Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇలియానా కాంట్రవర్సీ..! హఠాత్తుగా ఇప్పుడెందుకో మరి పురాతన తవ్వకాలు..?!

February 15, 2023 by M S R

నిజానికి ఇది కొత్త వార్తేమీ కాదు… చాలా ఏళ్ల క్రితం వార్తే… ఇప్పుడు ఏదో హఠాత్తుగా బయటికొచ్చినట్టు, వెలికితీసినట్టు రాసేస్తున్నారు కానీ ఇలియానా వివాదం చాలా పాతదే… బహుశా 2011 నాటిది… పైగా అందరూ ఆమెదే తప్పు అన్నట్టు రాస్తున్నారు తప్ప… ఆమె కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు… విషయం ఏమిటంటే..?

తమిళంలో మోహన్ నటరాజన్ అనే ఓ నిర్మాత ఉన్నాడు… దైవత్తిరుమగల్ అని ఓ సినిమా తీశాడు… అందులో విక్రమ్ హీరో, అనుష్క శెట్టి హీరోయిన్… ఇందులో అర్జున్ కూడా నటించాడు… సదరు నిర్మాత ఇలియానాను మొదట్లో హీరోయిన్ అనుకుని, ఆమె డేట్లు తీసుకుని, 40 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు… నిజానికి అంత భారీగా అడ్వాన్స్ ఇచ్చేంత గిరాకీ, రెమ్యునరేషన్ లేవు ఆమెకు… ఐతేనేం, నిర్మాతకు నచ్చింది, ఇచ్చాడు…

ఇలియానాను హీరోయిన్‌గా తీసుకున్నారు, భూపతి పాండ్యన్ దర్శకుడు అనుకున్నారు… కారణాలేమో గానీ ఆ సినిమా ఆగిపోయింది… నిర్మాత ఆమెను డబ్బు వాపస్ ఇవ్వమంటాడు… నా డేట్లు వాడుకోకపోవడం నీ తప్పు, అడ్వాన్స్ ఎవరైనా వాపస్ ఇస్తారా, నేనూ ఇవ్వను, కాకపోతే నిన్ను నష్టపరచడం నా ఉద్దేశం కాదు, వేరే సినిమా తీస్తే నా డేట్లు ఇస్తాను అని చెప్పింది ఇలియానా… లీగల్‌గా ఆమె కరెక్టే…

Ads

సినిమా మళ్లీ స్టార్టయినప్పుడు ఇలియానా బదులు అనుష్కను తీసుకున్నాడు… కానీ నేను మరో సినిమా తీయడానికి ఇలియానాను అడిగితే ఇప్పుడు డేట్లు ఖాళీ లేవు, వేరే సినిమా చేస్తున్నాను, అదయ్యాక నీ సినిమా చేస్తాను అని ఇలియానా చెప్పింది… 2010 డిసెంబరు, నవంబరుల్లో డేట్స్ కావాలంటాడు నిర్మాత, ఫిబ్రవరిలో ఇస్తాను-అప్పుడే ఫ్రీ అంటుంది ఇలియానా… (వేరే సినిమా చేస్తున్నప్పుడు ఈయన కోసం ఆ నిర్మాతకు నష్టం రానివ్వకూడదు కదా…) అప్పట్లో దేవుడు చేసిన మనుషులు సినిమా రవితేజతో చేస్తోంది ఆమె…

నో, నో, ఒక్క రోజు షూటింగ్ కూడా జరగలేదు కాబట్టి డబ్బు వాపస్ ఇవ్వాల్సిందే, అదే లీగల్ పాయింట్ అంటాడు నిర్మాత… శ్రియలు, నయనతారలే వాపస్ ఇస్తున్నప్పుడు నువ్వెందుకు లాపాయింట్లు మాట్లాడుతున్నావ్ అని దబాయించాడు నిర్మాత… మరి తన బదులు వేరే నటిని పెట్టి తీసేసుకున్నాడు కదా… పైగా ఠాట్, నేనడిగినప్పుడు డేట్స్ ఇవ్వవా అని సదరు నిర్మాత ఇలియానా మీద సౌత్ ఇండియా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు…

సదరు అసోసియేషన్ ఎప్పుడూ నిర్మాత తరఫునే ఆలోచిస్తుంది… ఇలియానా కోణంలో వాదించేవాళ్లు లేరు, తను లీగల్‌గా వెళ్తే ఇక తమిళ నిర్మాతలు ప్లస్ ఇతర సౌత్ ఇండియా నిర్మాతలు కక్షకడతారు అనుకుంది ఇలియానా… ఇచ్చిన డేట్స్ వాడుకోకపోవడం నిర్మాత తప్పు… కానీ ఆమె ఆఫ్టరాల్ హీరోయిన్ కదా… పైగా ముంబై బేస్డ్… తమిళంలో స్టాండ్ లేదు… పైగా నిర్మాతలకు హీరయిన్లను వాడుకోవడమే తెలుసు తప్ప టాక్ట్‌ఫుల్‌గా ఉభయతారకంగా ఆలోచించడం తెలియదు కదా… ఈలోపు సౌత్ ఇండియా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆమెను సౌత్ సినిమాల్లో తీసుకోకూడదని బ్యాన్ పెట్టేసింది… 2018లో ఆమె అమర్ అక్బర్ ఆంటోనీ అని రవితేజ సినిమా చేసింది… ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అడిగితే ఎలాగోలా సర్దిచెప్పారు… ఆ తరువాత ఇలియానా మళ్లీ సౌత్ తెరపై కనిపించలేదు…

మైత్రి మూవీస్, దిల్ రాజు, అల్లు అరవింద్ గట్రా తలుచుకుంటే దానికి కౌంటర్ చేసేవాళ్లు… కానీ ఆమె పట్ల వాళ్లకు అంత ప్రేమేమీ ఉండదు… దాంతో ఎవరూ మాట్లాడలేదు… ఈలోపు ఆమె బరువు పెరిగిపోయింది… ఆమె ఫోటోలు చూసినవాళ్లు వెక్కిరించసాగారు… అసలు ఇలియానా అంటేనే జీరో సైజ్ సౌందర్యం కదా… సౌత్ సినిమాలు రావడం లేదు, హిందీలోనూ పిలిచేవాళ్లు లేరు… తప్పు తెలుసుకుని, బరువు తగ్గి, ఈ తమిళ నిర్మాతలతో ఎందుకులే అనుకుని, ఈమధ్యే సార్టవుట్ చేసుకుంది… ఐనా సరే, పిలిచి వేషం ఇచ్చేవాళ్లు లేరు సౌత్‌లో… ఇదీ జరిగింది… అప్పట్లోనే బోలెడు వార్తలు వచ్చాయి ఈ వివాదంపై… సో, ఇదేమీ కొత్తది కాదు… ఇప్పుడు రెండు సినిమాలు హిందీలో చేస్తోంది తప్ప  సౌత్‌లో నిల్… మరెందుకు హఠాత్తుగా ఈ వివాదాన్ని మళ్లీ కొత్తగా తవ్వుతున్నారు అంటే… ఏమీలేదు, ఇప్పుడు తెలిసింది కొందరికి… అంతే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ రాజేష్… మన దిక్కుమాలిన న్యాయవ్యవస్థలో ఇక ఇంతే…
  • హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
  • మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
  • టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
  • BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
  • 70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
  • బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
  • కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
  • ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…
  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions