ఒక్కొక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు… నానాటికీ నాసిరకం సరుకు నిండిపోతోంది… టీవీ రేటింగ్స్ ఢమాల్ ఢమాల్ అని పడిపోతున్నయ్… ఐనా సరే, జబర్దస్త్ నిర్మాతలకు సోయి లేదు, అక్కడ మిగిలిపోయిన వాళ్లకూ లేదు… అసలే అంతంతమాత్రంగా ప్రజాదరణ ఉన్నప్పుడు కాస్త మనసు పెట్టి మంచి స్కిట్స్ చేయాలి… థర్డ్ రేట్ కామెడీతో విసిగిస్తూ, మరోవైపు వెళ్లిపోయిన వాళ్ల మీద వెకిలి వ్యాఖ్యలు దేనికో మల్లెమాల ప్రొడక్షన్స్‌కే తెలియాలి…
9వ తేదీ ప్రసారం కాబోయే జబర్దస్త్ ప్రోమో ఒకటి విడుదలైంది… ఎప్పటిలాగే కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జిలు, సౌమ్య యాంకర్… ఓ స్కిట్లో ఓ కమెడియన్ వచ్చిన రాకెట్ రాఘవను ‘‘మంచితనం ఇన్నాళ్లూ కామెంట్లలోనే చూశాను, ఇప్పుడు నిజంగా కళ్లారా చూస్తున్నాను, కామెంట్లు నువ్వు రాయించుకునేవాడివా..?’’ అనడుగుతాడు… నిజానికి ఈ వ్యాఖ్య స్కిట్‌లో అస్సలు సెట్ కాలేదు… దానికి రాఘవ ‘‘అలా రాయించుకున్నోళ్లు వాయించుకుని ఎప్పుడో బయటికి వెళ్లిపోయారు…’’ అంటాడు…
రాఘవ ఎప్పుడూ కాస్త సెన్సిబుల్‌గా మాట్లాడతాడు అనుకునేవాళ్లం… ఎవరి జోలికీ వెళ్లకుండా, ఎవరినీ కామెంట్ చేయకుండా తన పనేదో తాను చేసుకుంటాడనీ అనుకున్నాం… కానీ వెళ్లిపోయిన ఓ తోటి ఆర్టిస్టు మీద ఏమిటీ పిచ్చి వ్యాఖ్యానం… నిజానికి కామెంట్లలో తోపు, సూపర్, బంపర్ అని తరచూ సుడిగాలి సుధీర్ పేరిట కనిపిస్తుంటాయి… దాని మీద కూడా రకరకాల జోకులు పలు స్కిట్లలో వేశారు… వాటిని సుధీర్ ఎప్పటిలాగే తన సహజ తత్వంతో లైట్ తీసుకుని, తనూ నవ్వేసి వదిలేశాడు…
Ads
తను వెళ్లిపోయాడు… తన సినిమా ఒకటి హిట్టయింది… ఈరోజు జబర్దస్త్ కమెడియన్ కాదు తను… టాలీవుడ్‌లో ఓ చిన్నపాటి హీరో… అలాగే ఆహాలో కామెడీ ఎక్స్‌చేంజ్ వంటివీ హోస్ట్ చేస్తున్నాడు… ఎవరు వెక్కిరించినా, ఎవరు వ్యంగ్యాన్ని తనపై రుద్దినా నవ్వుతూ తీసుకుంటాడు తప్ప రియాక్ట్ కాడు… తను వెళ్లిపోయి ఇన్నాళ్లయినా తోటి ఆర్టిస్టులకు ఈ గుణమెందుకో అర్థం కాదు…
రాయించుకున్నోళ్లు వాయించుకుని బయటికి వెళ్లిపోయారు అనే రాఘవ కామెంట్ ఓ చెత్తా యాటిట్యూడ్… ఎప్పుడో వెళ్లిపోయిన సుడిగాలి సుధీర్ మీద ఇప్పుడు ఈ వ్యంగ్యాలు దేనికి..? పోనీ, అక్కడ రష్మి ఉందా, ఆమెను ఉడికించడానికి ఈ వ్యాఖ్య చేశాడు అనుకుంటే… అక్కడ ఉన్నది రష్మి కాదు, సౌమ్య అనే కొత్త యాంకర్… ఈమె కూడా ఏదో భాష తెలియకపోయినా, కష్టపడి ఇప్పుడిప్పుడే పికప్ అవుతుందని అనుకుంటే ఈమె కూడా రాఘవలా మారిపోయింది…
ఈమధ్య యాదమరాజు పెళ్లి చేసుకున్నాడు… ఈ ప్రస్తావన వచ్చినప్పుడు సౌమ్య రాజును పెళ్లి గురించి అడిగింది… ఆరేళ్లుగా లవ్ చేసుకుంటున్నామని రాజు చెప్పాడు… మిమ్మల్ని ఏం చేసి లవ్ చేసింది అనడిగింది సౌమ్య… తిక్క ప్రశ్న… అది ఒకరకంగా ఆ జంటను కించపరచడమే… సౌమ్య అని పేరు పెట్టుకోగానే సరిపోదమ్మా…!!
Share this Article