Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుచిత్ర..! ఈ పిచ్చిది మళ్లీ మొదలుపెట్టింది… పాత పెంట తవ్వుతోంది…

May 16, 2024 by M S R

ఈ పిచ్చిది మళ్లీ మొదలు పెట్టింది… ఈ అభిప్రాయం కాస్త కటువుగా అనిపించవచ్చుగాక… కానీ గాయని సుచిత్ర తాజా ట్వీట్లు, ఆరోపణలు, వెల్లడించే విషయాలు లోతుగా గమనిస్తే అలాగే అనిపిస్తుంది… తమిళ సినిమా ఇండస్ట్రీలో కొన్ని డిఫరెంట్ కేరక్టర్స్ తగుల్తాయి…

నా వయస్సు తక్కువగా కనిపించే కారణంగా రజినీకాంత్, మహేశ్‌బాబు వంటి హీరోల పక్కన అవకాశాల్లేవని చెప్పుకున్న కస్తూరి గురించి చెప్పుకున్నాం కదా… తరచూ చాలా ఇష్యూల్లో వింత అభిప్రాయాల్ని షేర్ చేస్తుందామె… సింగర్ చిన్మయి గురించీ తెలిసిందే… వాళ్లకు మించి ఎన్నోరెట్లు కంట్రవర్సీ ఈ సింగర్ సుచిత్ర… ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేసిందామె…

అప్పట్లో, అంటే 2017 ప్రాంతంలో సుచీ లీక్స్ ఓ పెద్ద పెంట యవ్వారం… మాలీవుడ్‌కు చెందిన చాలామంది ప్రముఖుల అఫయిర్ల వీడియోలు, ఫోటోలను బయటపెడుతుంటే ఇండస్ట్రీ షేకయింది… త్రిష, ధనుష్, అమలాపాల్ వంటి చాలామందివి… ఆమె పిచ్చిది అనే ముద్రవేసి మాలీవుడ్ ఆమెను పట్టించుకోవడం మానేసింది… ఆమె కూడా చాన్నాళ్లు సైలెంటయిపోయింది…

Ads

ఆమె కూడా ఏమంటోంది..? అప్పట్లో లీక్స్ బాపతు ఫోటోల్ని త్రిషే ఇచ్చిందట… మళ్లీ తనే భిన్నంగా… నా ట్విట్టర్ అకౌంట్‌ను ప్రాంక్ ట్వీట్ల కోసం వాడుకుని నా భర్త, ధనుష్ తదితరులు వాడుకున్నారు, నడుమ నన్ను పిచ్చిదాన్ని చేశారు అని వాపోయింది… (ధనుష్ పెద్ద ఆటగాడేననీ, త్రిష ఇతరులతో తన అఫయిర్స్ వల్లే రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య తనతో తెగతెంపులు చేసుకుందనీ, చాలామంది విడాకులకు ధనుష్ కారణమనీ బోలెడు కథనాలు తమిళ మీడియాలో వెలువడ్డాయి…)

సరే, అప్పుడంటే ఏదో తనను మభ్యపెట్టి తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో వాడేసుకున్నారు సరే… కానీ ఇప్పుడు నేరుగా యూట్యూబ్ చానెళ్లకు తనే ఇంటర్వ్యూలు ఇస్తోందిగా… తమ వ్యూస్ కోసం చానెళ్లు ఆమెను గెలికి, గోకి మరీ చెప్పించుకుంటున్నాయి కదా ఇలాంటి సంగతులు… (ఓ సీనియర్ తెలుగు సినిమా రచయిత కూడా ఇటీవల టాలీవుడ్ ప్రముఖుల మీద ఇష్టారాజ్యం వ్యాఖ్యలు చేసిన తీరు గుర్తుంది కదా…) ఇందులో తన సోషల్ మీడియా ఖాతాల దుర్వినియోగం సమస్యేమీ లేదుగా… మొన్నటికి మొన్న తన భర్త (విడాకులు ఇచ్చింది) గే అంటుంది, ధనుష్‌తో బెడ్ షేర్ చేసుకున్నాడు అంటుంది…

అసలు ధనుష్, ఐశ్వర్యలు పరస్పరం మోసం చేసుకున్నారని ఆరోపించింది కదా… ఇప్పుడేమో కమల్ హాసన్ ట్రాన్స్‌జెండర్ అంటుంది… అదెలా అనడిగితే విశ్వరూపం సినిమాలో ట్రాన్స్‌జెండర్‌గా తన హావభావాలు అచ్చంగా ఉంటాయట… నిజజీవితంలో కూడా అలాంటి చుడీదార్, కుర్తా వంటి దుస్తులే ధరిస్తాడట… అబ్సర్డ్… కమల్ హాసన్ మహిళగా కూడా అద్భుతంగా నటించాడు, ఐనంతమాత్రాన తను మహిళ అవుతాడా..?

కమల్‌హాసన్ హోస్ట్ చేసే తమిళ బిగ్‌బాస్‌లో ఈమె కూడా ఓ సీజన్‌లో పార్టిసిపెంట్… ఇప్పుడే మరో బాంబు పేల్చింది… కమల్ హాసన్ డ్రగ్స్ తీసుకుంటాడని..! నిజమే అయినా సరే, ఇండస్ట్రీలో చాలామంది తీసుకుంటారు… సో వాట్, వెంటనే బీజేపీ దాన్ని అందుకుని విచారణ జరిపించాలని డిమాండ్… ఇక్కడ ఇష్యూ ఏమిటంటే..? తన భర్తకు విడాకులిచ్చింది, గే, ధనుష్‌తో లింక్, ధనుష్ భార్య ఐశ్వర్య, వాళ్ల విడాకులు… ఇలా తనకు సంబంధమున్న ఇష్యూస్… నడుమ కమల్ హాసన్ ఎలా వచ్చాడు దీంట్లోకి..?

ఇలాంటి పిచ్చి ఆరోపణలతో తనేం కోరుకుంటోంది..? చానెళ్లదేముంది..? శెనగలు బుక్కి చేతులు కడుక్కున్నట్టు ఆమె ఆరోపణల్ని ప్రసారం చేసుకుని, లక్షల వ్యూస్ సంపాదించుకుని చేతులు, మూతులు కడిగేసుకుంటాయి… కానీ ఇలా మళ్లీ ఎందుకు పెంట, చెత్త గెలుకుతున్నట్టు..! పైగా బేస్ లెస్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎలెవన్..! 11 మార్కులు మాత్రమే… యాభైకా..? వందకా..? అదే ప్రశ్న..!!
  • పుష్ప2 బ్యాటింగుతో బుల్లితెర పగిలిపోయింది… ఆల్ టైమ్ హై రేటింగ్స్…
  • టెంబా బావుమా… నల్ల జాతి చేతిలో ఓ అపురూప విజయపతాక…
  • ఏమాటకామాట… కన్నప్ప భారీ నిర్మాణ విలువలకు తగినట్టే ట్రెయిలర్…
  • ఒక్క క్షణం…! ఎంత విలువైంది… ఓసారి పుతిన్ పుట్టుకను చదవండి… అర్థమౌతుంది…
  • దేవుడే పెదరాయుడు..! తీర్పు చెబితే సుప్రీం చెప్పినట్టే… అదే గుడికోర్టు…!!
  • ఆహా… బన్నీ జాతీయ ఉత్తమ నటుడు… రేవంత్ రెడ్డి పిసరంత ఎక్కువే…
  • మంత్రి సోదరుడికి అవార్డు..? ఈ హుడావుడి లేట్ ప్రకటన ఏమిటి..?
  • స్వాతి..! ఓ కుంతీపుత్రి కథ… మగాధిపత్యంపై ఓ ధిక్కారపతాక…!!
  • సూప‌ర్ స్టార్ కృష్ణ విశ్వప్రయత్నం చేసీ చేసీ ఓడిపోయిన ‘ప్రాజెక్టు’..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions