Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓటీటీ రియాలిటీ షోలకూ సక్సెస్ పార్టీలు..! భలే సెలబ్రేషన్స్..!!

July 30, 2024 by M S R

ఏదైనా సినిమా రిలీజయ్యాక రెండుమూడు రోజులకే సక్సెస్ ఫంక్షన్ పెట్టేస్తుంటారు కొందరు నిర్మాతలు… సక్సెస్ టూర్లు కూడా పెడతారు… అది పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ అన్నమాట… మరి టీవీ ప్రోగ్రాములకు..?

మంచి రేటింగ్స్ వస్తే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి బొమ్మలు పెట్టుకుని, ఫిగర్స్ రాసుకుని సంబరపడిపోవడమే… కానీ ఆహా ఓటీటీ మరో కొత్త ప్రయోగం చేసింది… అందులో సర్కార్ అనే ఓ డిఫరెంట్ చిట్ చాట్ గేమ్ షో వస్తుంది కదా, మొదట ప్రదీప్ హోస్ట్… ఇప్పుడు సుడిగాలి సుధీర్ హోస్ట్…

సెలబ్రిటీలను పిలిచి, కూర్చోబెట్టి, ప్రశ్నలు అడుగుతూ, బెట్టింగ్ పెంచుతూ, సమాధానాలు చెప్పించడం ఆ షో మెయిన్ లైన్… మధ్యలో మాటామంతీతో ప్రేక్షకులను ఎంటర్‌టెయిన్ చేయడం అసలు ఉద్దేశం… ప్రదీప్ స్పాంటేనిటీ చెణుకులు యాంకరింగుకు బలం… అందుకే అది కాస్త పాపులరైంది…

Ads

ఈమధ్య ప్రదీప్ ఎందుకో టీవీ, ఓటీటీ షోలకు దూరమయ్యాడు కదా… ఏదైనా సినిమా చేస్తున్నాడేమో… తన ప్లేసులోకి సుడిగాలి సుధీర్ వచ్చాడు… ఈ సీజన్ ఇంకా హిట్టయింది… ట్రెండింగులో ఉంటోంది… దాంతో కొన్ని ఎపిసోడ్లు కాగానే, వాటి హైలైట్స్‌ను రెండు ప్రత్యేక ఎపిసోడ్లు చేసి… ఇప్పటిదాకా పాల్గొన్న వాళ్లతో కలిపి స్పెషల్‌గా సక్సెస్ పార్టీ అని మరో ఎపిసోడ్ చేశారు…

నిజానికి సుడిగాలి సుధీర్‌ను మొదట్లో వదులుకున్న ఈటీవీ తరువాత నాలుక కర్చుకుని ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రాంతో మళ్లీ తెచ్చుకుంది… కానీ సుధీర్‌లోని పర్‌ఫార్మర్‌ను సరిగ్గా వాడుకోలేకపోతోంది… దాని రేటింగ్స్ అంతంతమాత్రమే… కానీ ఆహా టీం మాత్రం సుధీర్‌ను మంచిగా వాడుకుంటోంది…

తను ప్లేబాయ్ ఇమేజీతో లేడీ కంటెస్టెంట్లతో కొంటె సరసాల ముచ్చట్లు పెడతాడు, డాన్స్ చేస్తాడు, ఎవరైనా పంచులేస్తే అమాయకంగా మొహం పెడతాడు, ఉడుక్కుంటాడు… ఉడికిస్తాడు… సర్కార్ షోలో కూడా అంతే… ఈ సక్సెస్ పార్టీ కూడా అంతే… ఇలాంటి ధోరణే ఫ్యామిలీ స్టార్స్‌లో కూడా కనిపిస్తున్నా సరే, దానికెందుకో రేటింగ్స్ తక్కువే… ఎక్కడో ఏదో మిస్సవుతోంది…

ప్రోమోలో బాబా భాస్కర్, ఫైమా, రోహిణి, సిరి హన్మంతు, శ్రీహాన్, వర్ష, ఇమాన్యుయేల్, అమరదీప్, అవినాశ్, యాదమరాజు, టేస్టీ తేజ తదితరులు కనిపిస్తున్నారు… ముగ్గురేసి టీమ్స్ చేసి అదే సర్కార్ షోను సరదాగా నడిపించారు, ఓ రెండు మాస్ మసాలా పాటలు, దానికి గ్రూప్ డాన్సులు, సుధీర్ స్టెప్పులు… తరువాత నీహారిక రావడం, సహజంగానే పవన్ కల్యాణ్ మీద పొగడ్తలు… మొత్తానికి అమ్మేస్తాం అమ్మేస్తాం అంటూనే ఆహా ఓటీటీ కాస్త వినోదానికి పదును పెడుతూనే ఉంది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కన్నెపల్లిపై అదే స్క్రిప్టు – అదే ప్రహసనం — కాకపోతే ఫేస్ మారింది!!
  • కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది…
  • ఏ కెరటం ఏ తీరానికి చేరుతుందో – ఈ మోహిని ఇప్పుడేం చేస్తోందంటే?
  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …
  • ఎగిసిన రంగుల కెరటాలు కొన్ని విరిగిపడటం… స్వయంకృతాలే..!
  • 5 కోట్ల బంగారు రామచరితమానస్ – అయోధ్య గుడిలో మాయం !
  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…
  • మూడు రాచకుటుంబాల వారసత్వం – ఒక్క వీడియోతో కెరీర్ కకావికలం
  • FIFA 2026 – అనూహ్య ఫలితాలు – అంచనాల్లో తేడాలే అసలు మజా!!
  • I will find you – గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ –

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions