పార్ధసారధి పోట్లూరి …… బ్రిటన్ తరువాత మరో యూరపు దేశం ఫ్రాన్స్ లో అగ్నిజ్వాలలు రేగుతున్నాయి ! బ్రిటన్ లో ఆహార సంక్షోభం ఉంటే అదే ఫ్రాన్స్ లో ఆర్ధిక పరిస్థితి దిగజారి పోవడం వలన నిరసనలు తీవ్రంగా వ్యక్త్యం అవుతున్నాయి ! కానీ పాశ్చాత్య మీడియా కి మాత్రం అవి కనపడవు వినపడవు ! వాళ్ళకి భారత దేశంలో ప్రజాస్వామ్యం మీదనే ఆసక్తి ఎక్కువ !
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కొత్త పెన్షన్ నిబంధనలని తీసుకురావాలని ఆశిస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్రాన్స్ దేశంలో పదవీ విరమణ వయస్సుని 62 ఏళ్ల నుండి 64 ఏళ్లకి పెంచాలని యోచిస్తునాడు మాక్రాన్ !
దీని వల్ల రిటైర్ అయ్యే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి ఖజానా మీద భారం పడుతుంది ! 62 ఏళ్ల నుండి 64 ఏళ్ల కి రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచడం వలన వచ్చే రెండేళ్ల వరకు కేవలం జీతాలు ఇస్తే సరిపోతుంది ! అయితే రిటైర్మెంట్ వయసు పెంచడం ఒక్కటే ఆందోళనలకి ప్రధాన కారణం అయినా కొత్త కార్మిక చట్టాలని తేవాలని ప్రతిపాదించడం కూడా ఆందోళనలకి దారి తీసింది !
Ads
******************************
అధ్యక్షుడు మాక్రాన్ కార్పొరేట్ మరియు వ్యాపార వర్గాలకి మేలు చేకూర్చే విధంగా కార్మిక చట్టాలని సవరించాలని చూస్తున్నాడు అని ఆరోపణ ! ఇప్పటికే కార్పొరేట్ సంస్థల మీద పన్ను తగ్గింపు లాంటి చర్యలు తీసుకున్నాడు మాక్రాన్! ఇప్పుడు కొత్త చట్టానికి శ్రీకారం చుడితే అది కార్మికుల కి అన్యాయం చేసినట్లు అవుతుంది అనేది ఆరోపణ !
నిజానికి ఫ్రాన్స్ లో లాభాలు ఆర్జించలేని కార్పొరేట్ సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ లాభాలు లేక మూసివేయాల్సి వస్తే భారీ మొత్తంలో కార్మికులకి చెల్లింపులు జరపాల్సి వస్తున్నది అని కార్పొరేట్ వర్గాలు మాక్రాన్ మీద ఒత్తిడి తెస్తున్నాయి చాలా కాలం నుండి. ఫ్రాన్స్ లో కార్పొరేట్ , భారీ పరిశ్రమలలో, వ్యాపారాలలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి గత 6 ఏళ్లలో ! దీనికి కారణం ఉంది అదేమిటంటే, బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి వైదొలిగినప్పుడు చాలా దేశాలు బ్రిటన్ నుండి తమ పెట్టుబడలని ఉపసంహరించి ఫ్రాన్స్ దేశంలో పెట్టుబడులు పెట్టాయి!
ఏదన్నా సంస్థ కనుక పూర్తిగా మూసివేయాల్సి వస్తే కార్మికులకి ఇచ్చే నష్ట పరిహారం విషయంలో తమకి కొంచెం వెసులుబాటు ఇవ్వాలని కార్పొరేట్, పారిశ్రామిక సంస్థలు కోరుతున్నాయి లేకపోతే కొత్తగా ఏదన్నా ప్రారంభించాలి అంటే… అది నడవకపోతే వచ్చే నష్టంతో పాటు కార్మికులకి ఇచ్చే నష్ట పరిహారం కూడా ఎక్కువగా ఉండడం వలన, బాంకులకి తిరిగి అప్పు తీర్చే విషయం లో ఇబ్బందులు వస్తాయన్న భయంతో, చాలా మంది ఫ్రాన్స్ లో వ్యాపారం ప్రారంభించాలి అంటే భయపడుతున్నారు !
ఇక మాక్రాన్ కి ఈ విషయంలో సంస్కరణలు తేవడం తప్ప వేరే దారి లేదు ! అయితే ఇది ప్రజలకి ఇష్టం లేదు ! ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ లోని ఎగువసభలో చట్టం తేవడానికి ప్రతిపాదనలని సిద్ధం చేసి పార్లమెంట్ లో ఓటింగ్ కి పెట్టకుండా బిల్ పాస్ చేయడానికి మాక్రాన్ ప్రయత్నిస్తున్న తరుణం లో హింస ప్రజ్వరిల్లింది ! ఫ్రాన్స్ అధ్యక్షుడికి ప్రత్యేక అధికారం ఉన్న దృష్ట్యా ఏదన్నా బిల్లుని కనుక పార్లమెంట్ వ్యతిరేకించే అవకాశం ఉన్నప్పుడు అధ్యక్షుడు తనకి ఉన్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఓటింగ్ కి ఆస్కారం లేకుండా ఆమోదం పొందవచ్చు ! ఇదే ప్రస్తుత హింసకి ట్రిగ్గర్ పాయింట్ అయ్యింది !
**********************
రష్యా మీద ఆంక్షలు విధించడం వలన ఇంధనం ధరలు పెరిగి అది పరోక్షంగా ద్రవ్యోల్బణానికి దారి తీసిన స్థితి లో ఆర్ధిక పరిస్థితిని ఒక దారిలోకి తేవాలనే మాక్రాన్ ఉద్దేశ్యం మంచిదే కానీ ప్రజలకి ఇష్టం లేకుండా చేస్తే అది సఫలం అవ్వదు. ఒక వైపు అమెరికాలోని బాంకులు ఒక దాని తరువాత ఇంకొకటి మూత పడుతున్నా ఫెడరల్ రిజర్వ్ డాలర్లు ప్రింట్ చేస్తూ ఉండడం వలన తాత్కాలిక ఉపశమనం లభిస్తున్నది కానీ ఫ్రాన్స్ అలా యూరో లని ప్రింట్ చేయలేదు కాబట్టి వేరే మార్గంలో ఎకనామీ దారిలో పెట్టాల్సిందే !
మాక్రాన్ ఫ్రాన్స్ బాంకింగ్ రంగం సంక్షోభంలో పడకూడదని ఆశిస్తున్నాడు కానీ అది నేరవేరేట్లుగా కనపడడం లేదు. మాక్రాన్ తెస్తున్న కార్మిక చట్ట సంస్కరణలు మరియు పెన్షన్ స్కీమ్ సంస్కరణలు దీర్ఘకాలంలో ఫ్రాన్స్ దేశానికి మేలు చేసే విధంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు ! ఒక్క విషయం మాత్రం నిజంగా అందరూ ఒప్పుకోవాల్సి ఉంటుంది .. గత దశాబ్దాలుగా చాలా తక్కువ ధరకి రష్యా నుండి గ్యాస్ పైప్ లైన్ ద్వారా యూరోపు దేశాలు లబ్ధి పొందుతూ తమ వనరులని ఇతర రంగాల మీద పెట్టి మనుగడ సాగిస్తూ వచ్చాయి. గత సంవత్సర కాలంగా ఇంధనం ఎక్కువ ధరపెట్టి కొనాల్సి వచ్చే సరికి వీళ్ళ ఆర్ధిక వ్యవస్థ లోని లోపాలు ఒక్కోక్కటీ బయట పడుతున్నాయి !
దీని ప్రకారం యూరోపు ని భారత దేశం తో పోల్చి చూస్తే మనం ఎంత ఎక్కువగా డాలర్లు చెల్లించి ఇన్నాళ్ళూ మనుగడ సాగించామో అందరూ తెలుసుకోవాలి ! యూరోపు మరియు అమెరికా ల ఇష్టానుసారం క్రూడ్ ఆయిల్ ధరలని నియంత్రిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలని కంట్రోల్ చేస్తూ వచ్చాయి! ఇక మిగిలింది పెట్రో డాలర్ ఆధిపత్యానికి చెల్లు చీటీ వ్రాయడమే ! ఇది జరిగేంత వరకు అభివృద్ధి చెందుతున్న దేశాలు శతాబ్దాలు గడిచినా ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల హోదాలోనే ఉండి పోతాయి !
Share this Article