Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అగ్నిపూలు టైటిల్ ఏ పాత్ర తత్వానికి ఎలా సూటవుతుందో తెలియదు..!!

January 18, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….  నవల జనరంజకం అయితే సినిమా కూడా ప్రేక్షకరంజకం కానక్కరలేదు ; కావాలని లేదు ; కాదు కూడా . ఆరోజుల్లో యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన ఈ అగ్నిపూలు నవల బాగా పాపులర్ .

ఆ కధను సినిమాకరించటంలో అంత పెద్ద నిర్మాత రామానాయుడు , దర్శకుడు బాపయ్య , రచయిత జంధ్యాల విఫలమయ్యారనే చెప్పాలి . భారీ తారాగణం ఉండి , టెక్నికల్గా కూడా బాగానే ఉన్నా సక్సెస్ కాలేదు . ప్రేక్షకులు ఆదరించలేదు .

Ads

కృష్ణంరాజు తండ్రీకొడుకుల పాత్రల్లో విభిన్నరీతిలో బాగా నటించారు . మంచి పేరు కూడా వచ్చింది . తండ్రి పాత్రలో జమీందారు అల్లుడిగా దౌష్ట్యాన్ని , కర్కశత్వాన్ని ఎంత బాగా చూపాడో , అంత గొప్పగా ఉదాత్త , సౌమ్య పాత్ర అయిన కొడుకు పాత్రలో నటించారు . ఈ సినిమాకు ఎస్సెట్ అతని నటనే . ఆయన తర్వాత జయసుధని అభినందించాలి . కక్ష తీర్చుకోవాలని క్షణక్షణం రగిలిపోయే మనస్తత్వాన్ని బాగా ప్రదర్శించింది .

తర్వాత జయప్రద . గ్లామర్ పార్టుని అద్భుతంగా చూపింది . ఆమెవి రెండు నృత్యాలు సినిమాకు హైలైట్ . సినిమాలో మరో ప్రధాన పాత్ర హీరో తల్లి , కర్కశ తండ్రి భార్య , జమీందారు కూతురు జయంతిది . బహుశా ఈ సినిమాకు మైనస్ ఆవిడేనేమో ! ఏ యస్ వరలక్ష్మో , జి వరలక్ష్మో , ఏ శాంతకుమారో వేసి ఉంటే సినిమా రక్తి కట్టేదేమో !

ఇతర ప్రధాన పాత్రల్లో శ్రీధర్ , సుధాకర్ , సత్యనారాయణ , గుమ్మడి , నిర్మలమ్మ , సుభాషిణి , సుమలత , ఎర్ర నారాయణమూర్తి , అల్లు రామలింగయ్య , మమత , శరత్ బాబు , ముక్కామల , పద్మనాభం ప్రభృతులు నటించారు . యద్ధనపూడి సులోచనారాణి నవలల్లో పాత్రలు విరివిగా ఉంటాయి .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలకు సంగీతం ఎలా ఉన్నా బేక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బ్రహ్మాండంగా అందించారు . ఇప్పటి ఢాం ఢాం గాళ్ళు ఇలాంటి సినిమాల్లోని BGMను వినాలి . BGM అంటే డైలాగులు వినపడకుండా సౌండ్ కొట్టుకుంటూ పోవటం కాదు . సౌండ్ చేయకుండా ఉంటే డైలాగులు జనానికి వినపడతాయి .

ఈ సినిమాలో జయప్రద చేసిన రెండు నృత్యాలు చాలా బాగుంటాయి . ప్రియుడా పరాకా ప్రియతమా పరాకా వన్నె తేలిన కన్నె నాగు పాటలో సర్పంగా నృత్యం హైలైట్ . ఆ నృత్యానికి సరిపడా పాట సాగదు . ఆత్రేయ గారి స్పీడ్ సరిపోలేదు . జయప్రదదే మరో నృత్యం కన్నెగా ఉన్నానురా స్వామి పాటకు శాస్త్రీయ నృత్యం కూడా చాలా అందంగా ఉంటుంది .

వయసు కోతి వంటిది మనసు కొమ్మ వంటిది పాటలో కృష్ణంరాజు నటన చాలా బాగుంటుంది . సుధాకర్ , సుమలత పెళ్ళి రిసెప్షన్లో ఆర్టిస్టులు వేసే డాన్స్ , పాట రెండూ చాలా బాగుంటాయి . అబ్బాయి అబ్బాయి నువ్వెంత అబ్బాయి పాట . సుధాకర్ మీద ఉండే మరో పాట ఇది విస్కీ ఇది బ్రాందీ ఏదైనా ఒకటే భ్రాంతి ఓం శాంతి బాగానే ఉంటుంది . పాటల్ని ఆత్రేయే వ్రాసారా లేక ఎవరో వ్రాస్తే ఆయన పేరు వేసుకున్నారా అనే అనుమానం రాక మానదు . నాకొచ్చింది .

జంధ్యాల డైలాగులు బాగానే ఉంటాయి . నేను నవల చదవలేదు . బహుశా సినిమాటిక్ మార్పులు లేకుండా యధాతథంగా తీసారేమో తెలియదు . ఇంత భారీ తారాగణం ఉండీ కధను ఉరికించకుండా గూడ్స్ బండిలాగా తోలారు . సినిమా అంతా మైసూరు లలితా పేలసులోనే షూట్ చేసారు . ఆ పేలసును బాపయ్య బాగా వినియోగించుకున్నారు .

సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . జయప్రద అభిమానులు తప్పక చూడవలసినవే ఆ రెండు నృత్యాలను . అలాగే కృష్ణంరాజు , జయసుధ అభిమానులు తప్పక చూడాలి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు



అసలు నవలకు ఈ పేరు యద్దనపూడి ఎందుకు పెట్టారో, ఆమె భావన ఏమిటో తెలియదు… జంధ్యాల యధాతథంగా ఆ పేరు ఎందుకు వాడుకున్నాడో తెలియదు… మోదుగ పూలు… ఈ ఎర్రటి పూల చెట్లకు ఆయుర్వేద విలువలున్నాయి… ఈ పూలతో హోలీ రంగు చేసుకుంటారు… నెత్తుటి వర్ణపు ఈ పూల పేరును నవలలోని ఏ పాత్రకు ఏ గుణాన్ని చూపడానికి సింబాలిక్‌గా పెట్టారో కూడా అర్థం కాదు…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
  • ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!
  • … బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సైద్ధాంతిక గందరగోళం…
  • ఆనందశాస్త్రం..! science of happiness … సిలబస్‌లో ఉండాల్సిన సబ్జెక్టు..!
  • ఆ దరిద్రుడి పాత్రలో మోహన్‌లాల్… ఆ డార్క్ షేడ్స్ కథ తెలుసా మీకు..?!
  • ’’నా పిల్లల్ని అమెరికాలో పెంచుతున్నానా..? ఇండియాలోనా..?’’
  • అసలు కన్సల్టెన్సీ అనగానేమి..? నిజానికి అవి ఏమి చేయును..?
  • సొంత బిడ్డపై డర్టీ క్యాంపెయిన్… ఎందుకు కేసీయార్ సైలెంట్..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions