.
టీవీ షోలకు, ప్రేమాయణాలు, బ్రేకప్పులకు సంబంధించి ఏదైనా ఇష్యూ దొరికితే ఇక దాన్ని పదే పదే చూపించి, చెప్పించి పెంట పెంట చేస్తుంటారు…
కావ్య, నిఖిల్ ఇద్దరూ కన్నడిగులే… కలిసి ఏదో పాపులర్ తెలుగు సీరియల్ కూడా చేశారు… ఐదారేళ్లుగా కలిసే తిరిగారు, ప్రేమబంధంలో ఉన్నారని కొందరు, లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారని కొందరు రాసుకొచ్చారు, వాళ్లేమీ ఖండించలేదు… త్వరలో పెళ్లి చేసుకుంటారు అనుకునే దశలో ఏమైందో ఏమో గానీ బ్రేకప్…
Ads
నిఖిల్ వైపే తప్పు ఉన్నట్టుంది,… బిగ్‌బాస్ విజేత కదా తను, ఆ షోలోనే ఓసారి బయటపడ్డాడు… షో అయిపోగానే వెళ్లి ఆమె ఎదుట తలవంచుకుని నిలబడతాను అన్నాడు… ఆ షో వస్తున్నప్పుడే నిఖిల్‌ను పరోక్షంగా మోసగాడు అనే అర్థమొచ్చేలా ఆమె ట్వీట్లు పెట్టింది…
తరువాత నిఖిల్ కూడా వదిలేశాడు… ఓసారి టీవీ షోలో శ్రీముఖి గోకి, ఏదో చెప్పించడానికి ప్రయత్నించింది కానీ తను లైట్ తీసుకున్నాడు… సేమ్, మళ్లీ… ఫ్యామిలీ స్టార్స్ అనే షో చేస్తుంటాడు కదా సుధీర్… తనతో మళ్లీ కావ్యను అడిగించారు షో నిర్వాహకులు… మీరు సింగిలా… లేక మరేమైనా అంటూ…
కావాలని నిఖిల్ మీద ఏదో అనిపించడానికే, అది ప్రోమో కావడానికే… ఆమె ఒకడిని నమ్మడం నా జీవితంలో అతి పెద్ద బ్లండర్ అంటూ నిఖిల్ మీద మళ్లీ నోరు పారేసుకుంది… అనవసరం… మీ ప్రేమ ఒడిశిన కథ… పదే పదే గీక్కుని, గిచ్చుకునే అవసరం లేదు…
మరోవైపు ఇదే సుధీర్, రష్మిల ప్రేమాయణం మరో తరహా… పదేళ్ల నుంచి టీవీ షోల కోసం ప్రేమను నటిస్తూనే ఉన్నారు… ఇద్దరికీ కారణాలేమో తెలియవు గానీ పెళ్లి కాలేదు… ఒంటరి పక్షులే… మా నడుమ దోస్తీ తప్ప లవ్వు, గివ్వు, కొవ్వు ఏమీ లేవురా బాబూ అని వాళ్లే పలుసార్లు చెప్పారు… ఐనా వాళ్ల లవ్ ట్రాక్‌కు… వాళ్లిద్దరూ కలిసి షో చేయకపోతున్నా సరే… మస్తు డిమాండ్…
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్లీ ఆ ప్రస్తావన తెచ్చాడు హైపర్ ఆది… స్క్రిప్టు రచయితలు తెప్పించారేమో… రష్మి లవ్ స్టోరీకి ఆ పాపులారిటీ ఉంది కదా… పదే పదే అదే… ఎవరైనా నిజంగా ఉన్నారా (నీ లవ్వులో) అని ఆది అడిగితే, ఉన్నాడు, కానీ మీవాడు కాదు (సుధీర్ కాదని) అనేసింది ఆమె… సరే, అది ప్రోమో… స్క్రిప్టెడ్… కానీ ఎన్నేళ్లయినా వన్నెతరగని లవ్ ట్రాక్ వాళ్లది…
ఈమధ్య టీవీ షోలలో పర్సనల్ విషయాల్ని చెప్పించి, తిట్టించి, కన్నీళ్లు కార్పించి, కోపగించేలా చేసి, ఏవో గుర్తుకు తెచ్చుకునేలా చేసి… షోలకు ఎమోషన్ అద్దుతున్నారు… తాజా ఫ్యామిలీ స్టార్ ప్రోమోలో బిగ్‌బాస్ ఫేమ్ అరియానా, ఆషురెడ్డి కూడా అలాగే ఒకరిని ఒకరు నిందించుకున్నారు… అదీ స్క్రిప్టేనా..? రియలా..? తెలియదు..!!
Share this Article