.
శామ్ పిట్రోడా… ఓ పర్వర్టెడ్ కాంగ్రెస్ మేధావి… పిచ్చి కూతలకు, తలతిక్క వ్యాఖ్యలకూ పెట్టింది పేరు… తరచూ పార్టీ ఆగ్రహానికి గురవుతాడు… కొన్నిసార్లు బహిష్కరణలు కూడా…
మళ్లీ ఎవడూ దిక్కులేనట్టుగా పార్టీలోకి తీసుకుంటారు, అదే కాంగ్రెస్ అంతర్జాతీయ విభాగానికి మరెవరూ పోటీలేని కేరక్టర్‌గా మళ్లీ చేరతాడు… తాజాగా మళ్లీ కూశాడు సారు వాడు…
Ads
‘చైనాను ఓ శత్రువుగా చూడటం మానేయాలి… ఇండియా ఎప్పుడూ దాంతో ఘర్షణాత్మక వైఖరితోనే ఉంటోంది… అందుకే ఉద్రిక్తతలు… ఆ దేశాన్ని గౌరవించడం, గుర్తించడం ప్రారంభిస్తే సమస్యలు ఉండవు… చైనా విషయంలో ఇండియా వైఖరికి మద్దతు దక్కడం లేదు, చైనా పట్ల మన వైఖరి మనకు కొత్త శత్రువులను సృష్టిస్తోంది…’ అంటూ ఏదేదో చెబుతూ పోయాడు…
వెంటనే తనపై ట్రోలింగ్ స్టార్టయింది… అసలు తనకు తలకాయలో ఏమైనా గుజ్జు ఉందాని విమర్శలు… చైనా ఇండియా పట్ల అనుసరించిన వైఖరి ఏమిటో, చరిత్ర ఏమిటో తెలియని మూర్ఖత్వం ఏమిటని విసుర్లు… నిజమే కదా… ఒక్క ఇండియా మాత్రమే కాదు, చైనాకు సరిహద్దులున్న ప్రతి దేశంతోనూ దానికి గొడవలే, వివాదాలే…
ఆక్సాయ్‌చిన్ ఆక్రమణ, పాకిస్థాన్‌కు మద్దతు, ఉగ్రవాదంపై పోరులో సహాయ నిరాకరణ దగ్గర నుంచి అనేకానేక అంశాల్లో చైనా గెలికి మరీ కయ్యం పెట్టుకునే బాపతు… మొదట్లో నెహ్రూ అవలంబించిన విదేశాంగ విధానంలోని తప్పులు ఈరోజుకూ ఇండియాకు నష్టదాయకంగానే ఉన్నాయి… ప్రత్యేకించి చైనా పట్ల…
ఇవన్నీ తెలియవా పిట్రోడాకు..? లేక కావాలని ఏదైనా రచ్చ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడా..? తన తత్వమే అదా..? అప్పట్లో కాంగ్రెస్, చైనా కమ్యూనిస్టు పార్టీ నడుమ ఏవో ఒప్పందాలు గట్రా ఉన్నాయి… పదే పదే రాహుల్ గాంధీ అదుగో చైనా ఇన్ని వేల కిలోమీటర్ల మన భూమిని కొత్తగా ఆక్రమించింది, మోడీ ఏం చేస్తున్నాడంటూ విమర్శలు చేస్తుంటాడు…
ఈ నేపథ్యంలో శామ్ పిట్రోడా చైనా అనుకూల వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని డిఫెన్సులో పడేశాయి… ఇలాంటి సందర్భాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాంరమేష్ వెంటనే తెర మీదకు వచ్చి డ్యామేజీ కంట్రలో ప్రయత్నం చేస్తాడు తెలుసు కదా…
వచ్చాడు… అబ్బే, శామ్ పిట్రోడా వ్యాఖ్యలు తన వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదు… అది పార్టీ వైఖరి కానే కాదు అని నష్టనివారణ సర్దుబాట్లకు ప్రయత్నించాడు… నో, నో, శామ్ పిట్రోడా మీద ఏ యాక్షనూ ఉండదు, ఒకవేళ పార్టీ నుంచి బయటికి గెంటేసినా సరే, మళ్లీ నాలుగైదు రోజుల్లో వచ్చేస్తాడు, అదే పదవిలోకి..! నో డౌట్..!!
Share this Article