Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మళ్లీ ఆ గీతామాధురేనా జడ్జి..? ఫాఫం, ఇండియన్ ఐడల్ సీజన్-3…!!

May 1, 2024 by M S R

నో డౌట్… ఆహా ఓటీటీ రియాలిటీ షోలలో సూపర్ హిట్… 1) అన్ స్టాపబుల్, 2) ఇండియన్ ఐడల్ తెలుగు… కొంతమేరకు కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్… ఇండియన్ ఐడల్ షోకు వచ్చే గెస్టులే గాకుండా, సెలక్షన్స్ బాగుంటున్నయ్… దాంతో షో రక్తికడుతోంది… దీనికితోడు జడ్జిలుగా థమన్, కార్తీక్ ప్లస్ పాయింట్లు…

ఫస్ట్ సీజన్‌లో ఫిమేల్ జడ్జి నిత్యా మేనన్… ఎక్కడా తడబాటు లేకుండా, ఓవర్ చేయకుండా, హుందాగా వ్యవహరించింది ఆమె… హోస్టుగా శ్రీరామచంద్ర కూడా మెప్పించాడు… కానీ సెకండ్ సీజన్ వచ్చేసరికి హోస్ట్ మారాడు, హేమచంద్ర వచ్చాడు… తనూ బాగానే చేశాడు… అందులో డౌట్ లేదు… ఎటొచ్చీ నిత్యా ప్లేసులో తీసుకున్న గీతా మాధురే అంతా గందరగోళం…

నిజానికి నిత్యామేనన్ బేసిక్‌గా సింగర్ కాదు, కాకపోతే కాస్త స్వరజ్ఞానం ఉన్నట్టుంది… గీత ఒరిజినల్‌గా సింగర్… కంటెస్టెంట్ల తప్పొప్పులను సరిగ్గా విశ్లేషించగలగాలి… కానీ ఎంతసేపూ తన లుక్కు మీద తప్ప వేరే ధ్యాస లేదామెకు… పైగా పలుసార్లు తన జడ్జిమెంట్ నవ్వులపాలైంది కూడా… ఇప్పుడు మళ్లీ ఆమెనే తీసుకున్నారు మూడో సీజన్‌కు… ఫాఫం… హైదరాబాదులో ఆడిషన్స్ మీద ఆహా వాళ్ల ప్రకటన చూశాక ఇదంతా గుర్తొచ్చింది…

Ads

హోస్ట్ మారాడా లేదా తెలియదు… హోస్టుదేముంది..? శ్రీముఖి అయినా నడిపించేయగలదు… కానీ గీతా మాధురి గత సీజన్‌లో కొన్ని సందర్భాల్లో, మరీ ప్రత్యేకించి ఒక సందర్భంలో ఎంత తిక్కతిక్కగా మాట్లాడిందో గుర్తుచేసుకుందాం… గతంలో ‘ముచ్చట’ వచ్చిన స్టోరీయే కాస్త సంక్షిప్తంగా మరోసారి…



ఇండియన్ ఐడల్ తెలుగు షో చూస్తున్నవాళ్లు బలంగా ఫీలయ్యేది జడ్జి స్థానంలో నిత్యామేననే కొనసాగి ఉంటే బాగుండేది అని… గీతామాధురిని తీసుకొచ్చి షో ఉదాత్తతను చెడగొడుతున్నారు అని… ఆమె నిజానికి ఓ బిగ్‌బాస్ కేరక్టర్… పరిణతి, హుందాతనం ఉండవు… దట్టంగా మేకప్ వేసుకుని, తొడలు కనిపించేలా ఓ చెత్త డ్రెస్ వేసుకుని వచ్చిన తీరు ఓసారి మనమే చెప్పుకున్నాం తెలుసు కదా… విషయంలోకి వస్తే…

ఇండియన్ ఐడల్ షోలో థమన్, కార్తీక్‌ల ప్రజెన్స్ బాగుంది… వాళ్ల వ్యాఖ్యల్లో గానీ, కంటెస్టెంట్ల మెరిట్ అంచనా వేయడంలో గానీ మెచ్యూరిటీ కనిపిస్తుంది… ఎప్పుడూ ఒకే తీరు గాకుండా ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కోరకంగా డిజైన్ చేస్తుంటారు… కంటెస్టెంట్లలో టెన్షన్ తగ్గించడం, ఫ్రీగా పాడగలిగే వాతావరణం కల్పించడం కోసం ఎప్పటికప్పుడు వాతావరణం తేలికపడేలా ఆ ఎపిసోడ్ డిజైన్ ఉండాలి…

దాస్ కా ధమ్కీ సినిమాలో నటించిన విష్వక్సేన్, నివేధా అతిథులుగా వచ్చారు… జడ్జెస్ ప్లేలిస్టు అని టాస్క్… అయాన్ ప్రణతి 14 ఏళ్లకే తన పాటతీరుతో అదరగొడుతోంది… ఆమెకు శ్రేయో ఘోషాల్ పాడిన ఓ పాటను టాస్కుగా ఇచ్చింది గీతామాధురి… ఆమెకన్నా ప్రణతి బాగా పాడింది… అది మనసులో మంటరేపినట్టుంది… కుళ్లుబోతుతనం… ప్రణతి అస్సలు బాగా పాడలేదు, నాకు నచ్చలేదు, పంచ్ లేదు అంటూ… ఇదీ కారణం అని స్పష్టంగా చెప్పలేక ఏదేదో వాగేసింది…

geetha

ఆమె మాట్లాడుతుంటే థమన్, కార్తీక్ థూ అన్నట్టుగా చూశారు ఆమెవైపు… ఎందుకు ఈమెను ఈ షోకు జడ్జిగా పట్టుకొచ్చార్రా బాబూ అన్నట్టుగా… చివరకు స్వరజ్ఞానం లేని విష్వక్సేన్ కూడా గీతామాధురి వైపు అదోరకంగా, అంటే ఛీత్కారంగా చూశాడు… ఓసారి అమెరికా నుంచి వచ్చిన నండూరి శృతి కూడా ఏదో పాట పాడితే ఈమె చేసిన విశ్లేషణ నరమానవుడెవరికీ అర్థం కాలేదు, అంత గందరగోళం… శృతి పక్కన నిలుచున్న హేమచంద్ర అలా కళ్లప్పగించి చూస్తుండిపోయాడు గీతను…! నిజానికి ఈమె మొదటి నుంచీ ఫుల్లు మేకప్పుతో ఓ గ్లామర్ డాల్‌గా కూర్చుంటున్నదే గానీ ఓ గాయకురాలితనం ఏమీ కనిపించడం లేదు ఆమెలో… గ్లామరే కావల్సి ఉంటే ఇండస్ట్రీలో ఎందరు లేరు..? తెచ్చి కూర్చోబెట్టొచ్చు కదా…

geethamadhuri

కంటెస్టెంట్లు ఎలా పాడినా ప్రశంసించాలని ఏమీ లేదు… కానీ సరైన కారణం చెప్పగలగాలి… అదీ థమన్‌, కార్తీక్‌లకు చిరాకెత్తించినట్టుంది… తరువాత కాస్త వెటకారాన్ని దట్టించి కార్తీక్, థమన్ విసుర్లకు దిగారు… ఈ దేభ్యం మొహానికి ఆ వ్యాఖ్యలు కూడా అర్థం కాలేదు… సాధారణంగా ఇలాంటి షోలలో వీలున్నంతవరకూ నెగెటివిటీని చూపవద్దని, ఎంకరేజ్ చేసినట్టుగా కామెంట్లు ఉండాలని ముందే చెబుతారు… మార్కులు మీ ఇష్టం కానీ ఎయిర్‌లోకి వెళ్లే కామెంట్ల విషయంలో జాగ్రత్త అని చెబుతారు…

థమన్, కార్తీక్ కూడా కొన్నిసార్లు కంటెస్టెంట్ల పట్ల నెగెటివ్ కామెంట్స్ చేస్తారు… కానీ ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో సాధికారంగా చెబుతారు… అదీ గీతామాధురిలో లోపించింది… అందుకే ఆమె ఆ జడ్జి స్థానానికి బ్యాడ్ సెలక్షన్… పైగా ఇలాంటి నిష్కారణ కామెంట్ల వల్ల ఆయా కంటెస్టెంట్లకు పడే వోట్లు కూడా ప్రభావితం అవుతుంటాయి… ఐనా ఇవన్నీ తెలిస్తే ఆమెను గీతామాధురి అని ఎందుకంటారు..?! ఆమె జీతెలుగు సరిగమ ప్రోగ్రామ్‌కు మాత్రమే సూటయ్యే మేటర్..!!



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions