Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీహారర్ రాజ్ సంకేతాలు మళ్లీ… అదే, పాత జంగ్లీరాజ్… దేశం నడుమ కొరివి…

October 21, 2022 by M S R

లాలూప్రసాద్… రాజకీయాల్లో అసలు ఉండకూడని కేరక్టర్… కారణాలు తవ్వుతూ పోతే నాలుగైదు గ్రంథాలూ సరిపోవు… నితిశ్ అంతకుమించిన దరిద్రం… కుర్చీ కావాలి… అంతే, అటూఇటూ ఎటైనా జంప్ చేస్తాడు… అభివృద్ధి, ప్రణాళిక, పరిపాలన మన్నూమశానం అనే పదాలేవీ తను వినడు, వినిపించుకోడు, తనకు అక్కరలేదు… ఆ జంగిల్‌రాజ్ బీహార్‌కు ఒక్క మంచి లీడర్ వస్తే ఎంత బాగుండు..? ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్జేడీ చేరడంతో మళ్లీ పాత జంగిల్ రాజ్ జడలు విప్పుకుంటోంది… అదీ ఆందోళనకారకం… ఇంకొన్ని వివరాలు మిత్రులు పార్ధసారధి పోట్లూరి కథనంలో చూద్దాం…



ఆటవిక రాజ్యానికి స్వాగతం ! ట్రైన్ నెంబర్ 12274…. న్యూ ఢిల్లీ –హౌరా దురంతో ఎక్స్ప్రెస్ మీద దొంగల దాడి – దోపిడీ ! బీహార్ లోని నితీశ్ కుమార్ [JDU], లాలూప్రసాద్ యాదవ్ RJD ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయిందో లేదో మొదటి ఫలితాన్ని చవి చూశారు ఢిల్లీ మరియు బెంగాల్ ప్రజలు.

ఎప్పుడో 90 వ దశకం మొదట్లో బీహార్ లో రైలు దోపిడీ ఘటనలు తరుచూ జరిగినట్లు వార్తా పత్రికలలో చదివేవాళ్ళం ! 30 సంవత్సరాల తరువాత అదే తరహా రైలు దోపిడీ ఘటనని మళ్ళీ చూస్తున్నాం ! లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వంలో భాగస్వామి కాగానే జరిగిన మొదటి ఘటన ఇది. ఇక మీదట అప్పటిలాగానే మళ్ళీ తరుచూ చూస్తామన్నమాట!

Ads

గత ఆదివారం రాత్రి 2 గంటలకు న్యూఢిల్లీ నుండి కలకత్తాకి వెళుతున్న 12274 దురంతో ఎక్స్ప్రెస్ ని దోపిడీ దొంగలు ఆపి ప్రయాణీకులని దోచుకొని పారిపోయారు ! ఈ సంఘటన బీహార్ లోని ఖుష్రుపూర్ మరియు మంజ్ హౌలీ స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ప్రాంతం ఈస్ట్ సెంట్రల్ రైల్వే లోని దానాపూర్ డివిజన్ కిందకి వస్తుంది.

ఈ దోపిడీ ఘటనలో ప్రయాణీకులు ఎవరూ గాయపడలేదు కానీ నగదు, బంగారం దోచుకొని వెళ్లిపోయారు. దానాపూర్ డివిజన్ సీనియర్ కమాండెంట్ ప్రకాష్ కుమార్ పాండా [RPF] మాట్లాడుతూ 4 గురు ప్రయాణీకులు తమ డబ్బు, బంగారం దుండగులు దోచుకున్నట్లు ఫిర్యాదు అందింది అన్నాడు. దొంగలని పట్టుకోవడానికి ప్రత్యేక RPF టీంని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రకాష్ కుమార్ పాండా!

లాలూప్రసాద్ యాదవ్ హయాంలో వ్యవస్ఠీకృత లేదా కోఆర్డినేటెడ్ క్రైమ్స్ ఎక్కువగా జరిగేవి ! అప్పట్లో లాలూ బీహార్ ని జంగ్లీ రాజ్ అని ముద్దుగా పిలిచేవారు. దొంగలు, దోపిడీ దారులు, రైల్వే పోలీస్ అధికారులు [RPF], రైల్వే స్టేషన్లలో ఉండే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అధికారులు [GRP], రాజకీయ నాయకులు [RJD] కలిసి ఉమ్మడిగా నేరాలకి పాల్పడే వాళ్ళు. దొంగలు ఎవరో రైల్వే పోలీసులకి తెలుసు, అలాగే ఆయా రైల్వే స్టేషన్లలో ఉండే గవర్నమెంట్ రైల్వే పోలీసులకి తెలుసు కానీ దోపిడీలు మాత్రం అంతా కలిసి ప్లాన్ చేసి చేసేవాళ్ళు. వీళ్ళు వాటాలు పంచేది RJD నాయకులకి కాబట్టి ఉద్యోగాలు పోవడం లేదా సస్పెండ్ అవడం లాంటివి జరగవు.

ఆదివారం న్యూ ఢిల్లీ – కలకత్తా దురంతో ఎక్స్ప్రెస్ దోపిడీ కూడా ఇలా ఆర్గనైజ్డ్ గా జరిగిందే! రైలు పాట్నాకి చేరుకోగానే దొంగలు పాట్నాలోనే రైలులోకి ఎక్కారు ప్రయాణీకులలాగా ! సరిగ్గా రాత్రి 2 గంటలకి రైలు ఖుష్రుపూర్ మరియు మంజ్ హౌలీ స్టేషన్ల మధ్య ప్రాంతానికి చేరుకోగానే దొంగలు చైన్ లాగి రైలుని ఆపారు. డానికి ముందే రెండు కంపార్ట్మెంట్ లలో ఉన్న ప్రయాణీకులని దోచుకున్నారు No suggestions చూపించి !ట్రైన్ ఆగగానే చీకటిలో పారిపోయారు !

అంతా ముందస్తు సమాచారం మేరకే ….

దురంతో ఎక్స్ప్రెస్ లో బాగా డబ్బున్న ప్రయాణీకులు ఏ కోచ్ లలో ఉన్నారో ముందు ఒక టీమ్ రెక్కీ చేసింది ప్రయాణీకులలాగా ! వాళ్ళు పాట్నాలో దిగిపోయారు తమ వాళ్ళకి మొబైల్ ఫోన్లలో కోచ్ వివరాలు ఇచ్చేసి ! దొంగలకి RPF జవాన్లు ఎక్కడ షిఫ్ట్ మారతారో సమాచారం ఉంది కాబట్టి పాట్నాలో దిగిపోయిన RPF జవాన్లు మళ్ళీ కొత్త వాళ్ళు డ్యూటీలోకి వచ్చేది పాట్నా తరువాతి స్టేషన్ లో కాబట్టి రైల్లో ఎవరూ ఉండరు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది !

90 వ దశకంలో మొబైల్ ఫోన్లు లేవు కానీ RPF, GRP అధికారుల నుండి సమాచారం సేకరించి ఏ స్టేషన్ల మధ్య పోలీసులు ఉండరో ముందే సమాచారం తీసుకొని ప్లాన్ ని అమలుచేసి దోపిడీలు, హత్యలు కూడా చేసి దోచుకునేవారు. వీళ్ళు ఎప్పటికీ దొరికేవాళ్ళు కారు. లాలూ ప్రసాద్ అధికారం కోల్పోయి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత క్రమేపీ తగ్గిపోయాయి రైళ్ల దోపిడీలు !

నితీశ్ కుమార్ ఢిల్లీలో రాజకీయాలు చేయడానికి గాను అధికారం లాలూ కొడుకు తేజస్వి ప్రకాష్ యాదవ్ కి అప్పచెప్పి తాను ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉండాలని చూస్తున్నాడు. ఇప్పటికే తేజస్వి ప్రకాష్ యాదవ్ ముఖ్యమంత్రి అనేలా ప్రచారం జరుగుతున్న వేళ రైలు దోపిడీ ఒక చిన్న ప్రకటన లాంటిది టీవిలో వచ్చే సినిమాకి ముందు ! లాలూ గ్యాంగ్ మళ్ళీ వసూళ్లు మొదలుపెట్టేశారు !

వీళ్ళు దేనినీ, ఎవరినీ వదలరు! లా అండ్ ఆర్డర్ అనేది కేవలం కాగితాల మీద మాత్రమే ఉంటుంది ! ఈ నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అవడు. తిరిగి బీహార్ వచ్చేసరికి ముఖ్యమంత్రి పదవీ ఉండదు ! వచ్చిన అవకాశాన్ని లాలూ ప్రసాద్ కొడుకులు వదులుకోరు! ప్రశాంతంగా ఉంది అనుకున్న బీహార్ ని మళ్ళీ ఆటవిక రాజ్యంగా మార్చడంలో లాలూ ప్రసాద్ విజయం సాధిస్తాడు ! జంగ్లీ రాజ్ కి స్వాగతం !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఐదు రోజుల టెస్టు మ్యాచ్ 3 BHK… ప్రేక్షకులకు కావల్సింది T20 ….
  • వావ్, మళ్లీ కేవీపీ కనిపించాడు… అద్సరే గానీ సర్కారు గౌరవానికి రోశయ్య అర్హుడే…
  • భార్యా రూపవతీ శత్రుః….. కాదు, కాదు… భర్తా రూపవాన్ శత్రుః…
  • అయ్యో, తమ్ముడూ… ఎమోషన్, యాక్షన్ రెండూ ‘లయ’తప్పాయి..!!
  • Walk Of Fame Star… ఈ అంతర్జాతీయ గౌరవాన్ని దీపిక ‘కొనుక్కుందా..?!
  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions