా… నిజానికి అది హైదరాబాద్, బొగ్గులకుంటలో ఉంది… దేవులపల్లి రామానుజ రావు విల్లులో సినారె గారి పేరు వ్రాసారు… వారి తదనంతరం పరిషత్తు చూడటానికి…
.
మరి రాష్ట్రం విడిపోయిన తరువాత అది తెలంగాణ సారస్వత పరిషత్తు అయ్యిందన్నారు… మరి ఆంధ్రా సారస్వత పరిషత్తు ఎవరు స్థాపించారు..? ఎక్కడుంది..? అది ఎవరిది..?
.
అసలు నేరుగా మూడో తెలుగు ప్రపంచ మహాసభలు ఎలా వచ్చిపడ్డాయని మరో పండితుడి ప్రశ్న... చివరగా... అయ్యా, నాన్ గజల్ శ్రీనివాసులూ... నువ్వు తెలుగు సారస్వతానికి చేసిన కృషి ఏమిటో, నీ కంట్రిబ్యూషన్ ఏమిటో కాస్త చెప్పగలవా..?
Share this Article