Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మీ దుంపతెగ… ఈ కక్కుర్తి యాడ్స్ ఏంటిరా..? కథలోనే మిక్సింగా..?!

November 30, 2021 by M S R

జీతెలుగులో ప్రైమ్ టైమ్‌లో వచ్చే ఓ చెత్తా సీరియల్… అందులోని చెత్తతనం గురించి కాదు ఇక్కడ మనం చెప్పుకునేది… అదొక అంతులేని దరిద్రం… ఒక సీన్ చెప్పుకుందాం… ఒక ఎపిసోడ్ ముగిసిపోతున్నవేళ… అందులో విశాల్ అని ఓ నల్కా హీరో ఉంటాడు తెలుసు కదా, తను భార్య త్రినయని కళ్లు మూసి మెట్ల మీదుగా కిందకు తీసుకొస్తాడు… నీకో సర్‌ప్రైజ్ అంటాడు… ఎదురుగా రకరకాల చపాతీలు… అయ్యగారూ అని తెగ హాశ్చర్యపడిపోయి, దాదాపు మూర్ఛపోతుంది హీరోయిన్… అప్పుడు కిచెన్‌లోకి తీసుకెళ్లి ప్రీతి మిక్సర్ చూపిస్తాడు, జస్ట్, రెండు నిమిషాల్లో పిండి కలిపేస్తుంది తెలుసా అంటాడు… అప్పటికీ మనం షాక్ నుంచి తేరుకోం, సీరియల్‌లో ఈ ఎపిసోడ్ ఏమిట్రా, ఈ యాడ్ ఏమిట్రా, జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు కదరా అని తిట్టుకుంటాం… వెంటనే హీరోయిన్ అందుకుని హీరోకు శృతి కలుపుతుంది… థూదీనమ్మ జీవితం అనుకుని మీరు రిమోట్ తీసుకుని ఎడాపెడా నొక్కేస్తుంటారు… ప్రతి చానెల్‌లోనూ అడ్డగోలుగా యాడ్స్ ప్లే అవుతుంటయ్… మీరు రిమోట్‌ నేలకేసి కసిగా కొట్టేస్తారు…

trinayani

జోక్ కాదు.., టీవీలో యాడ్స్ ఎంత సేపు రావాలో కొన్ని రూల్స్ ఉన్నయ్… ట్రాయ్ అని ఓ దిక్కుమాలిన సంస్థ ఉంది లెండి, వాడు పెట్టాడు… కానీ ఏ ఉల్లంఘననూ పట్టించుకోడు… అసలు మనం చానెల్‌కు ఇంత అని చందా తీసుకుంటున్నారు కదా, మళ్లీ ఈ యాడ్స్ ఏమిటి అనడక్కండి, పేపర్‌కు కవర్ ప్రైస్ చెల్లించడం లేదా..? అందులో యాడ్స్ ఉండటం లేదా..? కొన్నిసార్లు పేజీలకొద్దీ జాకెట్ యాడ్స్, బ్రా యాడ్స్, హాఫ్ జాకెట్ యాడ్స్, ఫుల్ స్లీవ్ జాకెట్ యాడ్స్… కొన్నిసార్లు క్రియేటివ్ యాడ్స్ పేరిట నానా కంగాళీగా యాడ్ పేర్చేస్తారు… కక్కుర్తి యవ్వారం మరి… చానెళ్లు కూడా అంతే… అరె, యాడ్స్ మధ్య సీరియల్ ఏమిట్రా అనే విమర్శలు రావడంతో ట్రాయ్ గంటకు 10 నిమిషాల యాడ్స్ ప్లస్ 2 నిమిషాల సొంత యాడ్స్ అని రూల్ పెట్టింది… ఎహెపోరా అని చానెల్స్ 24 గంటల సమయంలో, ఎవరూ టీవీ చూడని రాత్రిపూట యాడ్స్ బంద్ పెట్టేసి, ప్రైమ్ టైమ్‌లో కుమ్మేసి, సగటున 10 + 2 పాటిస్తున్నాం అని చెప్పినయ్… కుక్క బుద్ధి…

Ads

ట్రాయ్ మళ్లీ కస్సుమన్నది… అది కాదురా, ప్రతి గంటకూ లెక్క తీస్తాం అనేసింది… వోకే వోకే, మేం పాటిస్తాం అని ముందుగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ వాడే ఒప్పుకున్నాడు… కానీ పక్కాగా ఉల్లంఘించేది వాడే… ఇలా లెక్క తీస్తే సగటున అరగంట సీరియల్‌ కనీసం 24 నిమిషాలైనా ఉండాలి… కానీ ఉండదు… సీరియల్ ఎపిసోడ్ చివరలో దాదాపు 10 నిమిషాలు యాడ్స్‌తో చావగొడతాడు… ఇప్పుడు మధ్యమధ్యలో సీన్స్ మధ్య రోడ్డు కనిపిస్తుంది… అందులో ఓ హోర్డింగ్, దానిపై ఏదో యాడ్… పేరుకు అది సీరియల్‌లో పార్ట్‌ అనిపిస్తుంది, కానీ యాడ్… ఇక ఇప్పుడు సీరియల్ కథ నడుస్తున్నప్పుడే ఇలా ప్రీతి మిక్సర్ యాడ్‌లాగా మిక్స్ చేసి కొట్టేస్తున్నారు… కొట్టండ్రా… రాను రాను హీరోయిన్ చందన బ్రదర్స్‌లోకి వెళ్తుంటుంది, ఆ పక్కనే కేఎల్ఎం ఫంక్షన్ హాల్ కనిపిస్తుంటుంది… గేటు బయట డెట్టాల్ శానిటైజర్ కొడతారు… లోనికి వెళ్లగానే సేల్స్‌మాన్ ఇంకేదో బ్రాండ్ చూపిస్తాడు… ఆమె బ్యాగ్ మీద ఏదో స్పోర్ట్స్ షూస్ పేరు కనిపిస్తుంటుంది… ఇలా రకరకాలుగా కుమ్మేయండ్రా… ఇంటికి వెళ్లగానే అత్తగారు ఈరోజు విజయలక్ష్మి డీర్ మినపగుళ్లతో వంట చేద్దామా అనడుగుతుంది, వద్దత్తయ్యా జొమాటోలో తెప్పిద్దాం అంటుంది ఈమె… సో, డైలాగ్స్‌లోనూ కొట్టండి… మీ దుంపతెగ… కథే ఇలా నడిపించండి…

ఎప్పుడైనా గమనించారా..? ప్రతి సీరియల్ ఎపిసోడ్‌ పది నిమిషాల్లో ముగుస్తుంది అనగా యాడ్స్ స్టార్టవుతయ్, మధ్యలో సీరియల్ స్టార్టవుతుంది… ప్రేమ ఎంత మధురం సీరియల్‌లో మరో నల్కా హీరో అమ్మతో ‘ఏంటమ్మా ఇది’ అంటాడు… అంతే, మళ్లీ మూడునాలుగు నిమిషాలు యాడ్స్… అప్పట్లో సుందరి సుబ్బారావు అని ఉషాకిరణ్ మూవీస్ సినిమా వచ్చింది… చాలా ఏళ్ల క్రితం… అంతకుముందే శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో ప్రియానందభోజ అంటే ప్రియా పచ్చడితో ఆనందంగా భోజనం చేయడం అనే ఓ చెత్తా యాడ్ డైలాగ్ కొట్టించారు కదా, ఇక సుందరి సుబ్బారావు సినిమాలో హీరో రోడ్డు మీద పరుగెడుతూ ఉంటాడు… పెద్ద హోర్డింగ్, అందులో సోమా యాడ్… మరో సీన్‌లో మార్గదర్శి యాడ్, ఇంకో సీన్‌లో ఈనాడు ప్రొడక్ట్ మరొకటి… సినిమా మొత్తం ఒకటే బ్రాండ్ ప్రమోషన్… ఆనాటి నుంచే ఉంది ఈ కరోనా ఒమైక్రాన్ వేరియంట్… మరి ఈ టీవీ సీరియళ్లు ఇలా యాడ్స్‌తో చావదొబ్బుతుంటే ట్రాయ్ ఏం చేస్తుంది అనే కదా మీ ప్రశ్న… ఎంత అమాయకులండీ బాబూ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions