మన తిరుపతి లడ్డూ నాణ్యత నానాటికీ నాసిరకం… ఆనాటి రుచి లేదు, నాలుగు రోజులు నిల్వ కూడా ఉండటం లేదు… పాపం శమించుగాక… ఖండసార (నవ్వొత్) కలిపిన లడ్డూలు మాత్రమే… మనం మన ఖర్మ అని ఊరుకుంటాం, ఎంత సంపాదన ఉన్నా సరే టీటీడీ అధికారుల పాలన దరిద్రమింతేలే అని సమాధానపడిపోతాం… కానీ గుజరాత్‌లో అలా ఊరుకోవడం లేదు…
48 గంటల టైమ్ ఇచ్చి మరీ తర్జని చూపిస్తున్నారు భక్తగణం… వివరాల్లో వెళ్తే… గుజరాత్‌లో అంబాజీ టెంపుల్… ఇది శక్తిపీఠాల్లో ఒకటి… గుడి కూడా పెద్దది… వేలాది మంది భక్తులు వస్తుంటారు… పాపులర్ టెంపుల్… దశాబ్దాలుగా అక్కడ మోహన్‌థాల్ స్వీటును ప్రసాదంగా ఇస్తుంటారు… ఆ స్వీటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో దీపావళికి ప్రత్యేకంగా చేసుకునే మిఠాయి… శెనగపిండి, నెయ్యి, బాదం, పాలు ప్రధానంగా ఉపయోగిస్తారు…
మన దరిద్రగొట్టు అధికారగణం ఉంటుంది కదా… గుళ్లపై పెత్తనాలు చేసే బ్యాచ్… వాళ్లు ఈమధ్య ఓ నిర్ణయం తీసుకున్నారు… ఛస్, ఎప్పుడూ ఈ ఐటమేనా..? ఛేంజ్ చేద్దాం అనుకున్నారు… అదేదో హోటల్‌లో మెనూ అనుకున్నట్టున్నారు… మోహన్‌థాల్ బదులు పల్లీ చెక్కీ ప్రసాదంగా ఇవ్వాలని నిర్ణయం తీసేసుకున్నారు… ఇదయితే చీప్… పల్లీలు, బెల్లం ముడిపదార్ధాలు… అంతే… మోహన్‌థాల్ చేయడంకన్నా పల్లీ చెక్కీ చేయడం కూడా ఈజీ,,,
Ads
ఇది భక్తులకు, స్థానికులకు చిర్రెత్తింది… మోహన్‌థాల్‌ను మళ్లీ ప్రవేశపెట్టకపోతే మర్యాద దక్కదు అని హెచ్చరించారు… అబ్బే, ఈ స్వీటు చాలారోజులు ఉండటం లేదు, ప్రత్యేకించి ప్రవాస భారతీయులు ప్రసాదం మార్చాలని అడుగుతున్నారు… పల్లీ చెక్కీ అయితే నాలుగురోజులు ఎక్కువ నిల్వ ఉంటుంది కదా, అందుకని ఛేంజ్ చేశాం అని సాకులు చెబుతున్నారు టెంపుల్ అధికారులు, ఆ కథలన్నీ మాకు చెప్పకండి అని యాత్రికులు ఫైర్…
વિશ્વ વિખ્યાત શ્રી આરાસુરી અંબાજી માતા મંદીરની વર્ષો જૂની પરંપરા અને આગવી ઓળખ ધરાવતો મોહનથાળ ની પ્રસાદ ચાલુ રાખવા બાબતે @TempleAmbaji ને સર્વ ભક્તો વતી પ્રાર્થના.
જય અંબે…@CollectorBK @BJP4Banaskantha @yatradhamboard pic.twitter.com/w2SXUErDWT
— Munjaal Barot (@iMunjaalBarot) March 4, 2023
రాష్ట్ర బీజేపీ యువజనవిభాగం కూడా ఆందోళన నిర్వహించింది… మోహన్‌థాల్ అయితే కాస్త మెత్తగా ఉంటుంది, పల్లీ చెక్కీ అయితే డ్రైస్వీట్, ఎన్నాళ్లయినా ఉంటుంది అని టెంపుల్ అధికారగణం తన మాట మీదే నిలబడింది… అంతేకాదు, లడ్డూలు వంటి తక్కువ నిల్వనాణ్యత ఉన్న తిరుపతి, సోమనాథ్ గుడి ప్రసాదాలను కూడా మార్చే అవకాశముందని కూడా అక్కడి అధికారగణం చెబుతోంది… (కొంపదీసి తిరుపతిలో కూడా లడ్డూ ప్రసాదం బదులు పల్లీచెక్కీలు పెడతారా ఏమిటి ఖర్మ..?)
ఈ పల్లి చిక్కీ ప్రసాదం తయారీ బాధ్యతల్ని బానస్ డెయిరీ, అమూల డెయిరీలకు అప్పగిస్తున్నారట… హిందూ హీత్ రక్షా సమితి ఈ ప్రసాదం మార్పిడి నిర్ణయాన్ని మార్చుకోవాలని 48 గంటల గడువు ఇచ్చింది… అవసరమైతే గుడి కొన్నాళ్లు మూతపడినా సరే ఈ నిర్ణయాన్ని అమలు కానివ్వబోమంటున్నారట… ఒక్క అంబాజీ టెంపులే కాదు, ఈ భారత దేశంలో సర్కారు పెత్తనమున్న ఏ గుడైనా సరే, ఇలాగే ఏడుస్తుంది…!!
Share this Article