.
పాకిస్థాన్‌కు రెండు వైపుల నుంచి నీటిదాడి..! ఇండియా ఇటువైపు నుంచి, అఫ్ఘనిస్థాన్ అటువైపు నుంచి… ఎలాగంటే..?
దశాబ్దాలుగా ఇండియా- పాకిస్థాన్ నడుమ అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందం నుంచి ఇండియా వైదొలిగింది… పాకిస్థాన్ వైపు స్వేచ్ఛగా, అధికంగా వెళ్తున్న నీటిని ఆపేసి, మళ్లించే ప్రణాళికల్లో ఉంది… ఇది పాకిస్థాన్ నీటి అవసరాలను దెబ్బతీయబోతోంది…
Ads
అందుకే అలా చేస్తే ఇండియా కట్టే ఆనకట్టలను, ప్రాజెక్టుల మీదకు క్షిపణి దాడులు చేసి, పేల్చేస్తామని పేలుతున్నారు కొందరు పాకిస్థానీ నాయకులు… అంతర్జాతీయ కోర్టుకు వెళ్తామని కూడా… అసలు ఆ ఒప్పందానికి మధ్యవర్తి, సాక్షి అప్పట్లో ప్రపంచబ్యాంకు… ఆ ఒప్పందం గడువు కూడా ఎప్పుడో పూర్తయింది…
ఆ 65 ఏళ్ల నాటి ఒప్పందానికి అసలు అంతర్జాతీయ చెల్లుబాటే లేదు… సో, కోర్టులు, క్షిపణి దాడులు పైపైన డొల్ల గాంభీర్యమే… ఇక ఇప్పుడు అఫ్ఘనిస్థాన్‌తో పాకిస్థాన్‌కు పడటం లేదు… మొన్న పరస్పరం దాడులు కూడా చేసుకున్నాయి… పాకిస్థాన్ అంటే మండిపడుతున్న అఫ్ఘనిస్థాన్ ఇప్పుడు ఇండియాతో సానుకూలంగా ఉంటోంది…
శత్రువుకు శత్రువు మిత్రుడు… పైగా ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అఫ్ఘనిస్థాన్ ఎప్పుడూ కీలకంగానే ఉంటోంది… సో, ఇండియా కూడా అఫ్ఘనిస్థాన్ చేసే పాక్ వ్యతిరేక యుద్ధానికి సై అంటూ గళం కలుపుతోంది… అఫ్ఘనిస్థాన్ కూడా సింధు జలాలు పాకిస్థాన్ వైపు పోకుండా ఆపేస్తానని తాజాగా ప్రకటనలు చేస్తోంది… ఇది పాకిస్థాన్‌లో జలసంక్షోభానికి దారితీసే ప్రమాదమూ ఉంది…
అసలు సింధు నదికీ అఫ్ఘనిస్థాన్‌కూ సంబంధమేమిటి అంటారా..? ఉంది..!

పైన మ్యాప్ చూశారు కదా… కునార్ నది మార్గం… ఈ ఉపనది పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని హిందూ కుష్ పర్వతాలలో మొదలై, దక్షిణం వైపున ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవహించి, కునార్, నంగర్‌హార్ ప్రావిన్సుల గుండా ప్రవహిస్తుంది…
ఆఫ్ఘనిస్తాన్‌లో ఇది కాబూల్ నదిలో కలుస్తుంది… ఆ తరువాత, ఈ సంయుక్త నది మళ్లీ తూర్పు వైపున పాకిస్తాన్‌లోకి ప్రవేశించి, ఆ దేశంలోని అటక్ నగరానికి సమీపంలో సింధు నదిలో కలుస్తుంది…
కాబూల్ నది (ఇది కునార్ నదితో కలిసిన తరువాత ఏర్పడుతుంది) పాకిస్తాన్‌లోకి ప్రవహించే అతిపెద్ద నదులలో ఒకటి… సింధు నదిలాగే, ఇది కూడా ఆ దేశానికి సాగునీరు, తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తికి కీలక ఆధారం… ఆఫ్ఘనిస్తాన్ ఈ నదిపై ఆనకట్టలు నిర్మిస్తే, పాకిస్తాన్‌లోని వ్యవసాయ క్షేత్రాలు, ప్రజలకు నీటి కొరత మరింత తీవ్రమవుతుంది…
ఇప్పడు అఫ్ఘనిస్తాన్ కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించడానికి రెడీ అయిపోయింది… ఇదీ పాకిస్థాన్ మీద విసిరే జలాస్త్రం… అఫ్‌కోర్స్, తమ ప్రాంతంలో ప్రవహించే నదీప్రవాహాన్ని తమ అవసరాలకు వాడుకునే హక్కు అఫ్ఘనిస్థాన్‌కు ఉంది… దానికీ నీటి అవసరాలున్నాయి…
పైగా పాకిస్థాన్ పంచాయితీ పెట్టడానికి సింధు నదీజల ఒప్పందం వంటిది ఏమీ లేదు ఇప్పటికీ..! సో, పాకిస్థాన్ కొట్లాడటానికి మార్గం, ఆధారం ఏమీ లేవు…
అఫ్ఘనిస్థాన్ ఆపద్ధర్మ జలవనరుల శాఖ మంత్రి ముల్లా అబ్దుల్ లతీఫ్ మన్సూర్ కూడా ఎక్స్ పోస్టులో ‘‘తమ నీటిని తామే నిర్వహించుకునే హక్కు ఆఫ్ఘన్‌లకు ఉంది” అని పేర్కొన్నాడు… ఈ ఆనకట్టల నిర్మాణాన్ని విదేశీ సంస్థల స్థానంలో దేశీయ సంస్థలే చేపడతాయన్నాడు…
ఇదేకాదు, అఫ్ఘనిస్థాన్ తన ఉత్తర ప్రాంతంలో నిర్మిస్తున్న ఖోష్ టెపా కాలువ మరో వివాదం… 285 కిలోమీటర్ల కాలువతో 5.5 లక్షల హెక్టార్ల బీడుభూమిని వ్యవసాయ యోగ్యం చేయాలని దాని ప్రయత్నం… ఈ కాలువ అము దర్యా నదిలోని నీటిని 21 శాతం వరకు మళ్లించే అవకాశం ఉంది… దీంతో ఇప్పటికే నీటి కొరత ఉన్న ఉజ్బెకిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్ వంటి మధ్య ఆసియా దేశాలకు దెబ్బ…
సో, అఫ్ఘనిస్థాన్ నీటి ప్రాజెక్టులు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరించి పెంచబోతున్నాయి… పాకిస్థాన్ ఆప్త మిత్రుడు ట్రంపు ఇంకా ఈ విషయంపై ఏమీ కూయలేదు… చూడాలిక…
Share this Article