.
ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలుస్తుందా లేదా వేరే సంగతి… వన్డే అంటేనే అనూహ్యాలు… కానీ ఒక్క విషయం చెప్పుకోవాలి… అవును, కోహ్లీ గురించే…
మొన్న చెప్పుకున్నాం కదా, సెంచరీ చేసి పాకిస్థాన్ మీద విజయానికి మూల కారకుడయ్యాడు… ఎస్, రోహిత్ శర్మలా తొందరపడకుండా… పరిస్థితిని, పిచ్‌ను అర్థం చేసుకుని, షాట్లకు పోకుండా, సింగిల్స్ తీస్తూ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు…
Ads
అసలు ట్రోఫీ రాకపోయినా సరే, పాకిస్థాన్ మీద గెలుపే ఇండియన్లలో ఆనందాన్ని నింపింది… సేమ్, ఈ సెమీస్‌లో కూడా కోహ్లీయే… తను 98 బంతుల్లో చేసిన 84 రన్స్‌లో నాలుగో అయిదో ఫోర్లు… అంతే… మొత్తం సింగిల్స్, డబుల్స్… (రెండు క్యాచులు కూడా…)
రోహిత్ శర్మ ఔట్ కాగానే వచ్చాడు, నిలబడ్డాడు… మెల్లిమెల్లిగా ఇన్నింగ్స్ నిర్మించాడు… ఇతర బ్యాట్స్‌మెన్ ఔటయిపోతున్నా సరే, తను ఓపికగా ఆడాడు… నిజానికి కోహ్లీ ఛేజింగ్ హీరో, అదీ దూకుడు హీరో… షాట్ల ప్రియుడు…
ఐనాసరే, షాట్లకు ట్రై చేయలేదు… సంయమనం ముఖ్యం… మరీ ముఖ్యంగా ఈ పిచ్ మీద… బాల్ బ్యాట్ మీదకు రావడం లేదు, బాల్ పైకి లేస్తే క్యాచ్ దొరుకుతోంది… ఈ స్థితిలో తను ఆడిన తీరు నచ్చింది… చాన్నాళ్లుగా ఫామ్‌లో లేడు, బోలెడు విమర్శలు… ఇంకెన్నాళ్లు గబ్బిలంలా వేలాడుతావూ అని…
వచ్చాడు, ఫామ్‌లోకి వచ్చాడు… కానీ అగ్రెసివ్ ధోరణితో కాదు, ఆచితూచి ఆడుతూ… అదీ నచ్చింది… గ్యాపులు వెతుకుతూ, సింగిల్స్ దొంగిలిస్తూ… 84 పరుగుల ఇన్నింగ్స్ నిర్మించడం అల్లాటప్పా ఏమీ కాదు… అఫ్‌కోర్స్, మరో సెంచరీ రాబోతోంది అనుకునే దశలో ఔట్ కావడం వేరే సంగతి…
ఇది క్రికెట్ ఏదైనా జరగొచ్చు… కోహ్లీ ఔట్ కావద్దని ఏముంది..? ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా బాగుంది… శుభమన్ గిల్ కొద్దిసేపు క్రీజులో పాతుకుపోతే గెలుపు మరింత ఈజీగా వచ్చేదేమో… ఎస్, కోహ్లీ మళ్లీ తను చేజింగ్ స్టార్ అని నిరూపించుకున్నాడు… కొన్నాళ్లుగా కోల్పోయిన ఆ పేరును మళ్లీ తెచ్చుకున్నాడు… గుడ్…
చెప్పలేదంటారేమో… చివర్లో హార్డిక్ పాండ్యా మెరుపులు కూడా వెరీ గుడ్… ఛలో ఫైనల్…
Share this Article