వీడియోలతో విస్పోటనం… దేశమంతా ఒకేచర్చ… రేపోమాపో మోడీ పదవీభ్రష్టత్వం… మరి మీరెందుకు ఏమీ రాయలేదు అనడిగాడు ఓ మిత్రుడు… కానీ మొన్నటి ఆడియాలు, నేడు వీడియోలు… ఇందులో కొత్త ఏముంది..? మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు… దొరకని జవాబులు… వెరసి కేసు మరింత పలుచబడిపోతున్న దృశ్యం…
వందల కోట్ల డబ్బు అంటారు, ఒక్క రూపాయి దొరకలేదు… ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంటారు, మరి కొనుగోళ్లకు టచ్‌లోకి వెళ్లిన వారిని కూడా విచారించాలి కదా… వాడెవడో దొంగకోళ్లు పట్టుకునే బాపతు మధ్యవర్తులట ‘‘ఎమ్మెల్యేల్ని కొంటామహో’’ అని గోనె సంచుల నిండా డబ్బు కట్టలు పెట్టుకుని, బజారులో కూరగాయల బేరం చేస్తున్నట్టు..!!
అసలు వాళ్లెవరు..? వాళ్లను బీజేపీ ఆథరైజ్ చేసిందా..? వాళ్లకు అంత సీన్ ఉందా..? పోనీ ఆ సీన్ ఈ వీడియోల్లో ఎస్టాబ్లిష్ అవుతోందా..? వాళ్లు ఎవరెవరి పేర్లనో ప్రస్తావిస్తే ఇక వాళ్లంతా నేరగాళ్లు అయిపోయినట్టేనా..? అసలు ఈ మధ్యవర్తులతో ఈ ఆట ఆడిస్తున్నదెవరు..? అది కదా తేలాలి..!
Ads
వోటుకునోటు కేసు సమయంలో కేసీయార్ ప్లానింగుకు చంద్రబాబు గింగరాలు తిరిగిపోయాడు… హైదరాబాద్ ఖాళీ చేశాడు… దెబ్బ అంటే అదీ… డబ్బు, వీడియోలు, సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ దొరికాయి… కానీ ఈ కేసులో ఏమీ లేవు… మనం చూస్తున్నది నాటి సూపర్ ప్లానర్ కేసీయార్‌నేనా..? పైగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం దుర్మార్గం, నీచం అంటున్న కేసీయార్ ఎనిమిదేళ్లుగా తను చేస్తున్నదేమిటి..? ఈ నలుగురిలో ముగ్గురు అలాంటివాళ్లు కాదా..?
అన్ని రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిసులకు ఈ వీడియోలు పంపిస్తారట… ఏం చేసుకోవాలి..? సూమోటో కింద విచారణ చేపట్టాలని అనుకున్నా సరే, వాళ్ల అధికార పరిధి కాదు కదా… సుప్రీం చీఫ్, ఇతర జస్టిసులకు పంపిస్తున్నారట… ఎస్, సుప్రీం చీఫ్ తన ఆధ్వర్యంలో విచారణను చేపడితే బెటరే… కానీ ఆల్‌రెడీ బీజేపీ ఇక్కడ హైకోర్టును అడిగింది… సిట్టింగ్ జడ్జితో గానీ సీబీఐతో గానీ విచారణ జరిపించాలని… కానీ కేసీయారే సీబీఐ తెలంగాణలోకి రాకుండా జీవోలు ఇచ్చుకున్నాడు… మరి మళ్లీ సీబీఐకి వీడియోలు పంపించడంలో ఔచిత్యం ఏముంది..? సీబీఐని రాకుండా చేయడం ద్వారా కేసీయార్ ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..?
పీటీఐ, ఏఎన్ఐ సహా మొత్తం ప్రధాన మీడియా సంస్థలకు పంపిస్తున్నారట… నిజంగా ఆ వీడియోల్లో అంత బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే అవే వాలిపోతయ్… కానీ అవి అస్సలు పట్టించుకోవడం లేదు… అంటే కేసులో ఏమాత్రం పంచ్ లేదు అని అర్థం… ముఖ్యమంత్రులందరికీ, పార్టీల అధ్యక్షులందరికీ పంపిస్తున్నట్టు కేసీయార్ చెప్పాడు… అసలు మొన్న ఆడియోల రచ్చ సమయంలోనే దేశంలో ఏ సీఎం, ఏ పార్టీ అధ్యక్షుడు మాట్లాడలేదు… ఇప్పుడు వీడియోలు పంపిస్తే ఒరిగేది ఏమిటి..?
సదరు వీడియోల్లో అమిత్ షా పేరు 10 సార్లు వచ్చిందట, ఇంకెవరో ముఖ్యులవి పదే పదే వినిపించాయట, వాళ్లందరూ ఇక నేరస్థులేనట..! ఇదేం వాదన..? మరీ ముఖ్యంగా ఒకవైపు మునుగోడు పోలింగ్ ముగియనేలేదు… మీడియా మీట్ పెట్టాడు కేసీయార్… అంత అర్జెన్సీ ఏముంది అందులో..? అంత పేలుడు సామాగ్రి కూడా ఏమీ లేదు వాటిల్లో…! ఆడియోలను మొన్న లీక్ చేశారు, కాగా వీడియోలను తనే రిలీజ్ చేస్తున్నాడు, మరి అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటో ఎవరికీ తెలియదు…
8 ప్రభుత్వాలను కూలగొట్టాం, మరో 4 హిట్ లిస్టులో ఉన్నయ్… అందులో ఏపీ కూడా ఉంది… ఢిల్లీ ఉంది… ప్రభుత్వాల్ని కూల్చేస్తాం… ఈడీ, సీబీఐలు మీ జోలికి రాకుండా చేస్తాం…. తలా వంద కోట్లు ఇస్తాం… మామూలు స్థితిలో ఎవరైనా ఇలా మాట్లాడితే తుపాకీ రాముళ్లు అంటారు… సో, కేసీయార్ సార్, ఈ వీడియోల కథ రక్తికట్టడం లేదు, పేలడం లేదు… ఏదో తేడా కొడుతోంది… ఒక్కసారి ఆ పాత కేసీయార్‌ను బయటికి తీయి…!!
Share this Article