Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పోలీసులకు ఐ-బొమ్మ హెచ్చరిక వైరల్… కానీ కంటెంటు పాతదే…

October 1, 2025 by M S R

.

సినిమా పైరసీ ముఠా ఒకదాన్ని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు నిన్న… పెద్ద ముఠాయే… థియేటర్‌లో సెల్ ఫోన్లతో రికార్డు చేయడం ఒకటైతే.. Qube, UFO.. సర్వర్లను హ్యాక్ చేసి.. ఏకంగా సిన్మా రిలీజ్‌కు ముందే హెచ్‌డీ ప్రింట్లను బయటకు వదలడం మరొకటి.

ఇలా వెయ్యికి పైగా సిన్మాలు వెబ్‌సైట్లలో పెట్టారు. ఇదంతా చేసింది… 21 ఏళ్ల కుర్రాడు. బీహార్‌కు చెందిన ఒక ఇంటర్ డ్రాపవుట్ క్యూబ్, యూఎఫ్ఓ సైట్లను హ్యాక్ చేశాడు. దీనికి సంబంధించిన కోర్సులన్నీ యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడట… అరెస్టు చేసే సమయానికి అతని దగ్గర కుబేర, కన్నప్ప, హిట్ 3 సినిమాల హెచ్‌డీ కంటెంట్ ఉంది…

Ads

కేవలం సినిమాలే కాకుండా… ఇతను ప్రభుత్వ వెబ్‌సైట్లను, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సైట్లను హ్యాక్ చేసి యూజర్ డేటానంతా దగ్గర పెట్టుకున్నాడు… ఎలక్షన్ కమిషన్ సర్వర్, బీహార్ లెజిస్లేచర్ సర్వర్ హ్యాక్ చేశాడు… ఇంత చేస్తే.. ఆ పోరడు డబ్బు కోసం కాకుండా.. కేవలం కిక్ కోసమే హ్యాక్ చేసినట్టు చెప్పాడు…

తరువాత పోలీసులు మరీ నొటోరియస్ ‘పైరసీకారుడు’  ఐబొమ్మ అలియాస్ బెప్పం నిర్వాహకుడిని త్వరలో పట్టుకుంటామనీ ప్రకటించారు… ఐతే ఈ వార్తలతో పాటు ఈరోజు ఇదే ఐబొమ్మ పాత ప్రకటనలు, హెచ్చరికలు హఠాత్తుగా సర్‌ఫేస్ అయ్యాయి… అవి రెండేళ్ల క్రితంవి…

మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవర్ చేస్తోంది… అదేమిటంటే…



పోలీసులకు హెచ్చరికలు జారీచేస్తూ ‘ఐ బొమ్మ’ ప్రకటన…

‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌లో పోలీసులను హెచ్చరిస్తూ ప్రకటన విడుదల…

వెబ్‌సైట్‌ బ్లాక్‌ చేస్తే మీ ఫోన్‌ నంబర్లు బయటపెడతామంటూ ప్రకటన…

5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉందంటూ బెదిరింపులు…

ఓటీటీలు, హీరోలు, మీడియా అందరి వివరాలు బయటకు వస్తాయి…

ఇండియా మొత్తం మాకు సపోర్ట్‌ ఉంది.. వెనక్కి తగ్గం.. మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవు : ‘ఐ బొమ్మ’ ప్రకటన…



పాత కంటెంటు ఏమిటంటే..?

‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.

1) హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా….

2) సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వున్నారు, వాళ్ళు ఏం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా…

3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.

4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు.. చివరికి మధ్యతరగతి వాడే బాధ పడుతున్నాడు…

మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీ ద్రుష్టి పెట్టండి,,. ఐబొమ్మ అన్నది సిగరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ.

మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది. ఈ మిడిల్ లో వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ గా డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం…

…… ఇలా ఏది పాతదో, ఏది కొత్తదో తెలియని కంటెంటు విస్తృతంగా చెలామణీలోకి వచ్చి వైరల్ అయిపోతోంది… అవును, సినిమా వాడిది దోపిడీయే, కరెక్టే, ఐతే నీ పైరసీకి అదెలా సమర్థన అవుతుందని కొందరు… భలే చెప్పాడు, ఉన్న నిజం పలికాడు, ప్రేక్షకులను దోచుకునే సినిమా హీరోలకు ఈ శాస్తి కరెక్టే అని మరికొందరు సోషల్ పోస్టులతో రెచ్చిపోతున్నారు…

తను చెప్పిన కంటెంటు నిజమే, కానీ నిర్మాత సొమ్మును, రిస్క్‌ను హైజాక్ చేసి, తన సొమ్ము దోచుకోవడం ఎలా సమర్థనీయం..? అవునూ, ఐబొమ్మను పట్టుకోలేని, అడ్డుకోలేని అసహాయతా మన ప్రభుత్వాల సాంకేతిక పరిజ్ఞానం…?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈతరం తప్పక చదవాల్సిన శాస్త్రి డెత్ మిస్టరీ… ఎవరు చంపారు..?!
  • ఎంత మంచివాడవురా…? ఎన్ని నోళ్ల పొగడుదురా..? చెంపపైకి ఓ కన్నీటి చుక్క..!!
  • 75 weds 35 … పెళ్లిరోజు రాత్రే కుప్పకూలాడు… ఏం జరిగి ఉంటుందబ్బా…
  • బాహుబలితో స్టార్ట్… పదేళ్లలో ఏడు సౌత్ సినిమాలదే హవా..!!
  • యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌ను బుక్ చేయడమే… ఖాకీ బుక్..!!
  • వేటూరి వీక్, పరుచూరి వీక్… కథ వీక్, కథనమూ వీక్… కృష్ణ సినిమా వీక్…
  • కాంతార చాప్టర్-1… రిషబ్ శెట్టి మళ్లీ కొట్టాడు… అవే పూనకాలు..!!
  • ఉడికీఉడకని ఇడ్లీ… ధనుష్ నటుడిగా డిస్టింక్షన్… దర్శకుడిగా జస్ట్ పాస్…
  • పోలీసులకు ఐ-బొమ్మ హెచ్చరిక వైరల్… కానీ కంటెంటు పాతదే…
  • ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అమ్మకమే..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions