షారూక్ ఖాన్ డన్కీ సినిమా రిలీజ్ మొదట్లో ప్రభాస్ ఆర్ సౌత్ మీద కుట్రపన్ని భంగపడిన బాలీవుడ్ మాఫియా మళ్లీ స్టార్ట్ చేసింది… ఆల్ ఆఫ్ సడెన్ చెప్పాపెట్టకుండా మల్టీప్లెక్సుల్లో డన్కీ షోలు స్టార్టయ్యాయి… అసలు డన్కీకి పట్టించుకున్నవాడే లేడు, చూసేవాడు లేడు, అడ్డగోలు ఫ్లాప్… ఆ కోపం అంతా ప్రభాస్ సలార్ మీద చూపిస్తున్నది ఆ మాఫియా… దానికి కారణముంది…
బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అన్నీ ఫ్లాపులే… దాంతో ప్రభాస్ పనైపోయింది అనుకుని తన జోలికి పోలేదు ఈ మాఫియా… కానీ ఎప్పుడైతే డన్కీ ఘోరంగా దెబ్బతిని, ఆ మాఫియా దెబ్బతీయాలనుకున్న సలార్ భారీ హిట్టయిందో ఇక మళ్లీ ఈ మాఫియా కన్ను ప్రభాస్ మీద పడింది… అందుకని వీలైతే ఇప్పుడే తొక్కాలి అని మళ్లీ విఫల ప్రయత్నాలు చేస్తోంది బాలీవుడ్ మాఫియా…
Ads
ఎక్కువ థియేటర్లు చూపించి, అడ్డగోలు నకిలీ కలెక్షన్ల లెక్కలు ప్రచారం చేస్తూ షారూక్ ఖాన్‌ను పైకి లేపే ఎత్తుగడలు… కృత్రిమంగా హిట్ అనే మోత… ఎహె, ఏదో రెండేళ్లకోసారి వస్తాడు, తనతో ప్రమాదం లేదు అనుకుని ఇగ్నోర్ చేసింది మాఫియా ప్రభాస్‌ను… పైగా తనకు పీఆర్ టీమ్స్ ఉండవు, ఆర్టిఫిషియల్ హైప్స్ ఉండవు, ప్రభాస్‌కు కుట్రలు చేతకావు… తన సర్కిల్ ఆర్థిక కష్టాలను తప్పించడానికి మారుతితో రాజా డీలక్స్ అనే మామూలు సినిమాను కూడా చేస్తున్నాడు తను…
తిండి పెట్టి చంపేస్తాడు ప్రభాస్ అంటారు తన సర్కిళ్లోని వారు ప్రేమగా… నిజమే, ప్రభాస్ అంటే మర్యాద, మన్నన, మంచితనం… సగటు హీరోల్లో కనిపించే అవలక్షణాలు ఉండవు… పబ్లిసిటీ పిచ్చి, ఏతులు, గొప్పలు ఉండవు… అందుకే ఆదిపురుష్ అడ్డగోలు ఫ్లాపయినా ఆ నిర్మాణ సంస్థ ప్రభాస్‌ను వదిలేయలేదు… స్టార్ డైరెక్టర్ వంగా సందీప్‌రెడ్డితో ప్రభాస్ హీరోగా స్పిరిట్ తీయ సంకల్పించింది… ‘యానిమల్’ రేంజ్ మించి ఉండాలని టార్గెట్… అది కేవలం ప్రభాస్ గుడ్ రిలేషన్ వల్లే…
అదేగాకుండా తన ఆరోగ్యం సహకరిస్తే అశ్వినీదత్, నాగ్ అశ్విన్ సినిమా కల్కి వేగంగా షూట్ చేసుకోవాల్సి ఉంది… 600 కోట్ల సినిమా… అదీ పాన్ ఇండియా ప్లస్ ఇంగ్లిష్ మార్కెట్‌లోకి వెళ్లబోతోంది అది… సలార్-2 సరేసరి… అందుకని బాలీవుడ్ మాఫియా ఉలిక్కిపడుతోంది… మొదట్లోనే నార్త్‌లో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమా హాళ్లు ఇవ్వలేదు తెలుసు కదా… తిక్క లేస్తే అసలు మీ థియేటర్లలో రిలీజే చేయబోం అని హొంబలె విజయ్ స్థిరంగా నిలబడేసరికి ఆ మాఫియా కాస్త వెనక్కి తగ్గింది,..
నిజానికి డన్కీ కంటెంట్ జనానికి కనెక్ట్ కాలేదు… మంచి దర్శకుడే అయినా ఈ సినిమా విషయంలో పెద్దగా క్లిక్ కాలేదు… దీనికితోడు మార్కెట్‌లో సలార్ ఉండేసరికి జనం దానివైపు మళ్లిపోయారు… నార్త్‌లో అనేక సింగిల్ స్క్రీన్లు డన్కీకి డస్ట్ బిన్‌లో పడేసి, సలార్‌ను ఎత్తుకున్నాయి… అదీ మాఫియాను మండిస్తోంది… నిజానికి మాఫియేతర హిందీ హీరోలు ఎవరూ బాలీవుడ్ మాఫియా సిండికేట్‌కు వ్యతిరేకంగా నిలబడలేకపోయారు…
ఎక్కడి నుంచో సౌత్ నుంచి వచ్చి మా మార్కెట్‌లో మాకు పోటీగా నిలబడి సవాల్ విసురుతున్నాడనే కోఫంతో ఆ సిండికేట్ ఉడుకుతోంది… అందుకే, ప్రభాస్‌కు మరో బీభత్సమైన బంపర్ హిట్ ఒకటి పడాలి… ప్రేక్షకుల కోసమే కాదు, బాలీవుడ్ సిండికేట్ బద్ధలు కొట్టడానికి… మన దిల్ రాజుల సంగతి తరువాత చూసుకోవచ్చు…!!
Share this Article