Murali Buddha…. అకస్మాత్తుగా ఓ జ్ఞాపకం… 90 ప్రాంతంలో సంగారెడ్డిలో ఉద్యోగం …. BHEL లో పని చేసే మిత్రుడు ఓ స్కీమ్ గురించి చెప్పాడు… మనం ఓ ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేస్తే రోజుకు ఒక శాతం వడ్డీ అంటే నెలకు 30 శాతం… ఇంకెవరినైనా చేర్పిస్తే మరింత వడ్డీ… ఈ చెయిన్ స్కీమ్ అప్పుడూ ఇప్పుడూ నడుస్తూనే ఉంటాయి…
ఈ స్కీమ్ గురించి చెప్పగానే, నెలకు 30 శాతం వడ్డీ మనకు ఇస్తే వాడు ఎంత సంపాదించాలి? ఇదంతా మోసం నమ్మవద్దు అని వివరంగా చెప్పాను… అతను నావైపు అమాయకుడా అన్నట్టు ఎగాదిగా చూసి, ‘‘ఇది మోసం అని నాకు తెలియదు అనుకుంటున్నావా ? మొదట డిపాజిట్ చేసిన వారికి అధిక వడ్డీ ఇస్తాడు… అందరిలోనూ నమ్మకాన్ని కలిగించడానికి అదొక స్ట్రాటజీ… దాంతో నమ్మకం కలిగి చాలా మంది డిపాజిట్ చేస్తారు. తరువాత వాడు పారిపోతాడు… నేను మొదట డిపాజిట్ చేసే వారిలో ఉంటాను, నాకు లాభమే కానీ నష్టం ఉండదు’’ అంటూ అతను ఉల్టా నాకే క్లాస్ చెప్పేసరికి …. వీడి డబ్బు వీడికి వస్తే చాలు, ఎంత మంది మునిగి పోతే నాకేం అనుకునే వాడి వైఖరి ఆశ్చర్యం కలిగించింది…
ఐతే ? అదానీ కంపెనీల్లో గోల్ మాల్ గురించి ఒక పరిశోధనాత్మక వ్యాసం రాగానే, ఈ రోజు స్టాక్ మార్కెట్ ఢమాల్ మంది . అదానీ మార్కెట్ విలువ 46 వేల కోట్లు పడి పోయింది… అదానీ కంపెనీల్లో గోల్ మాల్ అని వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు . గోల్ మాల్ గురించి అందరికి తెలుసు, మోడీ అండ ఉన్నంత వరకు ఆయనకు ఏమీ కాదనీ, అదానీ స్టాక్స్ రేట్స్ పైపైకి వెళుతూనే ఉంటాయని తెలుసు… మన అత్యాశే అదానీకి వరం… ఏమవుతుంది ? భయపడకు, ఓ వారం గడిస్తే కుంభకోణం మరిచిపోతాం, రెండు వారాలు గడిస్తే మళ్ళీ రేటు పెరుగుతుంది .. ఎందుకంటే మనం అత్యాశా పరులం…
Ads
Share this Article