ఎవరైనా సరే… పుట్టిన గడ్డకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు… కనీసం చెడ్డపేరు తీసుకురావద్దని అనుకుంటారు… జననీ జన్మభూమి… కానీ సినిమా నటుడు, గరుడ పురాణ ప్రవచనకారుడు, బిగ్‌బాస్ భూస్వామి శివాజీ మాత్రం టోటల్లీ రివర్స్ కేరక్టర్… తను చెత్త మాటలు మాట్లాడి, చిల్లరగా బిహేవ్ చేసి… ఇదంతా నేను పుట్టిన పల్నాడు ప్రభావం, మేమిలాగే ఉంటాం అని పుట్టిన గడ్డను బదనాం చేస్తున్నాడు…
పల్నాడు ఓ గొప్ప సంస్కృతికీ, సంస్కారానికీ అడ్డా… ఈ శివాజీ కూసినట్టు అనాగరిక నేల కాదు… పైగా తను చేసిన తప్పులన్నీ తను పుట్టిన గడ్డ ప్రభావమే అని సమర్థించుకోవడం మరీ నీచంగా ఉంది… ఇన్ని సినిమాలు చేసి, ఇంత వయస్సొచ్చి, కనీస సంస్కారం లేకుండా బిగ్‌బాస్ హౌజులో పిచ్చి పిచ్చి కూతలెన్నో కూశాడు… సరే, తప్పులు పొరపాట్లు మానవసహజం, అది తన ఒరిజినల్ కేరక్టర్ అనుకుందాం… కానీ జన్మభూమిని బ్లేమ్ చేయడం దేనికి..?
హౌజులో ప్రియాంక, శోభాశెట్టిని ఉద్దేశించి మొన్న ఏవేవో కూశాడు కదా… ‘‘మా ఇంట్లో వాళ్లు ఇలా చేస్తే పీకుతా, మెడ మీద కాలేసి తొక్కుతా, వీళ్లను పెళ్లి చేసుకున్నవాళ్ల పరిస్థితేమిటో…’’ అన్నాడు కదా… ఇదేందయ్యా అంటే మాది పల్నాడు బాబు గారూ, ఫ్లోలో ఏదో అన్నాను అని సమర్థించుకున్నాడు… మరి అదే ఫ్లోలో ఇదే ప్రియాంక, ఇదే శోభా వీథిపంపు భాషను ప్రయోగిస్తే వోకేనా..? పైగా నాగార్జున పైకి తిరగబడ్డట్టు రెటమతం మాటలు, సమర్థనలు…
Ads
హమ్మయ్య… నెటిజనం సోషల్ మీడియాలో శివాజీ ప్రవర్తన పట్ల బూతులు తిడితే తప్ప బిగ్‌బాస్ టీంకు, నాగార్జునకు బుర్రలు పనిచేయడం లేదన్నమాట… ప్రశాంత్ అమాయకుడట, తనను టార్చర్ చేశారట, అందుకని కోపమొచ్చి అలా అన్నాడట… తనను టార్గెట్ చేస్తే నీకు నొప్పి ఏమిటి..? You are also just a co_contestant… నువ్వు ఆ క్లాస్ పెబ్బ కాదు కదా…
ఆడవాళ్లను అలా అనొచ్చా అని ఓ ప్రేక్షకురాలు అడిగితే మగవాళ్లను అనొచ్చా అని మరో పిచ్చి జవాబుతో ఆమె నోరు మూయించే ప్రయత్నం చేశాడు శివాజీ… మీ ఇంట్లో వాళ్లనైతే అలాగే పీకుతావా అనడిగితే ఖచ్చితంగా పీకుతాను అని మరో తిక్క సమాధానం… ఇదీ శివాజీ రియల్ కేరక్టర్…
ఈ కేరక్టర్‌ను సపోర్ట్ చేయడానికి సోషల్ మీడియా టీమ్స్, మరీ ప్రత్యేకంగా శోభ మీద విషం కక్కాయి ఈ టీమ్స్… ఇంగ్లీష్ జాతీయ పత్రికల తెలుగు సైట్స్ కూడా సోయి తప్పి రాతలకు దిగాయి… చివరకు ఆమెను ఎలిమినేట్ చేసేదాకా శివాజీ గ్యాంగులకు నిద్రపట్టలేదు… షేమ్… ఇదే శివాజీ ఆటతో పోలిస్తే శోభ వంద రెట్లు నయం…
హౌజులో ఉన్న ఏడుగురిలో అయిదుగురికి నాగార్జున క్లాసులు పీకాడు… అవసరమే… ఇన్నాళ్లకు ఈ సీజన్ ఈ ఒక్కరోజు పద్దతిగా నడిచింది… ఛండాలంగా బిహేవ్ చేసిన యావర్‌కు కూడా బాగానే అక్షింతలు పడ్డాయి… ఛి థూ అంటూ, వెగటు బాడీ లాంగ్వేజీతో యావర్ బిహేవ్ చేసిన తీరు ఆ హౌజులో ఉండటానికే అనర్హుడు… బహుశా రాబోయే ఎలిమినేషన్ తనదేనేమో… సానుభూతి నాటకాలు ఆడే ప్రశాంత్‌కూ బాగానే పడ్డయ్ చీవాట్లు… సరే, అమర్ దీప్ సరేసరి… దాదాపు అది ఎర్రగడ్డ కేసే… మొత్తమ్మీద క్లాసుల నుంచి తప్పించుకుంది అర్జున్, ప్రియాంక…
ఎస్, ఆ ఇద్దరూ బ్యాలెన్స్‌డ్‌గా, హుందాగా ఆడుతున్నారు… మాట తూలరు, పెత్తనాలు చేయరు… తమ ఆటేదో తమది, తమ ధోరణేదో తమది… టాప్ ఫైవ్‌లో ఉండతగిన కంటెస్టెంట్లు వాళ్లు… బట్, ప్రియాంక, అర్జున్‌లకు వోటింగ్ తక్కువ… ఐనా బిగ్‌బాస్ వోటింగుకు విలువేమి ఉందిలే… వాళ్లను టాప్ ఫైవ్‌లో ఉంచెయ్ బిగ్‌బాస్… అర్హులు వాళ్లు… మిగతా ఐదుగురూ… ఎందుకులెండి… ఒకవేళ శివాజీకి గనుక ట్రోఫీ దక్కితే అది ఆ ట్రోఫీకి, ఈ బిగ్‌బాస్ గేమ్‌కు, ఈ రియాలిటీ షోకే అవమానం…
Share this Article