సార్, బర్రెలక్క అఫిడవిట్ విశేషాలు ఏమిటి అనడిగాడు ఓ మిత్రుడు… కొల్లాపూర్ స్థానంలో ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థుల వివరాల్ని ఏడేసి వేల మంది డౌన్ లోడ్ చేసుకోగా, బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష వివరాల్ని 30 వేల మంది దాటి డౌన్ లోడ్ చేసుకున్నారు… మొత్తానికి ఈ అమ్మాయి ఓ సెన్సేషనే… మన రాష్ట్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భలే చర్చ జరుగుతోంది…
ఆ అఫిడవిట్ వివరాల్లోకి వెళ్తే… పేరు కర్నె శిరీష… తల్లి కర్నె అనురాధ… ఊరు, నాగర్‌కర్నూల్, పెద్ద కొత్తపల్లి మండలం, మర్రికల్ గ్రామం… విద్యార్హత, బీకామ్ (ఓపెన్ యూనివర్శిటీ)… ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టా సోషల్ మీడియా వేదికల్లో ఖాతాలున్నయ్… వయస్సు 26… వృత్తి, విద్యార్థి… పాన్ కార్డు ఉంది కానీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు…
Ads
అవివాహిత… కాబట్టి డిపెండెంట్స్ ఎవరూ లేరు… పెండింగ్ క్రిమినల్ కేసులు ఏమీ లేవు… అప్పట్లో ఒక యూట్యూబ్ వీడియోకు సంబంధించి 505-2 సెక్షన్ కింద కేసు పడింది… శిక్షల్లేవు, అప్పీళ్లు లేవు… (ఆమె అఫిడవిట్లో దాదాపు 90 శాతం ఖాళీలు నాట్ అప్లికబుల్…) చేతిలో నగదు 5 వేలు… ఏదో బ్యాంకులో 1500… మొత్తం 6500… నగల్లేవు, వాహనాల్లేవు, అప్పుల్లేవు, స్థిరాస్తుల్లేవు, చరాస్తుల్లేవు, భూముల్లేవు, పొదుపు కూడా ఏమీ లేదు, ఇల్లు లేదు… ఆమధ్య వీడియోలో చెప్పుకుంది కదా, నాలుగు బర్రెలు కొన్నట్టు… అవి కూడా లేవు… ఏ వీడియో తనను పాపులర్ చేసిందో అదే తన మీద కేసుకు కారణం కాగా, దాంతో ఆ బర్రెల్ని కూడా అమ్ముకున్నట్టు ఏదో వీడియోలో చెప్పిందామె…
ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు కూడా ఏమీ లేవు… బహుశా ఇంత సరళంగా రాష్ట్రంలో ఏ అభ్యర్థి అఫిడవిట్ లేదేమో… తనకు పది గుంటల భూమి ఉందని ఏదో వీడియోలో చెప్పినట్టు గుర్తు… అదీ అమ్మ పేరిట ఉండి ఉంటుంది… మొన్న తన సోదరుడి మీద దాడి జరిగింది కదా… ఎవరో లాయర్లు సహకరించారు… హైకోర్టుకు వెళ్లింది… తనకు ఒక గన్‌మెన్ రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది… మొత్తానికి తన వార్తలన్నీ వైరల్ ఇప్పుడు… మంచిదే… ధైర్యం, మొండితనం, చైతన్యం అంశాల్లోనే కాదు… నిరుద్యోగుల వెతలన్నీ ఈ ఎన్నికల్లో చర్చనీయాంశం చేసింది ఆమె… అది ఆమె మొదటి విజయం… ఆల్ ది బెస్ట్ బర్రెలక్కా అలియాస్ శిరీష…
Share this Article