నిజమే… ఈ మాట అనడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు… బిగ్‌బాస్ పదే పదే అభిజిత్ గేమ్‌తో ఓడిపోతూ… తన మెదడును కోల్పోతున్నాడు… కోపగించి అభిజిత్‌ను పీకేయలేడు… ఉంచితే రోజుకో కొత్త తల్నొప్పి… ఎంతసేపూ తను చెప్పింది అందరూ చేయాలనే సంకుచిత, అనాలోచిత ఆవేశమే తప్ప బిగ్‌బాస్ అడుగుల్లో ఓ స్ట్రాటజీ లేదు, ఓ మెచ్యూరిటీ లేదు… బిగ్‌బాస్ టీం సభ్యులూ, ఎక్కడ దొరికారు బాబూ మీరు..? ప్రత్యేకించి ఈరోజు షో చూసిన ప్రతి ఒక్కరికీ బిగ్‌బాస్ షో నిర్మాతల మీద జాలి కలగడం ఖాయం… అంత మైండ్ లెస్‌గా సాగింది…
ఏదో జలజ అనే పిచ్చి దెయ్యాన్ని ప్రవేశపెట్టారు… మొదటిరోజు ఏదో అభిజిత్‌ను చెట్టు మీద ఆకులు లెక్కపెట్టు అనిపించారు… ఛపో, ఇదేం టాస్కురా భయ్, అసలు ఈ దెయ్యం చెబితే నేను చేయడం ఏంది అని అభిజిత్ రెఫ్యూజ్ చేశాడు… గుడ్, సరైన కారణం… తరువాత గ్రేవ్ యార్డుకు మోనాల్‌ను డేటింగుకు తీసుకెళ్లు అని ఈసారి బిగ్‌బాసే ఆదేశించాడు… అరె, పన్నెండు వారాల నుంచీ ప్రతి ఇష్యూలో మోనాల్‌ను ఎందుకు లాగుతున్నారు..? ఇది ఇబ్బందికరంగా ఉంది అంటూ అభిజిత్ అదీ రెఫ్యూజ్ చేశాడు… అంటే ఒకే ఎపిసోడ్లో రెండు రెఫ్యూజల్స్… బిగ్‌బాస్ చెప్పిన ప్రతి పనీ చేయాలని ఏమీ లేదు… తనకు మరీ నచ్చనిది, తన మనోభావాలకు విరుద్ధమైన పని అయితే తిరస్కరించే హక్కు కంటెస్టెంటుకు ఉంటుంది… సో, బిగ్‌బాస్ నోరుమూసుకుని, అఖిల్‌ను డేటింగుకు వెళ్లమన్నాడు… అది కాస్తా ఫ్లాప్ షో అయిపోయింది…
Ads
బిగ్‌బాస్ అనేవాడికి అభిజిత్ ఇష్యూ వచ్చినప్పుడల్లా మైండ్ పనిచేయడం లేదని మనకు అర్థమవుతోంది కదా… అందులో ఇదీ ఒకటి… కన్ఫెషన్ రూంను ఓ దెయ్యాల కొంపలా మార్చి, ఏదో లగ్జరీ టాస్కు అప్పగించాడు కదా… అరియానా అవినాష్, సొహెయిల్, అఖిల్ జంటగా వెళ్లి భయంభయంగానే టాస్కు పూర్తి చేశారు… మోనాల్ అయితే తనే దెయ్యంలా వెళ్లి దర్జాగా టాస్క్ పూర్తిచేసింది… మరి హారిక..? అభిజిత్..? ఈ ప్రశ్న ప్రేక్షకుడికి వస్తుంది కదా… ఆసక్తిగా చూస్తారు కదా..? ప్రత్యేకించి అభిజిత్ దెయ్యాన్ని ఎలా టాకిల్ చేస్తాడనేది ఇంట్రస్టింగు పాయింట్ కదా… ఇంతకీ తను ఒకే ఎపిసోడ్లో మూడు ఆదేశాలను రెఫ్యూజ్ చేశాడా..? అలా చేసి ఉంటే మాత్రం అభిజిత్‌నే మెచ్చుకోవాలి…
తీరా చూస్తే… అవేమీ చూపించలేదు… నేరుగా మీరంతా వేస్ట్ గాళ్లు, ఒక్కరూ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, మీకు తిండి కూడా దండుగే, ఇంకా లగ్జరీ బడ్జెట్ దేనికి అన్నట్టుగా కోపంతో మాట్లాడి… చెప్పింది చేయనందుకు అభిజిత్ వరస్ట్ పర్ఫామర్ అని ప్రకటించాడు బిగ్‌బాస్… ఏ పనిచేయలేదు..? చెట్టు ఆకులు లెక్కించకపోవడమా..? మోనాల్‌తో డేటింగ్ వెళ్లకపోవడమా..? లేక కన్ఫెషన్ రూంకు వెళ్లి దెయ్యంతో రొమాన్స్ చేయకపోవడమా..? ఏ పనిచేయలేదో చెప్పాలి కదా, ప్రేక్షకుడికి అర్థం కావాలి కదా… అంతా క్లూలెస్… పైగా అభిజిత్ తప్పుచేస్తే తనను పనిష్ చేయాలి, మొత్తం హౌస్ మీద అసమర్థులనే ముద్రవేయడం కరెక్టు కాదు కదా… అభిజిత్‌ను శిక్షించలేడు, అలాగని ఊరుకోలేడు… ఏమిటీ దురవస్థ బిగ్‌బాసూ…
దీన్ని అర్థంతరంగా ఆపేసి ఇకపై కెప్టెన్ ఉండడు అని ప్రకటించాడు… సరే, వోకే… కానీ వరస్ట్ కెప్టెన్ ఎవరో, బెస్ట్ కెప్టెన్ ఎవరో మీరే తేల్చుకుని, తన్నుకుని, ఓ అభిప్రాయానికి వచ్చి, వెల్లడించండి అన్నాడు బిగ్‌బాస్… వాళ్లలో వాళ్లు కుమ్ములాడుకుని అరియానా వేస్టు, హారిక బెస్టు అని తేల్చారు… చెప్పారు… కానీ ఈ తంతు దేనికి పెట్టాడో తెలియలేదు… మళ్లీ ప్రేక్షకుడు క్లూ లెస్… బిగ్‌బాస్ మైండ్ రోజురోజుకూ ఇంకా చిన్నగా అయిపోతుందనే క్లారిటీ మాత్రం వచ్చింది అందరికీ…
అనేక అంశాల్లో అభిజిత్ బిగ్‌బాస్ బట్టలిప్పేస్తూనే ఉన్నాడు… ప్రతిసారీ నామినేట్ అవుతాడు… కానీ భయపడడు… బయట ఎలాగూ వోట్లేయించే మెకానిజం ఏర్పాటై ఉంది కదా… పైగా అందరిలోనూ కాస్త బుర్రపెట్టి వ్యవహరిస్తున్నది తనే… పోనీ, చెప్పినట్టు వినడం లేదనే సాకుతో, ఈ స్థితికి వచ్చాక అభిజిత్‌ను బయటికి పంపించగలడా బిగ్‌బాస్..? అభిజిత్ బయటికి వెళ్తే ఇక గేమ్ క్లోజ్ అన్నట్టే…
చివరగా :: 20న ఫినాలే… అంటే అయిదుగురు… 13న ఆరుగురు… ఆరో తేదీన ఏడుగురు… ఉండాలని అనుకున్నా… ఈవారం ఎలిమినేషన్ అక్కర్లేదు… అంటే ఉన్నది ఏడుగురే కాబట్టి… ఈవారం ఒకరిని బయటికి పంపిస్తే మిగిలేది ఆరుగురే… ఆట డల్ అయిపోతుంది… రీఎంట్రీలు వేస్టు, వేస్టున్నర… ఎవరొచ్చినా పీకేది ఏమీ ఉండదు… టైంపాస్ యవ్వారం తప్ప… ఈ టైంలో రీఎంట్రీతో ఎవరు పోటీలోకి వచ్చినా ప్రేక్షకుడు హర్షించడు…
ఐనాసరే, ఈవారం ఎలిమినేషన్ ఉంటుందీ అనుకుంటే… అరియానాపై కత్తి వేలాడుతున్నట్టు లెక్క… అవినాష్ ఎలాగూ ఎవిక్షన్ పాస్‌తో గట్టెక్కుతాడు… అభిజిత్, హారిక బాపతు వోట్లు మోనాల్‌కు పడతాయి… ఇక మిగిలింది అఖిల్, అరియానా… సొహెయిల్ వోట్లు అఖిల్‌కు పడొచ్చు… అంటే ఎటూ గాకుండా మిగిలిపోయేది అరియానా… ఐనా బిగ్‌బాస్ కదా… ఈవారానికి కాపాడుతాడేమో… మరీ బయటికి వెళ్లగొట్టాల్సినంత వీక్ కంటెస్టెంటు ఏమీ కాదు అరియానా…!!
Share this Article