అంటే అన్నామంటారు గానీ… మరి దీన్నేమనాలి డియర్ టీవీ9 రజినీకాంత్ భాయీజీ… ఆమధ్య శ్రీదేవి మరణించినప్పుడు తమరు గట్టిగా పలికిన ఆ ఆటోస్పై అనే పదం తెరతెరలుగా మన టీవీ ప్రేక్షకుల మెదళ్లను కమ్మేసి, నిర్విణ్నులను చేసి పారేసిన తీరు ఇంకా మరపుకే రాలేదు… మధ్యలో నీ స్పూర్తిని అందిపుచ్చుకుని దేవి ఓసారి నీటి గురుత్వాకర్షణ శక్తి ఎలా బ్రేకవుతుందో జ్ఞానబోధ చేసింది… ఈమధ్య రుధిరం అంటూ నెత్తుటి భాషను కురిపించింది… ఆ దడ నుంచి ఇంకా తేరుకోనేలేదు… మళ్లీ మొన్న ఏదో ట్వీట్లో బాయిల్డ్ రైస్ క్రాప్ అని రాసుకుంది… ఉప్పుడు బియ్యం పంట ఉండదు తల్లీ… సరే, మళ్లీ ఇక ఇప్పుడు తమరే… మళ్లీ వేసేశారే… అయ్యో, హతవిధీ… తెలుగు ప్రజల గొంతుకలో గుచ్చేశారే…
అటాప్సీ వేరు- ఆటోస్పై వేరు…. అలాగే తమరు ఉచ్చరిస్తున్నట్టగా పోస్కో అనే చట్టమేమీ లేదు భాయ్… ఒక్క చిన్న బిట్ వీడియోలో నాలుగైదుసార్లు పదే పదే పోస్కో పోస్కో అన్నాడు… కానీ దాని అసలు పేరు పోక్సో… అంటే ఇంగ్లిషులో Protection Of Children from se-ual Offence… ఇది 2012లో తీసుకొచ్చారు… అంతేతప్ప, ఇందులో ఎవరూ ఏమీ పోస్కోనేది ఏమీ లేదు… పూస్కోనేదీ ఏమీ లేదు… పోస్కో, పోక్సో… సరిగ్గా గుర్తుండాలంటే సింపుల్… పోస్కోవడం కాదు, పోస్కోవడం కాదు, అని నాలుగైదుసార్లు బలంగా మనసులో అనుకోవడమే… అప్పుడు అది తప్పు అనీ, పోక్సో అనే పదమే కరెక్ట్ అని గుర్తుంటుంది… భలేవారే, అలా చేశాక కూడా ఇలాగే నోటి నుంచి బయటికొస్తోంది అంటారా..? ఇక ఏమీ చేయలేం… మీ టీవీ మీ ఇష్టం…!!
Ads
Share this Article