Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో తెలుగు సినిమా అంటే బోలెడుమంది యాక్టర్లతో నిండుగా…

February 21, 2024 by M S R

Subramanyam Dogiparthi….    ఈ సినిమాతో మాకో కధ ఉంది . ఈ సినిమా రిలీజుకు కొద్ది రోజులు ముందు మా కాలీజి విద్యార్ధులం ఇండస్ట్రియల్ టూర్లో హైదరాబాద్ వెళ్ళాం . ANR ఇంటికి వెళ్ళాం . కాలేజి కుర్రాళ్ళం కదా , బాగా సరదాగా కబుర్లు చెప్పారు . ఈ అదృష్టవంతులు సినిమా గురించి చెపుతూ మీ కాలేజి కుర్రాళ్ళకు బాగా హుషారుగా ఉంటుంది , చూడండని చెప్పారు . ఆయన నిజమే చెప్పారు . జయలలిత బాగా నలిగింది . జగపతి పిక్చర్స్ బేనర్లో వి మధుసూధనరావు దర్శకత్వంలో అయిదు సెంటర్లలో వంద రోజులు ఆడింది . ప్రేక్షకులకు బాగా నచ్చింది .

ముఖ్యంగా చెప్పుకోవలసింది కె వి మహదేవన్ సంగీతం , పాటలు . అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేసావేమయ్యా , ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా , పాటలు కుర్రాళ్ళను ఉర్రూతలూగించింది . మొక్కజొన్న తోటలో మురిసిన చీకట్లలో అనే జానపద పాటలో జయలలిత నృత్యం చాలా బాగుంటుంది . నమ్మరే నేను మారానంటే నమ్మరే పాటలోని ఈ డైలాగ్ మనమందరం నిత్యం వాడేదే .
చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు , కోడి కూసే జాము దాకా తోడు రారా చందురూడా , నా మనసే గోదారి నీ వయసే కావేరీ పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ANR , జగ్గయ్య , గుమ్మడి , జయలలిత , గీతాంజలి , పద్మనాభం , విజయలలిత , ప్రభాకరరెడ్డి , రేలంగి , సూరేకాంతం , బేబీ రాణి , ఛాయాదేవి ప్రభృతులు నటించారు . ఆరోజుల్లో సినిమా అంటే చాలామంది ఏక్టర్లని ఎలాగోలా పెట్టేవారు . ముఖ్యంగా పాపులర్ ఏక్టర్లను . రేలంగో , పద్మనాభమో , గిరిజో లేకపోతే వాళ్ళెవరూ లేర్రా అని చెప్పుకునే వాళ్ళం .
anr
దేవుడి దయవల్ల. ఇప్పుడు హీరో గారే కమేడియను . హీరోయిన్ గారే వాంపు , ఐటెం గర్లూ . లింగులింగుమంటూ ఓ ముగ్గురు నలుగురితో సినిమాలను తీసేసి మన మొహాల్న వదులుతున్నారు . అందువలనే శతమానం భవతి వంటి ఫుల్ ఫేమిలీ సినిమాలు సక్సెస్ అయ్యాయి ఈమధ్య కాలంలో .
మన తెలుగు సినిమా కన్నా ముందే తమిళంలో శివాజీ గణేశన్ , కె ఆర్ విజయ , జయలలితలతో 1962 లోనే తిరుడన్ అనే టైటిల్ తో తీసారు . 1970 లో హిందీలో జితేంద్ర , ముంతాజ్ లతో హిమ్మత్ అనే టైటిల్ తో తీసారు . 1972 లో సింహళ భాషలో ఎదత్ సూర్య అదత్ సూర్య అనే టైటిల్ తో తీసారు .
జనానికి బాగా పట్టిన కధ . సెంటిమెంట్ , సాహసం , ఎమోషన్ వగైరా అన్నీ ఉన్న సినిమా . బిర్రయిన స్క్రీన్ ప్లే సినిమాను పరుగెత్తిస్తుంది . మా నరసరావుపేటలో నాగూర్వలి టాకీసులో చూసా . ఓ పది రోజుల కిందే టి విలో కూడా వచ్చింది . యూట్యూబులో ఉంది . 100% వినోదం , కాలక్షేపం , జయలలిత సౌందర్య వీక్షణం . #తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతా కాలమహిమ- చంద్రబాబా మహత్తు- ఆ లీలలెన్న తరమా !?
  • ‘యాదాద్రి’పై రేవంత్ రెడ్డి కొరడా ! కేసీయార్ నిర్వాకాలే అసలు తలనొప్పి !!
  • రజినీ ఒక్కడు చాలదా..? మరీ ఇన్ని కామియోలు ఎందుకురా బుజ్జా..!!
  • కట్టి, కూల్చి, మళ్లీ కట్టి… కేసీయార్ మార్క్ ‘ఇంజినీరింగ్ అద్భుతం’…
  • మళ్లీ తెరపైకి బనకచర్ల ! చంద్రబాబు తమిళనాడు నుంచి నరుక్కొస్తున్నాడా..!?
  • జాతీయ పరీక్షల్లో AI సాయం ! నందన్ నీలేకని ప్రతిపాదన భేష్ !!
  • గజల్ శ్రీనివాస్ అంటేనే… గజలియత్‌కు ఓ అవమానం, ఓ కళంకం !!
  • ఓ సామాజిక కథతో మళ్లీ కలిసిన సీతారాముల జంట!
  • ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!
  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions