.
ఆడవాళ్లు మీకు జోహార్లు . కె బాలచందర్ కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం వహించిన విషాదాంత సినిమా . ఆయన సుఖాంతం చేస్తే విశేషం కానీ విషాదాంతం చేస్తే ఆశ్చర్యం ఏమీ లేదు .
It appears that he is an embodiment of negativism and roughness in handling cinema plots . ఏ విశ్వనాధ్ లాగానో , రాఘవేంద్రరావు లాగానో , దాసరి లాగానో , క్రాంతికుమార్ లాగానో భావుకత , సున్నితత్వం , అందం ఉండవు .
Ads
దిగంబరత్వం అంటే పచ్చిగా చెప్పటం ఎక్కువ . గొప్ప సందేశాలు కూడా ఏమీ ఉండవు . మన కధో , పక్కింటి కధో , ఎదురింటి కధో చెప్పినట్లుగా ఉంటుంది .
1981 సంక్రాంతికి అంటే ఖచ్చితంగా ఈరోజుకి 44 సంవత్సరాలు అయింది ఈ సినిమా వచ్చి . 15-1-1981 న రిలీజయింది . తన తల్లి మరో మగాడితో పోవటాన్ని జీర్ణించుకోలేక తల్లినే చంపేసి ఆడాళ్ళ మీద , మనుషుల మీద ద్వేషం పెంచుకుని , రౌడీలాగా పెరిగిన ఓ మొరటోడిని ఒక స్త్రీ మంత్రిని చేసే కధ ఇది . అతని జీవితంలో తారసపడిన ఇద్దరు స్త్రీల గొప్పతనాన్ని చాటే సినిమా .
ఆ ఇద్దరు స్త్రీలల్లో ఒక స్త్రీగా జయసుధ బాగా నటించింది . సోషలిస్ట్ , హ్యూమనిస్ట్ . తండ్రి కేపిటలిస్ట్ . ఎప్పుడూ జనం గురించి ఆరాటపడే వ్యక్తి . లక్షలు ఉన్నా వాటిని వదిలేసి పేదలకు , పీడితులకు సేవ చేసేందుకు చిరు ఉద్యోగిగా పోలవరం చేరుతుంది . ఆ ఊళ్ళో పడవ నడుపుకునే మొరటోడ్ని మనిషిగా , తర్వాత మంత్రి అయ్యేలా చేస్తుంది .
ఇంతకన్నా గొప్ప పాత్ర వై. విజయది . Very practical woman role . తాను నడుపుకునే సారాయి కొట్టుకి ఓ రక్షకుడు కావాలి . వాడంటే తాగుబోతోళ్ళకు భయముండాలి . నన్ను ఉంచుకుంటావా అని వెనకపడి మొరటోడి ఉంపుడుకత్తె అవుతుంది .
పేరుకు ఉంపుడుకత్తె అయినా , చచ్చేలా ప్రేమిస్తుంది . క్లైమాక్సులో మంత్రి అయిన ఆ మొరటోడిని రక్షించేందుకు గ్రామంలోని షైలాకుని తానే చంపి జైలుకు వెళుతుంది . Highly talented actress Y Vijaya is . చాలా బాగా నటించింది .
ఈ ఇద్దరికే జోహార్లు . ఈ సినిమాకు ఐకానిక్ పాట కూడా అదే . ఆడాళ్ళూ మీకు జోహార్లు , మీరు ఒకరి కన్నా ఒకరు గొప్ప అంటూ ఈ ఇద్దరి ఔన్నత్యాన్ని చెప్పే పాటే ఆ ఐకానిక్ సాంగ్ . పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు . కె వి మహదేవన్ సంగీతాన్ని అందించినా పాటలు బయట హిట్ కాలేదు .
థియేటర్లో బాగానే ఉంటాయి . వినబులే . బాలచందర్ అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాలను మొరటుగా తీయటంలో సిధ్ధహస్తుడు . మొరటోడు కృష్ణంరాజు , సంస్కర్త జయసుధ గొడవ పడి బురదలో కొట్టుకుంటారు , రాజీపడి బురదలోనే బురదతోనే కౌగలించుకుంటారు . అలా ఉంటుంది ఆయన వరస . సరసంగా , సున్నితంగా ఉండదు ఆయన వరస .
మన సినిమాలలో మూడు వంతులు స్త్రీ ఔన్నత్యం గురించి చెప్పేవే . అదే కదా వాస్తవం , జీవితం . జీవితాలను నిలపాలన్నా వాళ్ళే . బతుకులు బండలు చేసినా వాళ్ళే . బరితెగిస్తే రాజ్యాలు రాజ్యాలే నాశనమయినా వాళ్ళే . పురుషుడి విజయానికి , వినాశనానికి , రెంటికీ వెనకా ముందూ పక్కన అంతా వాళ్ళే . ఆడాళ్ళ గురించి మగాళ్ళకు చెప్పడమేంటి ? ఒక్కో మగాడు ఒక్కో ఉద్గ్రంధమే వ్రాస్తాడు .
కృష్ణంరాజు , జయసుధ , వై విజయ , సరిత , భానుచందర్ , సాక్షి రంగారావు , త్యాగరాజులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏ అంతులేని కధ , ఆకలిరాజ్యం సినిమా లాగానో బాక్సుల్ని బద్దలు కొట్టలేదు . బాక్సులు త్వరగానే వెనక్కు వెళ్ళాయి .
బాలచందర్ మార్క్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కొంచెం కొంచెం బాగుండవచ్చు . గూడ్స్ బండి లాగా నడుస్తుంది . యూట్యూబులో ఉంది . కృష్ణంరాజు , జయసుధ అభిమానులు ట్రై చేయవచ్చు . నాకయితే జయసుధ పాత్ర కన్నా వై విజయ పాత్రే బాగా నచ్చింది .
ఈ సినిమాలో సరిత క భాష ఉంటుంది . మా చిన్నప్పుడు తెగ మాట్లాడుకునే వాళ్ళం ఈ క భాషలో . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article