.
హేమిటో… ఈటీవీ జబర్దస్త్ షో ఎవరూ చూడటం లేదు… ఒకప్పుడు అదే ఈటీవీ రేటింగ్స్‌కు ఆధారం… ఇప్పుడు రేటింగుల్లో ఎక్కడో దిగువన కనిపిస్తూ ఉంటుంది… ఫాఫం…
అదే కాదు… ఈటీవీ రియాలిటీ షోలన్నీ అంతే… సరే, ఆ చర్చలోకి వద్దులే గానీ… జబర్దస్త్ షోలో ఆమధ్య మార్పులు చేశారు… ఎక్సట్రా జబర్దస్త్‌ను తీసిపారేసి… రెండు వరుస షోలుగా చేసి… మొత్తం షోకు యాంకర్‌గా రష్మిని పెట్టేశారు…
Ads
ఫాఫం, ఇంద్రజను తీసేసి, ఆమెను కేవలం డ్రామా కంపెనీ ఓనర్‌ను చేశారు… అఫ్ కోర్స్, అక్కడా రష్మియే యాంకరిణి… బట్, ఏమాటకామాట ఆ షోలకు తనే తగిన హోస్ట్… యాక్టివ్, స్పాంటేనిటీ, డాన్స్ ఎట్సెట్రా… కాకపోతే సరైన తెలుగు రాకపోవడం ఒక్కటే మైనస్…
ఖుష్బూను జడ్జిగా తీసుకొచ్చారు… గుడ్, పర్లేదు… తనకు కామెడీ జ్ఞానం ఉంది… కొన్నాళ్లు కృష్ణ భగవాన్‌ను మేల్ జడ్జిని చేశారు… తీసిపారేసి, గరుడ పురాణ ప్రవచనకర్త శివాాజీని పట్టుకొచ్చారు… అసలు ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో ఈటీవీ, మల్లెమాల టీమ్‌లకే అర్థమవుతున్నట్టు లేదు…
మళ్లీ శివాజీ మాయం… కృష్ణభగవాన్ వచ్చి కూర్చున్నాడు తాజాగా… నిజానికి భగవానే ఆప్ట్ ఆ షోకు… మంచి టైమింగుతో పంచులు వేస్తాడు… అది షోకు అదనపు ఆకర్షణ… ఎలాగూ కంటెస్టెంట్లు, సారీ ఆర్టిస్టులు మంచి స్కిట్లు చేయడంలో ఫెయిలవుతున్నారు…
పైగా ఆ షో మొదటి నుంచీ పేరొందిన బూతు ఉండనే ఉంది… మళ్లీ కృష్ణ భగవాన్‌ను తీసిపారేసి, మళ్లీ శివాజీని తీసుకొస్తారేమో… తను అస్మదీయుడు కదా… ఈ అస్థిరత షోకు మంచిది కాదు… రెగ్యులర్ జడ్జి అందుబాటులో లేకపోతే అప్పటికప్పుడు ఓ గెస్ట్ జడ్జిని పట్టుకొస్తే తప్పులేదు, ఏ ఆలీనో, ఏ పోసానినో…
కానీ రెగ్యులర్ జడ్జి ఒకడే ఉండటం బెటర్… శివాజీ వచ్చిన కొత్తలో కమెడియన్లు అందరూ ఒకరిని మించి ఒకరు శివాజీని పొగుడుతూ రెచ్చిపోయారు… అవసరమా..? ఎలాగూ పేరొందిన కమెడియన్లు అందరూ వెళ్లిపోయారు ఆ ఒక్క రాఘవ, భాస్కర్ మినహా…
ఇప్పుడైనా కాస్త నాణ్యతతో కూడిన స్కిట్లు చేస్తే మళ్లీ ఏమైనా రేటింగులు పెరుగుతాయేమో… ఎలాగూ వేరే చానెళ్లకు కామెడీ షో చేతకావడం లేదు… చేతనైన ఈటీవీయేమో దానికి పదును పెట్టడం చేతకాదు… హేమిటో… అసలే ఈటీవీ, ఆపై మల్లెమాల..!!
ఉదాహరణకు ఫైమా… మంచి టైమింగు, ఎనర్జీ ఉన్న కమెడియన్… ఒక్క స్కిట్‌లోనూ ఆమెను సరిగ్గా వాడుకోవడం లేదు..! రోహిణియేమో బిగ్‌బాస్‌కు వెళ్లిపోయింది…! పండు, యాదమరాజు, సద్దాం, భాస్కర్ కూడా కనిపిస్తున్నారు కదా గుడ్… ఆటో రాంప్రసాద్, నూకరాజు, ఇమ్ము ఎలాగూ బెటరే… కానీ స్క్రిప్ట్‌లే ప్రాబ్లమ్ అనుకుంటా..!!
Share this Article