మీకు కేరళ మాజీ ఆరోగ్య మంత్రి శైలజ గుర్తుందా..? శైలజ టీచర్ అని పిలుస్తారు… నిఫా వైరస్ ప్రబలినప్పుడు గానీ, కరోనా ఆరంభదినాల్లో గానీ ఓ ఆరోగ్యమంత్రిగా తన శాఖకు సమర్థ నాయకత్వం అందించి, అందరికీ ఆదర్శంగా నిలిచింది… పార్టీకి ఎంత విధేయురాలో, చేయాల్సిన పని పట్ల కూడా అంతే విధేయురాలు… కానీ పార్టీ పదే పదే ఆమె రెక్కలు కత్తిరిస్తూనే ఉంటుంది… పార్టీ క్రమశిక్షణ పేరిట ఆమె లోలోపల ఎలా ఉన్నా, పైకి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది…
బంగారం స్మగ్లింగ్ దగ్గర నుంచి ఎన్నెన్నో ఆరోపణలు సీఎం పినరై విజయన్ చొక్కాను మురికి చేస్తూనే ఉన్నయ్… పార్టీ క్రమశిక్షణను ప్రశ్నార్థకం చేస్తూనే ఉన్నయ్… మరోవైపు రియల్ వర్కర్, లాయల్ అయిన శైలజ వంటి నేతలకు మాత్రం హ్యుమిలియేషన్ తప్పడం లేదు… అసలు ఆమెను మంత్రిగా కొనసాగించకపోవడం, అసలు కేబినెట్‌లోకే తీసుకోకపోవడంతోనే అందరూ ఆశ్చర్యపోయారు… పైగా ఆమె పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్…
2021 ఎన్నికల్లో ఆమె 60 వేల వోట్ల మెజారిటీ గెలిచింది… ఆమె గెలుపు రెండోసారి… మరి మంత్రిగా కొనసాగింపు ఎందుకు దక్కలేదు..? ఈ ప్రశ్నకు పార్టీ జవాబు ఇవ్వదు, ఇవ్వలేదు… ఇప్పుడేమో ఆమెకు మెగసేసే అవార్డు ప్రకటిస్తే, ఠాట్, వీల్లేదు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, రిజెక్ట్ చేయాల్సిందే అని పార్టీ ఆంక్ష పెట్టింది… పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యురాలిగా పార్టీని అడక్కుండా అవార్డు తీసుకుంటే బాగుండదని ఆమె పార్టీ అనుమతి కోరింది… అంతే పార్టీ నో అని గట్టిగా చెప్పింది…
Ads
ఇదేమిటయ్యా అంటే..? నిఫా వైరస్, కరోనా వైరస్ వ్యాప్తి, చికిత్స విషయాల్లో ఆమె వ్యక్తిగత విజయం ఏముంది..? అదంతా ఆరోగ్య శాఖ, ప్రభుత్వ ఉమ్మడి కృషి, తనొక్కతీ ఎలా క్లెయిమ్ చేసుకోగలదు అని ఓ పిచ్చి ప్రశ్నను పార్టీ జనంలోకి వదులుతోంది… కానీ ఆ అవార్డు పేరుకు ఆమెకు ఇస్తున్నా గానీ, అది స్థూలంగా ఆ ప్రభుత్వ కృషికి గుర్తింపు అనే సోయి లేకుండా పోయింది సీపీఎం పార్టీకి… కానీ పార్టీ చెప్పాక ఏం చేయగలదు..? ఆ అవార్డును తిరస్కరించింది… పార్టీ నిర్ణయం విన్నాక పార్టీ సభ్యులే పార్టీ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా తప్పుపడుతున్నారు…
ఆమె గనుక ఆ అవార్డును తీసుకుంటే, కేరళ నుంచి ఆ అవార్డు పొందిన తొలి మహిళ అయి ఉండేది… గవర్నమెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్, ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్, జర్నలిజం, సాహిత్యం, లీడర్‌షిప్ వంటి రంగాల్లో ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తుంటారు… సత్యజిత్ రాయ్, ఆర్కే లక్ష్మణ్, టీఎన్ శేషన్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, వర్గీస్ కురియన్, ఎంఎస్ స్వామినాథన్ వంటి ప్రముఖులు స్వీకరించారు… వాళ్లెవరికీ లేని అభ్యంతరం సీపీఎంకు ఎందుకు..?
ఎందుకు అంటే..? ఈ అవార్డు ఎవరి పేరిట ఉందో, ఆ రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు గెరిల్లాలను ఉక్కుపాదంతో అణిచివేశాడట… సో, ఆయన పేరిట అవార్డు తీసుకోవడం అనైతికమట… పైగా ఆరోగ్య మంత్రిగా విజయం శైలజ వ్యక్తిగత ప్రతిభ, వర్క్ కాదట, సామూహిక కృషి అట… ఆ అవార్డును యాక్టివ్ పొలిటిషియన్స్ తీసుకోవడం సంప్రదాయం కాదట… పాపం, ఆమె ఇంకేం చేయగలదు..? ‘‘మా ఆరోగ్యశాఖ ఉమ్మడి కృషి, వ్యక్తిగత హోదాలో ఆ అవార్డు తీసుకోవడం కరెక్టు కాదు అనే పార్టీ నిర్ణయం మేరకు ఆ అవార్డును తిరస్కరించాను, ఇదే విషయాన్ని ఆ ఫౌండేషన్ వాళ్లకు చెప్పేశాను’’ అంటోంది ఆమె…
పార్టీ చెప్పేవన్నీ సాకులే.,. ఒకదానికి మరోదానికి లంకె కుదరదు… ఆమె వ్యక్తిగత ప్రతిభ ఏమీ లేదని చెప్పాలనుకుంటే దానికే కట్టుబడాలి, మళ్లీ గతంలో కమ్యూనిస్టుల మీద సదరు అధ్యక్షుడు క్రూరమైన హింసకు పాల్పడ్డాడు కాబట్టి అవార్డు తీసుకోవడం లేదు అని మరో కారణం చెబుతున్నారు… మళ్లీ వాళ్లే యాక్టివ్ పొలిటిషియన్స్ తీసుకోవడం సంప్రదాయం కాదు అంటున్నారు… హేమిటో… చివరకు ఏచూరి సీతారావుడూ అలాగే మాట్లాడుతున్నాడు..!!
మిస్టర్ ఏచూరీ… ఒక్క ప్రశ్న… ఆమె వ్యక్తిగత ఘనతేమీ లేదని అంటున్నావు కదా, అదంతా సమిష్టి కృషి అంటున్నావు కదా… మరి గత ఏడాది ఆమెకు ది సెంట్రల్ యూరోపియన్ యూనివర్శిటీ ఓపెన్ సొసైటీ ప్రైజ్ ఇచ్చినప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదెందుకు..? దీనిపై మరింత హాస్యాస్పద జవాబు ఏమిటంటే… ‘‘సదరు యూనివర్శిటీ ఆమెను ముందుగా అనుమతి అడిగి ప్రకటించలేదు, ఏకపక్షంగా డిక్లేర్ చేసింది, అందుకే రిజెక్ట్ చేయలేదు… మెగసెసే వాళ్లు ముందుగా ఆమె అనుమతి అడిగారు, అందుకని రిజెక్ట్ చేసింది’’… వారెవ్వా… ఎంతటి ఘనత కలిగిన పార్టీయో..!!
Share this Article