.
నటి అనసూయ మళ్లీ వార్తల్లోకి వచ్చింది… మళ్లీ ట్రోలింగు షురూ… సైలెంటుగా ఉండటం అనేది ఆమెకు నచ్చదు… ఏదో ఇక ఇష్యూతో చర్చల్లో ఉండాల్సిందే… గోక్కుని మరీ లైవ్ డిస్కషన్స్‌లో ఉండటం అలవాాటై పోయినట్టుంది…
రీసెంటుగా ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకునేది లేదు… 30 లక్షల మంది ఫాలోవర్స్‌ను బ్లాక్ చేశాను… నెగెటివ్ కామెంట్స్ భరించను, సమాధానం ఇస్తాను, కొంతమందిని భరించలేక బ్లాక్ చేస్తుంటాను’’ అని చెప్పుకొచ్చింది…
Ads
బహుశా ఈ రేంజులో ఫాలోవర్స్‌ను బ్లాక్ చేయడం కూడా ఓ రికార్డు కావచ్చు… నిజమే అయితే… తనకున్నదే ఇన్‌స్టాలో 16 లక్షల మంది ఫాలోవర్స్ అయితే, 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేశావమ్మా అని మళ్లీ ట్రోలింగు స్టార్టయింది…
ఏమో, అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో కలిపి 30 లక్షల మంది ఫాలోవర్స్‌ను బ్లాక్ చేసిందేమో, అది కాదు విషయం… అన్ని లక్షల మందిని బ్లాక్ చేసేంత నెగెటివిటీ ఆమె మీద ఎందుకొస్తోంది..? అదీ ఆమె ఆలోచించుకోవాల్సిన విషయం…
పెద్ద పెద్ద స్టార్ట సోషల్ అకౌంట్లను వాళ్లే పెద్దగా చూడరు… వాటిని వాళ్ల టీమ్స్ మేనేజ్ చేస్తుంటాయి… మరీ అవసరమైన కామెంట్లను వాళ్ల నోటీసుకు తీసుకొస్తాయి టీమ్స్… ఎస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా అంటేనే ఓ నెగెటివ్ వాతావరణం… రకరకాల వ్యక్తులు, కేవలం ట్రోలింగు కోసమే కోట్లల్లో ఉన్న ఫేక్ అకౌంట్లు, స్వేచ్ఛగా బూతులు, తిట్లు, నిందలు…
ఎటొచ్చీ ఆ కామెంట్లను చదివి సీరియస్‌గా రియాక్టయ్యే అనసూయ వంటి కేరక్టర్లకే ఈ సమస్య… పైగా ఆమె డ్రెస్సింగు, ఆమె షేర్ చేసే ఫోటోలతో చాలామంది నెగెటివ్‌గా రియాక్టవుతూ ఉంటారు… (బికినీ ఫోటోలు కూడా…) అవి చూసి ఆమె ‘నా ఫోటోలు, నా బట్టలు నా ఇష్టం అంటూ మరింత రెచ్చిపోయి ఎదురుదాడికి దిగుతుంది… అలాంటి ఫోటోలు పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టేసి నా ఇష్టం అంటే ఎలా అని ట్రోలర్లు మరింత రెచ్చిపోతారు…
సోషల్ మీడియా అంటే గోకేకొద్దీ మరింత రెచ్చిపోయే ధోరణి కదా… సో, ఇది ఆగదు… పైగా ఆమెకు ఎవరైనా ఆంటీ అని ప్రస్తావించినా నచ్చదు… ఏదీ లైట్ తీసుకోదు… లక్షల్లో ఆహా ఓహో అని మాత్రమే పొగిడే ఫాలోవర్స్ మాత్రమే కావాలంటే ఎలా..?
సొసైటీలో ఉన్నట్టే సోషల్ మీడియాలో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు… నో, సహించను, భరించను అనే పక్షంలో, ఇంత భారీ నెగెటివిటీని మోసేబదులు ఆ సోషల్ మీడియాకే దూరంగా ఉంటే బెటర్ కదా..!! అవునూ, ఇండస్ట్రీలో ఇంతమంది తారలున్నారు కదా… అనసూయే ఎందుకు టార్గెట్ అవుతోంది ఎప్పుడూ..?!
Share this Article