…. దేవుడా… మా బాలయ్యకే ఏమిటీ పరీక్షలు స్వామీ…? అఖండమైన ఆధ్యాత్మికవాది… పైగా అమోఘమైన, అనితర సాధ్యమైన అఘోరా పాత్ర పోషిస్తున్న త్యాగి… నిబద్ధి… అంతటి మాస్ హీరో ఇలాంటి పాత్ర పోషించడం మనం ఊహించామా..? ఊహిస్తామా..? ఆ కమిట్మెంటు ఇంకా ఏ ఇతర డొల్ల హీరోలకూ చేతనవుతుందా..? ఐనాసరే, మా బాలయ్య ఒప్పుకున్నాడు… మన తెలుగు హీరోల పాత్రలే సినిమాల్లో అఘోరా టైపు… సూడో అఘోరాలు… అలాంటి రియల్ అఘోరా పాత్రలకు సై అన్నాడు మా హీరో…
మనుషులపై శక్తుల్ని ప్రయోగించడం అంటే ఏమిటో చూద్దామనుకున్నాడు… శివశంకరీ సాంగ్ వదిలాడు… తరువాత నర్తనశాల విచిత్ర చిత్రం వదిలాడు… జనం తట్టుకున్నారు… ఏ మాస్కులూ, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ లేకుండానే తప్పించుకున్నారు… సో, ఇప్పుడు ఏమైనా గానీ అనుకుని, సాహసించి, ప్రపంచరక్షణ కోసం అఘోరా పాత్ర పోషణకు కూడా రెడీ అయ్యాడు…
ఏదీ..? హీరోయిన్లు అనబడే ఈ క్షుద్ర, ఈ దుష్ట కామినులు అర్థం చేసుకోరేమి..? ఉపాసన తెలియని ఉపాలంబనలు… ఛిఛీ… ఆమె ఎవరో పూర్ణ వోకే అన్నది… సరే… తరువాత ప్రయాగ అనుకుంటిమి… తెలుగులో ఎవరూ ధైర్యం చేయరు కదా… మంత్రాల పుట్టిల్లు కేరళ లేదా ఒడిశా మనుషులే దిక్కు… ఛిఛీ, చివరకు ఆ పిశాచి వేషాలు వేసుకునే ఆ ప్రయాగ కూడా వద్దన్నది… మరీ ఇప్పటికిప్పుడు మా యువ బాలయ్య నదియా, రేవతిని ఆప్ట్ చేసుకోవాలా..? ఏమిటీ కలికాలం…? అసలే అకారణ… సారీ, కారణ జన్ముడు మా హీరో…
Ads
అరె, బాలయ్య వంటి భోళా శంకరుడి పక్కన వేషం వస్తే వద్దనడం ఏమిటి..? ఆ పిచ్చిది వద్దన్నది… బహుశా ఎవడో ధూర్తుడు ఆమె మనస్సులో విషబీజాలు నాటి ఉంటారు… పోనీలే, హీరోయిన్లను కాకపోతే ఎవర్ని క్షమిస్తాంలే అనుకుని సాయేషాను చూశారు… పర్లేదు అనుకున్నాం… వోకే అన్నాం… మధ్యలో ఆమె ఎవరో ప్రజ్ఞా జైస్వాల్ అనుకున్నాం గానీ, మరీ మా బాలయ్య పక్కన ఎండిపోయిన చెట్టులా… ఐనాసరే అని రాజీపడ్డాం…
ఇప్పుడిక సాయేషా సైగల్ కూడా నేను రానుపో అన్నదిట… అన్యాయం, దారుణం, దుర్మార్గం, నీచం, అనైతికం… మరీ చిరంజీవికి క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పి తప్పించుకున్న త్రిషలాగా కూడా ఏమీ చెప్పలేదుట… పోనీ, నాన్ కోఆపరేషన్ ఫ్రం టీం అని కూడా చెప్పలేదుట… పూజ మధ్యలో లేచిపోయిన ఉపాసకురాలు… థూ… క్షమార్హురాలు కానేకాదు…
సర్లె… ఆ ప్రజ్ఞా జైస్వాల్ వోకే అనుకున్నారట,,. మరేం చేస్తాం… అసలే బోయపాటికి ఓ హిట్ కావాలి… మా బాలయ్యకు హిట్ కావాలి… ఆమెకు పాపం ఓ చాన్స్ కావాలి… ఇప్పుడామె ఫైనల్ అంటున్నారట… ఏవైనా అగ్రిమెంటులో ఇరికించండి బాస్… తప్పించుకుని పోకుండా… అఘోరా క్షుద్రోపాసన వేళ అష్ట దిక్కుల్నీ బంధించినట్టు… ఎస్కేప్ రూట్స్ క్లోజ్ చేసేయండి… కాష్మోరాను కాపలా పెట్టండి, చుట్టూరా పెట్టండి మంత్రించిన నిమ్మకాయలు, కోళ్లు, రక్తపాత్రలు… మంత్రించండి ముగ్గుల్ని… ఎలా తప్పించుకుంటుందో చూద్దాం… హమ్మా… ఘోరాలు వద్దులే అనుకుంటే, ఈ అఘోరాతేనే ఆటలా..? వదిలేది లేదు… కమాన్, రెడీ, కెమెరా, యాక్షన్….
Share this Article