వివిధ విపత్తులు, ఇతర సందర్భాల్లో ప్రజల్ని ఆదుకోవడం కోసం విరాళాలు వసూలు చేస్తే… వచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పి, ఆ డబ్బును ‘కనిపించే’ ఉపయుక్త పనులకు ఉపయోగించడంలో ఈనాడు నిజాయితీ గొప్పది… మీరు ఈనాడును ఎన్ని విషయాల్లో ఎన్నిరకాలుగా తిట్టుకున్నా సరే ఈ విషయంలో మాత్రం ఈనాడు పారదర్శకత అభినందనీయం… ఆంధ్రజ్యోతి పూర్తి కంట్రాస్టు… అప్పట్లో అమరావతి రాజధాని పేరిట ఏదో డబ్బు వసూలు చేసినట్టు గుర్తు… ఆ డబ్బు 2.5 కోట్లు చంద్రబాబు చేతుల్లో పోసింది… ప్రభుత్వం, చంద్రబాబు జోలెపట్టి, సచివాలయంలో హుండీలు పెట్టి, ఇటుకలు అమ్మారు… ఆ డబ్బు రాజధాని నిర్మాణవ్యయంతో పోలిస్తే ఎంత..? కాకపోతే రాజధాని హైప్ క్రియేషన్, ఎమోషన్ బిల్డింగ్, ప్రచారానికి తెలుగుదేశం అనుబంధ విభాగం అన్నంతగా ఆంధ్రజ్యోతి ఇన్వాల్వయింది… (ఆ రెండున్నర కోట్లను చంద్రబాబు ఏం చేశాడు..? మళ్లీ అడక్కండి ఈ ప్రశ్న… మర్యాద దక్కదు…)
ఆంధ్రజ్యోతి మరీ నాసిరకం వ్యవహారశైలికి మరో ఉదాహరణ… సయామీ కవలలు వీణ-వాణి పేరిట ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ తొమ్మిదేళ్ల క్రితం విరాళాలు సేకరించింది… రెండున్నర లక్షల దాకా వచ్చాయి… ఆ డబ్బేదో రాధాకృష్ణ తనే స్వయంగా ఇచ్చేసినా బాగుండేది… ఆ వసూలైన డబ్బులో అవసరాల కోసం వీణ-వాణి తండ్రి పదివేలు అడిగినా ఆంధ్రజ్యోతి ఇవ్వలేదు, ఆ సొమ్ము ఏమైందో ఎవరికీ తెలియదు… ఈ స్థితిలో కెసిఆర్ కుర్చీ ఎక్కిన కొన్నాళ్లకు నమస్తే తెలంగాణ ఓ కథనం రాసింది… ఆ సొమ్ము స్వాహా అయిపోయిందని..! (అప్పట్లో నమస్తే వర్సెస్ ఆంధ్రజ్యోతి డిష్యూం డిష్యూం నడిచేది)… ఎహె, తప్పుడు వార్తలు రాయకండి, ఉన్నది మీ సర్కారే కదా, చేతనైతే విచారణ జరిపి, అక్రమాల్ని నిర్ధారించండి అని ఆంధ్రజ్యోతి ఉల్టా సవాల్ విసిరింది… ఇలా… (అఫ్ కోర్స్, ఇవన్నీ పైపైన పంచాయితీలే, నిజానికి కేసీయార్-ఆర్కే స్నేహం నాగార్జున సిమెంటు అంత దృఢమైంది…)
Ads
-
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!..
- వీణ-వాణి కోసం సేకరించిన
- విరాళాలపై అడ్డగోలు రాతలు
- పిల్లల ఆపరేషన్ కోసమే సేకరణ
- తల్లిదండ్రుల సాయం కోసం కాదు
- ఇప్పటికీ నిలోఫర్‌లోనే ఉన్న కవలలు
- శస్త్రచికిత్సపై పట్టించుకోని ప్రభుత్వం
- మా ప్రత్యేక ఖాతాలో భద్రంగా సొమ్ము
- ప్రతి పైసాకూ పకడ్బందీ లెక్క
- సర్కారు మీదేగా.. విచారణా చేసుకోండి
- ఇది ‘ఆంధ్రజ్యోతి’ సవాల్
వీణ-వాణి తండ్రి వరంగల్‌లో ధర్నా చేసి, ఆర్కే దిష్టిబొమ్మను దహనం చేసినట్టు.., పలువురు జర్నలిస్టులు-లాయర్లు ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసినట్టు.., కొందరు కోర్టులో కేసులు వేసినట్టు… ఇలా రకరకాల వార్తలు అప్పట్లో హల్‌చల్ చేశాయి… 2015లోనే ఆ డబ్బును వడ్డీతో కలిపి… 4 లక్షలు నీలోఫర్ హాస్పిటల్‌కు పంపామని, కానీ అది వెనక్కి వచ్చిందని కూడా ఆంధ్రజ్యోతి మొదట్లో చెప్పుకుంది… (ఆ సయామీ కవలల పేరిట వచ్చిన సొమ్మును అలాగే లెడ్జర్‌లో చూపిస్తూ, అలాగే భద్రంగా ఉంచినట్టయితే, మరి దానికి వడ్డీ ఎందుకు లెక్కించినట్టు..? అంటే అవసరాలకు వాడేసుకుని, వడ్డీ చెల్లిస్తున్నాడా..? అసలు అది నైతికమేనా..? మళ్లీ ఇవి కొత్త ప్రశ్నలు…) మరి ఇంత గొడవ జరుగుతున్నా సరే, ఆంధ్రజ్యోతి క్రెడిబులిటీ దెబ్బతింటున్నా సరే, ఆ డబ్బు సంగతి ఏదో తేల్చేయకుండా… తీరా ఇప్పుడు హఠాత్తుగా 5.3 లక్షల రూపాయల్ని తెలంగాణ సర్కారుకు అందజేసింది… ఇన్నాళ్లూ ఊరుకున్నది ఎందుకు..? ఇప్పుడు ఈ కదలిక ఏమిటి..? ప్రతి అడుగూ డౌట్ ఫుల్లే…
Share this Article