నో డౌట్… తెలుగు ఇండియన్ ఐడల్ షోకు మెయిన్ ప్లస్ పాయింట్ థమన్… తనదే నిర్ణయాధికారం… స్పాంటేనియస్‌గా వేసే జోకులు, సెటైర్లే గాకుండా తను ఈ షోకు ఒక ఎనర్జీ… నిశితంగా ఒక పాట పాడటంలో మైనస్ ప్లస్ గమనించి, నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టేస్తాడు… కానీ అప్పుడప్పుడూ కాస్త గీత దాటతాడు…
ఈసారి ఎపిసోడ్‌లో ఏవో యాడ్స్ గురించి ప్రస్తావన వస్తుంది… ప్రమోషన్ కోసం ఏవో కామెంట్స్… నేనయితే మేట్రిమోనీ చూస్తుంటా, ఎందుకంటే నేను సింగిల్ కదా అంటాడు శ్రీరామచంద్ర… అరెయ్, ముంబైలో ఈ మాట వింటే ఎందరు ఫీలవుతారో అని వెంటనే థమన్ పంచ్… శ్రీరామచంద్ర ఖండించలేక, ఔననలేక… ఫాఫం… సరదాగానే అయినా, వోకే అంటేనే ఆహా టీం దాన్ని అలాగే ఉంచేసినట్టుంది…
సరే, దీన్నలా పక్కన పెడితే… ఒకటీరెండు విషయాలు… ఈసారి హరిప్రియ ఎలిమినేట్ అయ్యింది… నిజానికి ఆమె ఇతరులతో పోలిస్తే మరీ అంత దరిద్రంగా ఏమీ పాడలేదు, మంచి మెలొడీ సాంగ్ సేమ్ పీల్‌తో పాడింది, ఆమె నవ్వులాగే మనోహరంగా ఉంది పాట… ఎలిమినేషన్‌ను కూడా హుందాగా, ఏ ఓవరాక్షన్ లేకుండా స్వీకరించి వెళ్లిపోయింది… షో కాస్త కళతప్పింది…
Ads
దీనికి కారణం, జడ్జిలు వేసే స్కోర్లు మాత్రమే కాదు, వోటింగ్ కూడా… గత సీజన్‌లో ఈ వోటింగ్ మేనేజ్ చేసుకోలేక అమెరికా సింగర్ శృతి నండూరి వెనకబడింది… స్టార్ మాటీవీలో వచ్చే బిగ్‌బాస్‌కు కూడా ఇదే జబ్బు కదా… ఏవేవో పిచ్చి మాటలు చెబితే ప్రశాంత్ అనే రైతు బిడ్డ అట, గెలిచాడు… తరువాత తెలుసు కదా, గొడవలు, కేసులు, ఇప్పుడు ఆ డబ్బుతో జల్సాలు, గురువు శివాజీ చెప్పాలిక…
హరిప్రియ ఎలిమినేషన్‌కు కారణం వోటింగులో వెనకబడటం… ఇక బిగ్‌బాస్‌లోలాగే తెలుగు ఇండియన్ ఐడల్ షోకు వచ్చేవాళ్లు బయట సోషల్ మీడియా ఆర్మీలు, టీమ్‌లు ఏర్పాటు చేసుకుని, వోటింగ్ వ్యవస్థను మేనేజ్ చేసుకుని రావాలా..? నిజంగా జనం ఒక పాట పాడటంలో మెరిట్‌ను ఖచ్చితంగా అంచనా వేయగలరా..? ఇది ఈ షో బేసిక్ బ్లండర్… ఈ వోటింగుతో సదరు ఓటీటీకి వచ్చే ఫాయిదా కూడా ఏముందో అర్థం కాదు…
ఈసారి నచ్చింది రామ్ మిరియాల, విజయ్ ఏసుదాస్ ప్రజెన్స్ మాత్రమే కాదు… బాగా ఫ్లూట్ వాయించిన ఆర్కెస్ట్రా ఫ్లూటిస్టు సాయిని కూడా ఓ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి గుర్తించడం, గౌరవించడం… చాలా మ్యూజిక్ షోలలో అసలు ఆర్కెస్ట్రాను పట్టించుకోరు, అసలు చూపించరు… ఈ షోలో నచ్చింది ఇదే… పవన్, కామాక్షి, సాయి… ఆల్ ఆర్ ఎక్సలెంట్…
త్వరలో జీ తెలుగు సరిగమప కొత్త సీజన్ ఆడిషన్స్ స్టార్టవుతున్నట్టు ఓ యాడ్ చూశాను… ఎవరో శ్రీముఖిని హోస్ట్ చేసేసి, దిక్కుమాలిన జోకులతో ప్రోగ్రాంను మరీ నేలబారుగా నడిపించకుండా… కాస్త ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోను చూసి నేర్చుకుంటే బెటర్ అనిపించింది… పోలికలు అక్కర్లేదు… కానీ జీతెలుగు సరిగమప గత సీజన్లు చూస్తే చిరాకెత్తిన అనుభవంతో చెబుతున్న సలహా ఇది..!!
Share this Article