ఆమె బీజేపీ నాయకురాలే కావచ్చుగాక… కానీ ఒకప్పుడు… ఇప్పుడు ఆమె ఈ దేశ అత్యున్నత పదవిలో ఉంది… ఓ ఆదివాసీ మహిళ… కొన్నికోట్ల మంది గిరిజన మహిళలకు ఓ ప్రతీక… అంతేకాదు, డౌన్ టు ఎర్త్… తన మాటతీరు, తన ప్రవర్తన, తన హుందాతనంతో అందరి ప్రశంసలూ పొందుతోంది… రాష్ట్రపతి అయినా సరే ఎక్కడా వీసమెత్తు అహంభావమో, నడమంత్రపు లక్షణాలో రాలేదు… మరి ఆమెను పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
మగ మార్క్ బలుపా..? లోకసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఉన్న ఓ బెంగాలీ నేత అదీర్ రంజన్ చౌదరే కదా ఆమెను రాష్ట్రపత్ని అని సంబోధించింది… తరువాత రచ్చ చెలరేగాక క్షమాపణలు చెప్పాడో లేదో తెలియదు గానీ సపోర్ట్ చేసిన కాంగ్రెస్ తన పరువు పోగొట్టుకుంది… ప్రతి వాడికీ లోకువే… ద్రౌపదవి అనే పేరు వినగానే వర్మ అనబడే ఓ తెలుగు బురద పంది మరి పాండవులు ఎవరు అని ప్రశ్నిస్తుంది… ప్రత్యర్థిగా నిలబడిన ఇంకొకడు ఆమె విగ్రహం మత్రమే కదా అంటాడు… మరొకడు దిష్టిబొమ్మనా అనడుగుతాడు…
ఎందుకంత లోకువ అయిపోయింది వీళ్లకు..? ఆమె హోదాకు గౌరవమైనా ఇవ్వాలి కదా… అదీ ఇవ్వరు… ఆమెను ఇంకా ఓ బీజేపీ మనిషిగానే చూస్తున్నట్టున్నారు… అవును, అలాగే చూస్తున్నారు… బుర్రలో… కాదు, కాదు… ఇదొక హెరిడిటరీ మేల్ ఇన్‌ఫెక్షన్… జన్మత పుట్టుకొచ్చినదే… ఈ అచ్చమైన సంస్కార రాహిత్యం అదే… యాంటీ-బీజేపీ పోకడల్ని క్రమేపీ యాంటీ-ఆదివాసీ, యాంటీ వుమెన్ వైపు తీసుకుపోతున్నామనే సోయి కూడా లేదు… ఇలాంటి విమర్శల్లో బెంగాలీ నాయకులు ముందుండటం దారుణం… (నీచాతి నీచ స్థాయి విమర్శలు మా తెలుగు రాజకీయ నాయకుల సొత్తు…)
Ads
బెంగాల్‌లో అఖిల్ గిరి (63) అనే ఓ చిల్లర నాయకుడున్నాడు… సారీ, మంత్రి ఇప్పుడు… (The Minister-of-State (independent charge) Department of Correctional Administration)… తనను సువేందు అధికారి అనే బీజేపీ పక్షనాయకుడు వెకిలి చేస్తున్నాడు… సువేందు తెలుసు కదా… నందిగ్రామ్‌లో మమతను ఓడించాడు… ఈ అఖిల్‌ను సువేందుపైకి ఉసిగొల్పుతూ ఉంటుంది మమత… సో, అఖిల్‌ను వెక్కిరిస్తుంటాడు సువేందు… మరీ పర్సనల్ లుక్ మీద కూడా…
మొన్న పదకొండో తేదీన అఖిల్ ఎక్కడో మాట్లాడుతూ బరస్టయిపోయాడు… ఉల్టా తిట్లకు పూనుకున్నాడు… సరే, అదంతా ఓ పిచ్చి రాజకీయం, మధ్యలో రాష్ట్రపతిని లాగాడు ఈ దరిద్ర నాయకుడు… ‘‘నన్ను కాకిలా ఉంటావని వెక్కిరిస్తున్నాడు సువేందు… హాఫ్ ప్యాంటు మంత్రి అంటున్నాడు… అప్పట్లో తన తండ్రి ఎవరు మరి..? అండర్ వేర్ మంత్రా..? పోనీ, ఈ సువేందు ఎంతటి అందగాడు..? లుక్కును బట్టి ఎవరినైనా జడ్జ్ చేస్తారా..? ప్రెసిడెంటును నేనూ గౌరవిస్తాను కానీ ఆమె లుక్కేమిటి..?’’ అని ప్రసంగిస్తూ పోయాడు… అప్పుడక్కడ మహిళా సంక్షేమ మంత్రి శశి పంజా కూడా ఉంది… గిరి మాటలకు అక్కడ చేరిన కార్యకర్తలు పకపకా నవ్వారు…
వెంటనే బీజేపీ చాన్స్ తీసుకుంది… ఇదేనా మమత పార్టీ ఓ మహిళా రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం..? పక్కా యాంటీ ట్రైబల్… అని ఆందోళనలకు దిగింది… సీపీఎం ఖండించింది… సోషల్ మీడియా అయితే ఓ రేంజులో ఆ మంత్రికి ఇచ్చిపడేసింది… సువేందు అన్నాడని కాదు, నువ్వు నిజంగా హాఫ్ ప్యాంటుగాడివే అని వెక్కిరించింది… ఇదంతా పార్టీకి వ్యతిరేకం అవుతుండేసరికి పార్టీ వెంటనే ‘‘ఆ వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదు’’ అని ఓ ప్రకటన విడుదల చేసి, చేతులు దులుపుకుంది… (ఆమధ్య ఎంపీ మహువా మొయిత్రా ఇలాంటి విమర్శలేవో చేసినప్పుడు కూడా పార్టీ వెంటనే దూరం జరిగి పార్టీకి ఆ విమర్శలతో సంబంధం లేదని ప్రకటించింది… కానీ తలతిక్క వ్యాఖ్యలకు వివరణలు అడగడమో, మందలించడమో జరగాలి కదా… జరగవు…)
జాతీయ మహిళ కమిషన్ గిరి ఇష్యూలో ఇన్వాల్వయింది… దర్యాప్తు చేసి, తను ఏమన్నాడో రిపోర్ట్ చేయాలని డీజీపీని ఆదేశించింది… చివరకు ఇదంతా రచ్చ అవుతుండేసరికి గిరి క్షమాపణ చెప్పాడు… ‘‘పదే పదే బీజేపీ నాయకులు నాపై పర్సనల్ అటాక్ చేస్తుండేసరికి విచక్షణ కోల్పోయాను… రాష్ట్రపతి పట్ల నాకు గౌరవం ఉంది… క్షమాపణలు…’’ అన్నాడు… ఈ రచ్చ సరే, ఈ హాఫ్ ప్యాంటు గాళ్లకు నిజంగానే ద్రౌపది ముర్ము ఎందుకు అలుసైపోయింది..?!
Share this Article