Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముందు నీ గోచీ బట్ట సరిచూసుకోవోయ్ ట్రంపూ… (పార్థసారథి పొట్లూరి)

August 28, 2025 by Rishi

(పార్థసారథి పొట్లూరి) …. భారత్ ఆర్ధిక పరిస్థితి చనిపోయింది – రాహుల్! The Indian Economy is dead – Rahul…!

Well… సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అయిన శశిధరూర్, రాజీవ్ శుక్లా, మనీష్ తివారీ, మరియు చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంలకి మన దేశ ఆర్ధిక పరిస్థితి విషయంలో ఎలాంటి ఆందోళన లేదు.

పైగా డోనాల్డ్ ట్రంప్ భారత్ ఒక మృత ఎకానమి ( India is dead economy) అని చేసిన వ్యాఖ్యని వీళ్లందరూ ఖండించారు.
కానీ రాహుల్ కి ట్రంప్ వ్యాఖ్య మాత్రం తెగ నచ్చేసింది, ఎందుకంటే మోడీ భారత దేశాన్ని పశ్చిమ దేశాలకి తాకట్టు పెట్టలేకపోయాడు కాబట్టి!

Ads

ట్రంప్ పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడు!
తన మాట వినని దేశాలని గడ్డిపోచలా తీసిపారేస్తున్నాడు! Dead economy అని రష్యాని కూడా అన్నాడు!

ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందం చేసుకోవాలని పుతిన్ మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నా పుతిన్ లెక్క చేయకుండా ఉక్రెయిన్ మీద దాడులు చేస్తూనే ఉన్నాడు!

రష్యా నుండి ఆయిల్, ఆయుధాలు కొనవద్దని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు మోడీని!

1960 నుండి భారత్ సోవియట్ రష్యా నుండి ఆయుధాలు కొంటూ వస్తున్నది… మరి అలాంటప్పుడు భారత్ వద్ద 70% సోవియట్ రష్యా ఆయుధాలే ఉంటాయి సహజంగా! ఇప్పుడు హఠాత్తుగా రష్యా నుండి కొనడం ఆపేసి స్క్రాచ్ నుండి మొదలుపెట్టాలని ట్రంప్ ఉద్దేశ్యం!

భారత్ వద్ద 670 బిలియన్ డాలర్ల రిజర్వ్ ఉంది! ఈ మొత్తాన్ని అమెరికా నుండి ఆయుధాలు కొనడానికి ఖర్చుపెట్టించాలని ప్లాన్!

భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేసారు…భారత దేశం 140 కోట్ల జనాభా కలిగి ఉంది. మా దేశ ఇంధన అవసరాల కోసం మాకు ఎక్కడ చవకగా ఆయిల్ దొరికితే అక్కడ కొంటాము. దీనిని రాద్ధాంతం చేయడం దేనికి?

రష్యాతో మీకేమన్నా విభేదాలు ఉంటే మీరుమీరు తేల్చుకోండి! మాకు రష్యాతో ఎలాంటి విభేదాలు లేవు, అటువంటప్పుడు మేమెందుకు రష్యా నుండి ఆయిల్ కొనకూడదు? ఇలా ప్రశ్నలు వేసిన ప్రతీ వెస్ట్రన్ విలేఖరికి సమాధానాలు చెప్తున్నారు!

అసలు కడుపు మంట దేనికంటే భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుని, దానిని శుద్ధి చేసి యూరోపు దేశాలకి అమ్ముతున్నది.

ఇండియా ఆయిల్ అమ్మితే మనం కొనాలా? కడుపు రగిలిపోవట్లా? పశ్చిమ దేశాల కడుపుమంట ఏమిటంటే….

నెహ్రూ కుటుంబం అధికారంలో ఉండి ఉంటే ఇప్పటికీ మన ఉత్పత్తులు ఎక్కువ ధరకి దిగుమతి చేసుకుంటూ ఉండేవారు ఎంచక్కా! మన Visa, Master కార్డులతో ఎక్కువ లావాదేవీలు జరుగుతూ మరింత ఆదాయం వచ్చేది.. ఇదీ పశ్చిమ దేశాల అక్కసు!

BRICS – ప్రమాదఘంటికలు!

BRICS అనేది డోనాల్డ్ ట్రంప్ ముందు ఉండబోయే ప్రమాదకరమైన ప్రధాన సమస్య అవబోతున్నది అని ముందే చెప్పుకున్నాము కదా! ఇప్పుడు BRICS అనేది తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది.

గ్లోబల్ ట్రేడ్ లో డాలర్ వాడకం అనేది 10% తగ్గినట్లుగా US ట్రెజరీ అంచనా వేసింది. 10% డాలర్ వాడకం తగ్గిపోవడం అనేది రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది. ఇది ఇలాగే కొనసాగితే 2027 కల్లా అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ పాత్రకి ప్రాముఖ్యత ఉండదు. డాలర్ ప్రాముఖ్యత తగ్గిపోతే అది అమెరికా పతనానికి దారితీస్తుంది. అఫ్కోర్స్! డాలర్ సెంటిమెంట్ అనేది ఇప్పటికే తగ్గిపోవడం మొదలయ్యింది!

అమెరికా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది అనడానికి మరో రెండు సంఘటనలు గురుంచి చెప్పుకోవాలి.

ఒక వారం రోజుల వ్యవధిలో రెండు F/A -18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్లు సముద్రంలో కూలిపోయాయి. అంతకు ముందు ఇంకొక F/A-18 సూపర్ హార్నెట్ కూడా కూలిపోయింది. అంటే ఆరు నెలల వ్యవధిలో మొత్తం 3 F/A -18 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి.

2023 డిసెంబర్ లో ఎర్ర సముద్రంలో హుతీ రెబెల్స్ దాడులని ఎదుర్కోవడానికి అమెరికా USS హ్యారీ ట్రూ మన్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ ని మొహరించింది.

2024 ప్రధమార్ధంలో ట్రూమన్ ని ఎర్రసముద్రం నుండి మద్యధరా సముద్రంలోకి తరలించింది అమెరికా. కారణం? జస్ట్ హుతీ రెబెల్ గ్రూపు మాటిమాటికీ అమెరికన్ నావీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుండడంతో పరువు కాపాడుకోవడానికి ఎర్ర సముద్రం నుండి వెనక్కి రప్పించి, మధ్యధరా సముద్ర తీరప్రాంతానికి తరలించింది.

2024 డిసెంబర్ లో యేమెన్ కి చెందిన హుతీ రెబెల్ గ్రూపు జరిపిన క్రూయిజ్ మిసైల్ దాడి వలన హ్యారీ ట్రూమన్ కి రక్షణగా ఉన్న ఫ్రీగేట్లు హుతీ ప్రయోగించిన క్రూయిజ్ మీసైళ్ళని కూల్చివేసాయి. కానీ ఫ్రీగేట్లలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ పూర్తిగా అయిపోయేవరకూ హుతీ రెబెల్స్ అన్ గైడెడ్ రాకెట్స్, క్రూయిజ్ మిసైల్స్ ని ప్రయోగిస్తూ పోయారు. ఫ్రీగేట్స్ లో ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ అయిపోగానే హుతీ రెబెల్స్ నేరుగా ట్రూమాన్ మీదకి క్రూయిజ్ మిసైల్స్ ప్రయోగించడం మొదలు పెట్టేసరికి ట్రూమన్ మీద ఉండే CWS ( Close-in Weapon System) ఫలంక్స్ ( Phalanx) ని ఉపయోగించి హుతీ దాడులని ఎదుర్కునే సమయంలో ఫ్రీగేట్లు కూడా CWS తో ట్రూమాన్ మీదకి వచ్చే హుతీ మిసైల్స్ ని ఎదుర్కున్నాయి.

హుతీలు ఎక్కడనుండి రాకెట్స్ ప్రయోగిస్తున్నారో చూసి వాళ్ళ మీద బాంబులు వేసిరమ్మని ఒక F/A-18 సూపర్ హార్నెట్ ని పంపించాడు ట్రూమాన్ కెప్టెన్. F/A-18 ట్రూమాన్ మీద నుండి టేక్ ఆఫ్ తీసుకుని గాల్లోకి లేవగానే ట్రూమాన్ మీదకి దూసుకు వస్తున్న హుతీ రాకెట్స్ ని కూలుస్తున్న ఫ్రీగెట్ నుండి వస్తున్న బులెట్స్ టేక్ ఆఫ్ అవుతున్న F/A-18 కి తగిలి ఎర్ర సముద్రంలో కూలిపోయింది.

F/A -18 కి ఇద్దరు పైలట్లు ఉంటారు, ఇద్దరూ EJECT అయిపోయి ఎర్రసముద్రంలో పడిపోవడం, రెస్క్యు సిబ్బంది వాళ్ళని రక్షించి ట్రూమాన్ మీదకి తీసుకురావడం జరిగింది. అయితే తాము ప్రయోగించిన రాకెట్స్ వల్లనే F/A-18 కూలిపోయింది అని హుతీ రెబెల్ గ్రూప్ ప్రకటించింది వెంటనే! హుతీలకి ఎర్రసముద్రంలో F/A-18 కూలిపోయింది అని ఎవరు సమాచారం ఇచ్చారు?

2025 జులై 30 న ట్రూమాన్ కారియర్ మీదకి లాండ్ అవబోతున్న F/A-18 అరెస్టింగ్ కేబుల్ తెగిపోవడంతో డెక్ చివరి వరకూ వెళ్లి సముద్రంలో పడిపోయింది! అయితే F/A-18 లాండింగ్ హుక్ అరెస్టింగ్ కేబుల్ ని పట్టుకోలేక పోవడం వల్లనే ప్రమాదవశాత్తు ఫైటర్ జెట్ కూలిపోయింది అని పెంటగాన్ ప్రకటించింది!

డిఫెన్స్ experts మాత్రం ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం జరిగే అవకాశమున్న ప్రమాదాన్ని 2025 కి ముడిపెట్టడం అది అబద్ధమనే తెలిసిపోతుంది అని వ్యాఖ్యానించారు. విమానవాహక యుద్ధ నౌక మీద లాండ్ అయ్యే ఏ జెట్ ఫైటర్ అయినా సరే గంటకి 260km నుండి 350 km వేగంతో లాండ్ అవుతాయి, ఎందుకంటే లాండ్ అయ్యే సమయంలో ఒక్కోసారి అరెస్టింగ్ కేబుల్ కి విమానం హుక్ సరిగా పట్టుకోలేకపోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో పైలట్ అదే వేగంతో ముందుకు వెళ్లి టేక్ ఆఫ్ తీసుకుని, చుట్టూ తిరిగి మళ్ళీ లాండ్ అవుతాడు కాబట్టి జెట్ వేగం 250 నుండి 350 km ల మధ్య ఉండేట్లుగా చూసుకుంటుంటాడు పైలట్. ఇది అన్ని దేశాల విమాన వాహక యుద్ధ నౌకల మీద ఉండే ఫైటర్ జెట్ పైలట్స్ కి స్టాండర్డ్ ట్రైనింగ్ లో భాగంగా ఉంటుంది.

విమాన వాహక యుద్ధ నౌక మీద ఉండే హైడ్రాలిక్ అరెస్టింగ్ కేబుల్ ధర అక్షరాలా 10 లక్షల డాలర్లు. ప్రతీ 250 లాండింగ్స్ తరువాత అరెస్టింగ్ కేబుల్ ని తప్పనిసరిగా మార్చాలి లేకపోతే 250 km వేగంతో లాండ్ అయ్యే ఫైటర్ జెట్ ని ఆపే శక్తి కోల్పోయి తెగిపోతుంది. దరిమిలా ఫైటర్ జెట్ సముద్రంలో కూలిపోతుంది!

అరెస్టింగ్ కేబుల్ ని నిర్ణీత సమయానికి మార్చకపోవడంతో F/A-18 కేబుల్ తెగిపోవడంతో సముద్రంలో కూలిపోయింది.

2025 మే 5 న హుతీలు రాకెట్ల వర్షం కురిపించడంతో USS Harry S Truman ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ కెప్టెన్ నౌకని కుడి వైపుకి షార్ప్ టర్న్ తీసుకోమని ఆదేశాలు ఇచ్చాడు. ట్రూమాన్ షార్ప్ టర్న్ తీసుకునే క్రమంలో కొద్దిగా కుడివైపుకి వంగడంతో డెక్ మీద గొలుసులతో బంధించి ఉన్న F/A-18 ఎర్ర సముద్రంలో పడిపోయింది.

దానిని నీళ్లలోంచి బయటికి తీసే ప్రయత్నం చేసే సమయం లేదు కాబట్టి హుతీ రాకెట్లు చేరుకోలేని దూరానికి వెళ్ళిపోయింది ట్రూమన్! ఈ సందర్భంలో కూడా హుతీ తమ రాకేట్ల దాడిలో డెక్ మీద పార్కింగ్ చేసి ఉన్న ఫైటర్ జెట్ ని కూల్చేశామని క్లెయిమ్ చేసింది.

గత ఫిబ్రవరిలో ఇదే హ్యారీ ట్రూమన్ కారియర్ ఈజీప్ట్ తీరంలో ఒక వాణిజ్య నౌకని ఢీ కొట్టి దెబ్బతిన్నది. అంటే డెక్ మీద ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారనే కదా?

ఫిబ్రవరిలో హ్యారి ట్రూమన్ కారియర్ వాణిజ్య నౌకని ఢీ కొట్టిన తరువాత ట్రూమన్ కెప్టెన్ డెవ్ స్నోడెన్ ( Capt. Dave Snowden) ని తప్పించి అతని స్థానంలో కెప్టెన్ క్రిస్టోఫర్ హిల్ ( Capt. Christopher Hill) ని ట్రూమన్ కి కెప్టెన్ గా నియమించారు.

Dave snowden కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒక F/A-18 జెట్ కోల్పోవడంతో పాటు వాణిజ్య నౌకని ఢీ కొట్టింది.

Capt. క్రిస్టోఫర్ హిల్ ని నియమించాక రెండు F/A-18 ఫైటర్ జెట్స్ కూలిపోయాయి!

So..! కెప్టెన్ ని మార్చడం వలన పరిస్థితిలో మార్పు రాలేదు.

డిఫెన్స్ నిపుణులు ఏమంటున్నారు?

అమెరికన్ రక్షణ రంగం పలు సవాళ్ళని ఎదుర్కుంటున్నది. బయటికి చెప్పకపోయినా నిధుల లేమితో పాటు నిపుణులు అయిన ఇంజినీర్ల కొరత వలన అమెరికన్ కారియర్లు మెయింటనెన్స్ చేయలేక ఇబ్బందులని ఎదుర్కుంటున్నది!

మొత్తం 11 విమాన వాహక యుద్ధ నౌకలు ఉన్నాయి అమెరికన్ నావీకి. వీటి జీవిత కాలం 50 ఏళ్ళు. ప్రస్తుతం అదునాతన కారియర్ అయిన గెరాల్డ్ R ఫోర్డ్ ( Gerald R Ford class) క్లాస్ నౌకని ప్రవేశపెట్టబోతున్నది కానీ ఈలోపు పాతవి మోరాయిస్తున్నాయి.

కనీసం నాలుగు కారియర్స్ లో windows xp ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుకలో ఉన్నాయంటే నమ్మబుద్ధి కాదు కానీ నిజం… అఫ్కోర్స్! ఇంకా ఫ్లాపి డ్రైవ్స్, ఫ్లాపి డిస్క్ లు వాడుకలో ఉన్నాయి అంటే అది అమెరికన్ నావీ కారియర్స్ అనే చెప్పుకోవాలి. విండోస్ Xp ని కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో మార్పు చేయాలంటే కనీసం రెండేళ్లు డ్రై డాక్ లో ఉండాల్సి వస్తుందని అలాగే కొనసాగిస్తున్నారు…

ఉన్న 11 కారియర్స్ లో 9 కారియర్స్ 40 ఏళ్ళ పాతవి. వీటిలో 5 మెయింటనెన్స్ కోసం డ్రై డాక్ లో ఉన్నాయి. ఇక రోజువారీ డ్రిల్స్ సంగతి సరేసరి!

అమెరికన్ నావికి అవమానం!

అమెరికన్ నావీ పోరాడుతున్నది ఒక దేశంతో కాదు, యేమెన్ దేశంలో ఉన్న తిరుగుబాటు గ్రూపు అయిన హుతీతో. హుతీ అనేది సైన్యం కాదు, కేవలం AK-47, గ్రనెడ్ లాంచర్స్ తో ఉన్న 1,60,000 మంది యుద్ధరంగంలో వాడే బూట్లు, హెల్మెట్స్ లేని ప్రవేట్ సైన్యం..m

ఒక అమెరికన్ క్యారియర్ గ్రూపుని ఎర్ర సముద్రంలో ముప్పతిప్పలు పెట్టి అవమానకరంగా వెనక్కి పంపిన హుతీలు!

నైపుణ్య కొరత!

కారియర్ కి రక్షణగా వెంట ఉండే ఆధునాతన ఫ్రీగేట్స్ అదే కారియర్ మీద నుండి టేక్ ఆఫ్ తీసుకుంటున్న F/A-18 ని ఫ్రెండ్లీ ఫైర్ తో కూల్చివేసింది అంటే ఎంతగా కన్ఫ్యూజ్ అయ్యారో అర్ధమవుతుంది.

ఇక హుతీల వ్యూహం అర్ధం చేసుకోలేక వాళ్ళ చేతిలో దెబ్బతినడం అనేది మరో అవమానం!

వరసగా చవకైన రాకెట్లు, క్రూయిజ్ మీసైళ్లతో హుతీలు దాడి చేస్తుంటే కారియర్ స్ట్రైక్ గ్రూపు ( Carrier Strike Group – CSG) అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోకుండా తమ ఎయిర్ డిఫెన్స్ ని చివరికంటా వాడేయడం పిచ్చితనం…

PHALANX అనేది యుద్ధ నౌక మీద ఉండే చివరి దశ ఎయిర్ డిఫెన్స్. దీనినే క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ ( Close In Weapon System – CIWS) అంటారు. నిముషానికి 4,500 రౌండ్లు బులెట్స్ ని పేలుస్తుంది. CIWS వాడుతున్నారు అంటే కారియర్ స్ట్రైక్స్ గ్రూప్ దగ్గర వేరే ఏ ఎయిర్ డిఫెన్స్ కూడా లేదని అర్ధం!

ఎప్పుడైతే CIWS వాడడం మొదలుపెట్టారో హుతీలు డ్రోన్ ద్వారా దూరం నుండి చూసి రాకేట్లని ఇంకా ఎక్కవ సంఖ్యలో ప్రయోగించి అమెరికన్లని కన్ఫ్యూస్ చేసి ఫైటర్ జెట్స్ కోల్పోయేలా చేయగలిగారు.

హాలివుడ్ సినిమాలో చూపించేది నిజం కాదని రష్యన్లు, ఇరానియన్లు, చైనీయులు కాదు హుతీలు చెప్పారు చూడండి..m అదే అసలైన అవమానం!

పీటర్ టర్చిన్ జోస్యం నిజం కాబోతున్నది!

డెడ్ ఏకానమి భారత్ ది కాదు, రష్యాది కాదు!

ఇల్యూమినాటి ఏకంగా మోడీతో తలపడి మొదటిసారి భంగపడబోతున్నది!

ట్రంప్ లు, జో బిడెన్ లు, ఒబామాలు బయటికి తెలిసే పేర్లు. ఇల్యూమినాటి అనేదే అసలు పేరు, శత్రువు ఈ ప్రపంచానికి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముందు నీ గోచీ బట్ట సరిచూసుకోవోయ్ ట్రంపూ… (పార్థసారథి పొట్లూరి)
  • బండి సంజయ్ గుడ్ వర్క్ … స్టేట్ సర్కారుకు తోడుగా సహాయక చర్యల్లో…!
  • ఈ వందేళ్ల పోచారం ఉక్కు గోడ… నిన్నటి మేడిగడ్డ ఓ పేక మేడ..!
  • ప్రకృతి అంటేనే అద్భుతాల కుప్ప… ఇది విష్ణు రాయి… ( Ravi Vanarasi )
  • 40 ఏళ్ల ఆ తొలి సినిమాకూ ఇప్పటికీ అదే లక్కు.. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
  • సాధ్యా… కేరళ సంప్రదాయ రుచుల పండుగ..! (Ravi Vanarasi)
  • నారా రోహిత్ జాబితాలో మరొకటి, అంతే… సుందరకాండ రివ్యూ…
  • రిస్కీ షాట్… అన్ని సీన్లూ అంత వీజీ కాదు… (దేవీప్రసాద్)
  • మోస్సాద్ వదిలేసిన ఏకైక టార్గెట్… ఎవరు అతను.. !? ( రమణ కొంటికెర్ల )
  • పెంకులు పగిలినా, ఇంటివాడు తిడితే అదొక ఆనందం..! (నగునూరి శేఖర్)

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions