Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ ఇంటిస్థలం వివాదంలో జూనియర్ లోతుగానే ఇరుక్కున్నాడు…!

May 18, 2024 by M S R

జూనియర్ ఎన్టీఆర్ కోర్టు మెట్లు ఎక్కాడు… నిందితుడిగా కాదు, బాధితుడిగా..? ఓ ఇంటిస్థలం విషయంలో…! నిజానికి ఇలాంటివి బోలెడు కేసులు… కానీ ఓ సినిమా సెలబ్రిటీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి మీడియా అటెన్షన్ పడింది… అంతే…

విషయం ఏమిటీ అంటే..? ఓ ఇంటిస్థలాన్ని జూనియర్ 2003లో కొన్నాడు… 600 – 700 గజాల స్థలం… అత్యంత ఖరీదైన ప్రాంతం… సరే, తన డబ్బు, తన చాయిస్… మరి ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వివాదంలో పడింది..? ఇదీ ప్రశ్న… పాత వివాదమే, ఎప్పుడు హైకోర్టు దాకా వెళ్లడంతో అందరికీ తెలిసింది…

జూనియర్ ఆ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ దగ్గర కొన్నాడు… అమ్మిన వ్యాపారి ఎవరో గానీ, అది గీత పేరిట రిజిష్టరై ఉంది కాబట్టి ఆమే జూనియర్‌కు రిజిస్ట్రేషన్ చేసి ఉంటుంది… తీరా చూస్తే ఆ స్థలం మీద వాళ్లు 1996లోనే రుణాలు తీసుకున్నారు బ్యాంకుల్లో… అదీ ఒక బ్యాంకు కాదు… మూడు బ్యాంకులట…

Ads

ఒక్క స్థలం మీద మూడు బ్యాంకులు లోన్ ఇవ్వడమేమిటనేది కాసేపు పక్కన పెడితే… బ్యాంకులు తాకట్టు పెట్టుకుని గానీ లోన్లు ఇవ్వవు కదా… ఎప్పుడైతే సదరు గీత జూనియర్‌కు అమ్మేసిందో బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి… ఆమె పట్టించుకోలేదు, జూనియర్ సరిగ్గా వివరాలు తెలుసుకోలేదేమో, కాగితాలు థరోగా పరిశీలించలేదేమో, లేక ఎవరైనా లాయర్ తనను మిస్‌లీడ్ చేశాడేమో…

గీత పత్తా లేదు… బ్యాంకులు ఈ స్థలం మాకే చెందుతుందని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి… ఇలాంటి లోన్లకు సంబంధించి బ్యాంకులు పక్కాగా సంతకాలు చేయించుకునే ఉంటాయి కాబట్టి ట్రిబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పు చెప్పింది… ఊహించిందే…

దీంతో జూనియర్ తనను మోసం చేశారంటూ గీతపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు… ట్రిబ్యునల్ తీర్పు మీద కోర్టుకెక్కాడు… కోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పుకు భిన్నంగా ఏమీ చెప్పకపోవచ్చు… మరిప్పుడు జూనియర్ ఏం చేయాలి..? నష్టపోవాల్సిందేనా..? కాదు…

వినిపించిన మరో ట్విస్టు ఏమిటంటే..? అలా కొన్న స్థలాన్ని జూనియర్ 2013లోనే ఎవరికో అమ్మేశాడు… బహుశా తను మోసపోయిన సంగతి తెలిసి ఉంటుంది, తనెవరికో అమ్మేసి చేతులు కడుక్కున్నాడు… ఒకరకంగా ఇదీ మోసమే అవుతుంది… బహుశా అలా కొన్నవాళ్లు బ్యాంకు నోటీసులకు బెదిరిపోయి జూనియర్‌ను అడిగి ఉంటారు… ఏదో రఫ్‌గా సీన్ రీక్రియేషన్ ఇది… నిజానిజాలు ఇంకేమైనా బయటికి తెలియనవి ఉన్నాయేమో తెలియదు… బట్, అంత విలువైన ప్రాపర్టీ ఓనర్‌షిప్‌ను వాళ్లు కూడా అంత తేలికగా వదిలేయరు కదా… పంచాయితీ పెడతారు…

ప్రస్తుతం ఈ స్థలంతో జూనియర్‌కు ఏ సంబంధమూ లేదని ఎన్టీయార్ టీం కూడా ఓ ప్రకటన చేసిందట… మరి కోర్టుకు ఎందుకు ఎక్కినట్టు అంటారా..? నేనే మోసపోయాను అని..! దానికి కోర్టు ఏం చేయగలదు..? ఆల్రెడీ తాకట్టు పెట్టబడిన ప్రాపర్టీ అది… పైగా తనకు జరిగిన మోసాన్ని దాచిపెట్టి, తను ఇంకెవరినో మోసం చేసినట్టు కూడా కోర్టు భావించవచ్చునేమో… సో, ఈ కేసు ఓ పీటముడి…

అప్పట్లో… అంటే 1996 భూమి విలువను బట్టి చాలా తక్కువకే ప్రాపర్టీ ప్లెడ్జ్ చేసి ఉంటారు… బ్యాంకు వడ్డీయే కాబట్టి తక్కువగానే బకాయి పెరిగి ఉంటుంది… ప్రజెంట్ రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా పెరిగి ఉంటుంది కాబట్టి… ఎవరో పెద్దలు కూర్చోబెట్టి, ఆ బ్యాంకు బకాయిల్ని క్లియర్ చేయించడమే సరైన మార్గం అవుతుందేమో… ఏమో, చివరకు అదే జరగవచ్చు..!! అలా జరిగినా జూనియర్‌కు కొంత చిలుం వదలకతప్పదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions