అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు… – త్రివిక్రమ్ శ్రీనివాస్
.
ఏదో ఓ పాపులర్ సినిమాలో డైలాగ్ ఇది… నిజమే… కానీ టీవీ9 మళ్లీ రవిప్రకాష్ చేతుల్లోకి వస్తే..? అది అద్భుతమే కదా… అరె, స్థూలంగా పైపైన చూస్తే అది అసాధ్యమనీ, తప్పుడు రాతలు, ఫేక్ కూతలు అనిపిస్తుంది… టాప్ గాసిప్ అనేలా ఉంటుంది… కానీ రాజకీయాల్లో… రాజకీయాలతో వ్యభిచరించే మీడియా పోకడలను చూస్తుంటే… అది పెద్దగా అసాధ్యం అనీ, అసహజం అనుకోవల్సిన అవసరమే లేదు… ఎందుకంటే..? రాజకీయాలంటేనే అసహజం కాబట్టి…
Ads
అరె, ఇదెలా సాధ్యం…. వేల కోట్ల ఎంపైర్ సృష్టించుకున్న మైహోం, లక్షల కోట్ల టర్నోవర్ సాధిస్తున్న మేఘాను కాదని… టీవీ9 వాళ్ల చేతుల్లో నుంచి ఆఫ్టరాల్ 9 శాతం షేర్లు కూడా లేని రవిప్రకాష్ చేతుల్లోకి ఎలా వెళ్తుంది..? పైగా తన స్వల్ప వాటాతో ఏకంగా 500 కోట్ల ఓ మీడియా గ్రూపును ఓన్ చేసుకోవడం రవిప్రకాష్‌కు సాధ్యమేనా..? అసలు హైహోం, మేఘా దాన్ని వదిలేస్తాయా..?
ఎస్, విలువైన ప్రశ్నలు… కానీ కొన్ని సంఘటనలు, పరిస్థితులను క్రోడీకరించుకుంటూ… మనం అవన్నీ జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ వెళ్లాలి…
- బేసిక్‌గా రవిప్రకాష్ యాంటీ బీజేపీ… కానీ తన పాత గుజరాతీ గ్యాంగు ద్వారా మోడీకి సన్నిహితుడయ్యాడు… కేసీయార్ కొట్టిన దెబ్బలతో తను అనివార్యంగా బీజేపీ సాయం కోరాడు, కాషాయ అంగీ ఒకటి అర్జెంటుగా కొనుక్కుని, ఇష్టం లేకున్నా తొడుక్కున్నాడు…
- బీజేపీ వాళ్లకే చెందిన రాజ్‌న్యూస్‌లో చేరాడు, మరో మూడు టీవీ చానెళ్ల మేనేజ్మెంటు కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు… పక్కా ప్రో-బీజేపీ… అంతెందుకు ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో కలిసి మొన్నటికిమొన్న దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల కార్యాచరణలో బీజేపీ తరఫున వర్క్ చేశాడు…
- అది బీజేపీతో సిద్ధాంత మితృత్వం కాదు… కేసీయార్ మీద కోపం… మైహోం మీద కోపం… మేఘా మీద కోపం… ఈలోపు ఏం జరిగింది..?
కేసీయార్ నమ్మిన ఇదే మైహోం, ఇదే మేఘా… మెల్లిగా బీజేపీ ఫోల్డ్‌లోకి వెళ్లిపోయాయి… బీజేపీ స్క్రూలు బిగిస్తే ఎలా ఉంటుందో వాటికి అర్థమైంది… అంతెందుకు..? అమిత్ షా చెప్పగానే టీవీ9 అర్జెంటుగా టీవీ9 బంగ్లా చానెల్ స్టార్ట్ చేస్తోంది… సేమ్, రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామిలాగే…
- హైహోంకు, మేఘాకు ఇప్పుడు కావల్సింది కేసీయార్ కాదు… బీజేపీ…. అసలు కేసీయారే వెళ్లి అమిత్ షా, మోడీలకు దండలు వేసి, దండాలు పెడుతూ వంగుతున్నవేళ ఈ వ్యాపారులకు బీజేపీతో వైరం దేనికి..?
కానీ, బీజేపీతో రాజకీయంగా పోరాడకతప్పదు… కాంగ్రెస్ పని అయిపోయింది… ఈ స్థితిలో రవిప్రకాష్ బీజేపీ చేతిలో అస్త్రంగా ఉండటంకన్నా కేసీయార్ క్యాంపుకి రవిప్రకాష్ తమకు అవసరం… ఈ విషయం కేటీయార్‌కు అర్థమైంది… తన డాడీ గుడ్డిగా ఇంకా మైహోం, మేఘాలను నమ్ముతున్నాడు తప్ప అవి బీజేపీకి ఉపయోగపడే వ్యవస్థలే అని కేటీయార్‌కు తెలిసిపోయింది…
అందుకే… మొన్న ఓ ప్రెస్‌మీట్‌కు వచ్చిన రేవతితో కేటీయార్ మాట్లాడాడు… ( ఈమె మోజో టీవీ మాజీ CEO)… రేవతి పక్కా రవిప్రకాష్ మనిషి… ఎందుకు రవిప్రకాష్ వేరే వాళ్ల చేతుల్లోకి అస్త్రంగా మారుతున్నాడు..? మనం ఏదో ఒకటి వర్కవుట్ చేద్దాం అని రాజీ ఫార్ములా ఏదో చెప్పాడు కేటీఆర్… టీఆర్ఎస్ కోణంలో కరెక్టు స్టెప్…
అయితే అసలే మై హోమ్, మేఘా మీద కసికసిగా ఉన్న రవిప్రకాష్ ఏ పాయింట్ దగ్గర రాజీపడతాడు..? తనపై కేసులు పెట్టారు, టీవీ9 నుంచి వెళ్లగొట్టారు, బదనాం చేశారు, మానసికంగా వేధించారు, జస్ట్, కేటీయార్ మాటల్ని నమ్మి తిరిగి యాంటీ-బీజేపీ స్టాండ్ తీసుకోగలడా..? టీవీ9 పగ్గాలు చేపట్టే చాన్స్ వస్తుందనే ఆశతో కేటీయార్‌కు స్నేహహస్తం అందిస్తాడా..? ఇది ఓ కీలకమైన ప్రశ్న…
అసలు కేటీయార్ తన డాడీ కేసీయార్‌ను ఈ దిశలో కన్విన్స్ చేయగలడా అనేది మరో ప్రశ్న… టీవీ9 తిరిగి రవిప్రకాష్ చేతుల్లోకి వచ్చేందుకు అనువైన మార్గాలు ఉన్నాయా..? కేటీయార్ ఎవరైనా మరో పెద్ద పెట్టుబడిదారుడిని తెరపైకి తీసుకురాగలడా..? అన్నీ చిక్కుప్రశ్నలే… కానీ అసాధ్యాలేమీ కాదు… అంతటి సీఎల్ రాజమే అప్పట్లో నమస్తే తెలంగాణను కేసీయార్‌కు హోల్ మొత్తంగా అప్పగించలేదా..? అలాగే ఇక్కడా ఏదో మార్గం దొరుకుతుంది..? అయితే…
నిజంగా రవిప్రకాష్ మళ్లీ వీళ్లను నమ్మే స్థితిలో ఉన్నాడా..? ఈ కీలకప్రశ్నే టీవీ9 భవిష్యత్తును తేల్చబోతోంది…
Share this Article