ఓ సూపర్ స్టార్ హీరో… మంచి గిరాకీలో ఉన్న హీరోయిన్, ఇతర నటులు… 24 క్రాఫ్ట్స్‌లో కూడా పేరొందిన ప్లేయర్స్… మంచి కథ… భారీ ఖర్చు… పేద్ద బ్యానర్… ఖర్చుకు వెరవని నిర్మాత… ఇంకేం… సూపర్ హిట్, బంపర్ హిట్ గ్యారంటీ అంటారా..?
తప్పు… డిజాస్టర్ కూడా కావచ్చు… సినిమాలకు సంబంధించి రిజల్ట్ ఎవడూ ఊహించలేడు… అఫ్‌కోర్స్, అలా ఖచ్చితమైన అంచనాలు సాధ్యమయ్యే పక్షంలో అసలు ఫ్లాపులు, డిజాస్టర్లు ఎందుకొస్తాయి..? మరి సినిమాలు, వినోదరంగానికి సంబంధించి ఏ ప్రాజెక్టయినా అంతేనా..? దాదాపు అంతే…!
దీనికి పర్‌ఫెక్ట్ ఉదాహరణ… ఆహా ఓటీటీ… ఇది తెలుగులో ఉన్న ఏకైక ఓటీటీ ప్లాట్ ఫామ్… చిరంజీవి, రాంచరణ్, బన్నీ, వరుణ్ తేజ్ సహా దాదాపు ఆరేడుగురు వరకూ హీరోలున్న మెగా ఫ్యామిలీ… అంతులేని సాధనసంపత్తి… డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ప్రొడక్షన్, ఫైనాన్సింగ్ అంశాల్లో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ మాటకు తిరుగులేదు తెలుగు ఇండస్ట్రీలో…
Ads
ఓటీటీల శకం ప్రారంభం కాగానే… భవిష్యత్తు వీటితే అనుకుని వెంటనే అరవింద్ సొంతంగా తెలుగులో ఓటీటీ స్టార్ట్ చేశాడు… తొలి ఓటీటీ, చివరి ఓటీటీ తెలుగులో..! నేషన్ వైడ్ రీచ్ ఉండే హిందీ, ఇంగ్లిష్, పలు భాషల కంటెంట్ ఉంటేనే ఆ ఓటీటీ నడుస్తుంది… కేవలం ఒక రీజనల్ లాంగ్వేజీలో ఓటీటీ నిలదొక్కుకోవడం కష్టం… అవును, అదే జరిగింది…
దీంతో అయినకాడికి అమ్ముకుందామని అనుకుంటున్నాడు తను… కొనసాగించే కొద్దీ నష్టాలే… అందుకే వదిలించుకోవడమే బెటర్ అనుకున్నాడు… కానీ కొనే పార్టీ దొరకడం లేదు… అసలే పెద్ద పెద్ద ప్లేయర్స్ వస్తున్నారు ఫీల్డ్‌లోకి… దీంతో ఉన్న ఓటీటీలో గందరగోళంలో పడుతున్నాయి… అందుకని డీల్ సెట్ కావడం లేదు…
ఒకవేళ అలాగే నడిపిద్దాం అనుకుంటే… కొత్త సినిమాల రేట్లను ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ అధిక రేట్లకు తన్నుకుపోతున్నయ్… సొంత కంటెంట్ క్రియేషన్ బాగా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది… రెవిన్యూ చాలా తక్కువ… ఇక త్వరలో డిస్నీ వయాకామ్ జాయింట్ వెంచర్ కూడా రంగంలోకి దిగి నేషనల్ రీచ్ ఉన్న హిందీ సినిమాలతోపాటు రీజనల్ మూవీస్ మీదా కన్నేయబోతోంది… వాళ్లకూ వైవిధ్యమున్న కంటెంట్ కావాలి కదా…
ఇది రహస్యమేమీ కాదు, ఫిలిమ్ సర్కిళ్లలో ప్రచారంలో ఉన్నదే… సోనీకి అమ్మేయడానికి అల్లు అరవింద్ ప్రయత్నించాడు… కానీ సోనీ, జీ5 విలీన ప్రయత్నాలు, ఫెయిల్యూర్ల నడుమ జీ5 చిన్న ప్లేయర్లను విలీనం చేసుకోవడం మీద పెద్దగా ఇంట్రస్టు చూపించలేదు… పైగా ఆహాలో కంటెంట్ కూడా తక్కువే కదా… (ఆహా ఓటీటీలో హైహోం గ్రూపు కూడా భాగస్వామి)…
నిజానికి అల్లు అరవింద్ జాగ్రత్తగా చౌకగా దొరికే సినిమాలు, టీవీ రియాలిటీ షోలను పోలిన ప్రోగ్రామ్స్‌తో తక్కువ ఖర్చుతోనే కంటెంట్ సమకూర్చుకుంటూ పోయాడు… రెవిన్యూ పెద్దగా పెరగకపోతే ఈ ఖర్చులు పైన పడొద్దని అనుకున్నాడు… కానీ అదే జరిగింది… ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, సమకూరుగుతున్న కంటెంట్ తక్కువ… పైగా సబ్‌స్క్రిప్షన్ రేటు కూడా తక్కువే…
కానీ రిస్క్ తీసుకుని, పెద్ద సినిమాలు తీసుకోవాలి, కానీ అంత రెవిన్యూ లేదు, అదీ దురవస్థ… సొంత వెబ్ సీరిస్ చేయాలంటే అదీ ఓ సినిమా నిర్మాణం రేంజ్ ఖర్చు… అల్లాటప్పా నటులతో తీస్తే ఎవరూ చూడరు… పోనీ, సోనీ కొనకపోతే పోనీ, కనీసం సన్ గ్రూపుకు అమ్మేయాలనుకుని కూడా ప్రయత్నాలు చేశారు, అదీ వర్కవుట్ కాలేదు… ఈ స్థితిలో ఇంకా పెట్టుబడి పెట్టి, దూకుడుగా వెళ్లడం ఒక మార్గం… మరి ఆమేరకు రెవిన్యూ ఎలా అనేది ప్రశ్న… అందుకే అంతటి మెగా ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ప్లేయర్ సైతం తలపట్టుకున్నాడు…!!
Share this Article