Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డౌట్ దేనికి..? నాగబాబును ముందుపెట్టి తిట్టించడం అలవాటే కదా…!!

December 2, 2024 by M S R

.

తెలిసిందే కదా.., మెగా క్యాంపు ఎవరి మీద విరుచుకుపడాలన్నా సరే నాగబాబును ముందుపెడతారు… పవన్ కల్యాణ్ కొంత సొంతంగా కామెంట్స్ చేస్తాడు గానీ చిరంజీవి మాత్రం తను హుందాగా ఉంటూ, తను అనాలని అనుకున్నవన్నీ నాగబాబుతో అనిపిస్తాడు…

చాలా చూసినవే కదా… ఒక యండమూరి, ఒక రామగోపాలవర్మ, ఒక గరికపాటి… ఎవరైనా సరే, నోరు పారేసుకోవడానికి నాగబాబు రెడీ అయిపోతాడు… అంతెందుకు…? ప్రస్తుతం బన్నీ వర్సెస్ మెగా వార్ నడుస్తోంది కదా…

Ads

గుర్తుందా..? ఆమధ్య మనతో మంచిగా ఉండేవాడే మనవాడు, లేకపోతే పరాయోడు అని వ్యాఖ్యానించాడు నాగబాబు… అంటే జనసేనకు జై అంటే, చిరంజీవికీ జై అంటేనే మనవాడు… లేకపోతే ఎవడెంత దగ్గర చుట్టమైనా సరే పరాయివాడే అని…

ఎవరిని ఉద్దేశించి… సింపుల్, బన్నీ గురించే… తను పవన్ కల్యాణ్ గురించి పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాడు, కానీ ఎవరో వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లాడు… దాంతో పరాయివాడు అయిపోయాడుట… తరువాత విమర్శలు పెరిగేసరికి తన వ్యాఖ్యను డిలిట్ కొట్టేశాడు నాగబాబు…

అంటే ఏదో సద్దుమణిగిందని కాదు… మెగా మర్రిచెట్టు నీడ నుంచి బయటపడి తనకంటూ ఓ సొంత సర్కిల్ ఏర్పాటు చేసుకోవడానికి అల్లు హీరో ప్రయత్నిస్తున్నాడు… ఆ దిశలో చాలాదూరం వెళ్లిపోయాడు… నిజమే కదా… ఇండిపెండెంటుగా ఎదగడానికి ప్రయత్నించడం తప్పు కాదు…

ఇప్పుడు నాగబాబు ట్వీట్ ఏమిటంటే..? ఇదీ లింక్…



https://x.com/NagaBabuOffl/status/1863207473773183307?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1863207473773183307%7Ctwgr%5Ebfa64586e24234efccf8c6950b13f5aafd50729a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.dishadaily.com%2Fcinema%2Fnagababus-sensational-tweet-before-the-release-of-pushpa-2-389775


 


“If you realize you have taken the wrong path, correct your course immediately. The longer you wait, the harder it becomes to return to where you truly belong”. – Swami Vivekananda.

…. అంటే గూగుల్ అనువాదంలో చెప్పాలంటే… “మీరు తప్పు మార్గంలో ఉన్నారని మీరు గుర్తిస్తే, వెంటనే మీ కోర్సును సరిదిద్దుకోండి. మీరు ఎంత ఎక్కువసేపు వేచి ఉన్నారో, మీరు నిజంగా ఉన్న చోటికి తిరిగి రావడం కష్టమవుతుంది”… – స్వామి వివేకానంద…

అర్థమైంది కదా… బన్నీ తప్పు బాటలో వెళ్తున్నాడని అర్థం చేసుకోవాలి మనం… దాపరికం ఏమీ లేదు, దోబూచులాట అక్కర్లేదు… ఆ కామెంట్ ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఇట్టే తెలుస్తుంది… పైగా సందర్భం ఇదే…

వెంటనే దిద్దుకో, లేకపోతే పాత స్థానానికి రావడం కష్టమవుతుంది అంటున్నాడు నాగబాబు… అంటే, నువ్వు అల్లు అరవింద్ కొడుకువు కావచ్చు, పాన్ ఇండియా స్టార్ కావచ్చు, కానీ మమ్మల్ని కాదంటే కష్టాలపాలు అవుతావు అనడమే పరోక్షంగా…

నిజమేనా..? మెగా క్యాంపేతరుడిగా బతకలేడా బన్నీ..,? తనకు ఆ సత్తా లేదా..? ఇదేం ధోరణి నాగబాబు నుంచి..? ఇక ఈ కామెంట్ మీద కూడా బన్నీ వర్సెస్ మెగా వ్యాఖ్యలు, విమర్శలు, ట్రోల్స్ జోరందుకున్నాయి…

సినిమా మీద టికెట్ల ధరలు, నిర్మాణలోపాలు, జాప్యాలు గట్రా వేరే సంగతి… కానీ మరీ ఒక కుటుంబానికే చెందిన ఫ్యాన్స్ ఇలా రెండుగా చీలి కొట్టుకుంటున్నారు… అందులో నాగబాబు ఎప్పటిలాగే పెట్రోల్ పోశాడు… పోస్తాడు… తను దానికే అక్కరకొస్తున్నట్టున్నాడు…!! డియర్ నాగబాబూ… ఈ ఎఫర్ట్ రాజ్యసభ సభ్యత్వం కోసం పెట్టొచ్చుగా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions