.
వినియోగదారులను ఏరకంగా మభ్యపెట్టినా… అర్థం కాని ట్రాప్‌లో బిగించినా… దాన్ని మోసమే అంటారు… చివరకు ఓటీటీలు కూడా అలాగే తయారయ్యాయి… పర్టిక్యులర్‌గా ఆహా… అల్లు అరవింద్‌తోపాటు ఎవరెవరు మేఘా ప్లేయర్లు భాగస్వాములో గానీ దాని సబ్‌స్క్రిప్షన్ కూడా ఓ దందా టైపే…
అలా చేస్తున్నా సరే, బోలెడు నష్టాలు… నిజానికి అందులో పెద్దగా పడీ పడీ చూడవల్సిన కంటెంటు ఏమీ ఉండదు… అందుకని సబ్‌స్క్రిప్షన్లు తక్కువే… థమన్, గీతామాధురి, కార్తీక్ జడ్జిలుగా ఉంటే తెలుగు ఇండియన్ ఐడల్ మాత్రం కాస్త బెటర్…
Ads
దానికోసమే ఓ 3 నెలల సబ్‌స్క్రిప్షన్ ధైర్యం చేస్తుంటా… అఫ్‌కోర్స్, మొదటి రెండు సీజన్లు ఫెయిర్… వాగ్దేవి గానీ, సౌజన్య గానీ… కానీ మూడో సీజన్ మొత్తం థమన్, గీతామాధురి రాగద్వేషాలతో చెడగొట్టారు… ఎవరి ద్వారానో పట్టుబట్టి షోలోకి లేటరల్ ఎంట్రీ ఇచ్చిన అభిజ్ఞను రెండుమూడు వారాలకే ఎలిమినేట్ చేశారు, ఆమె తిరిగి జీతెలుగు షోలోకి వెళ్లి విజేత అయ్యింది…
అనిరుధ్ సుస్వరం టాప్ త్రీ వరకూ వచ్చాడు, విజేత కాలేదు… తను హిందీ ఇండియన్ ఐడల్ షోకు వెళ్లి చాలా వారాలపాటు దుమ్ము రేపాడు… శ్రీకీర్తి కూడా టాప్ త్రీ వరకూ వచ్చినా నిజానికి అసలైన విజేత కీర్తన… ఈసారి కూడా మస్తు ఆడిషన్స్ నిర్వహించారు…
ఈసారి కూడా అదే శ్రీరామచంద్ర హోస్ట్… ఆ ముగ్గురే జడ్జిలు… శ్రీరామచంద్రతోపాటు ఈమధ్య సోషల్ మీడియాను అల్లాడిస్తున్న మరో గాయని సమీర కో-హోస్టుగా కనిపించింది… కొనసాగుతుందా లేదా తెలియదు గానీ… థమన్, గీతామాధురి కచేరీలు చేస్తుంటారు కదా… వాటికోసం ఓ మెరిట్ హంట్‌గా ఉపయోగపడుతోంది ఈ షో వాళ్లకు…
ఈనెల29 నుంచి స్టార్ట్ చేస్తారంటే 3 నెలల సబ్‌స్క్రిప్షన్ కోసం చూశా… రకరకాల రేట్లు… బయట 149 అంటారు, తీరా సబ్‌స్క్రయిబ్ బటన్ నొక్కితే 249 కనిపిస్తుంది, లేదా 299.,. సరే, 150 తగ్గింపుతో 99 అని కనిపించింది ఎక్కడో… సబ్‌స్క్రయిబ్ పే చేయబోతే ‘ఆటోపే’ చేస్తేనే డబ్బు తీసుకుంటాడట… అదీ 249 వరకు పర్మిషన్ అట…
ఈ బాగోతం దేనికిలే అనుకుని, చాట్ బాక్సులో అడిగితే, మీరు ఎప్పుడైనా కేన్సిల్ చేసుకోవచ్చు సెటింగ్స్‌లోకి వెళ్లి అన్నది ఆ ఎఐ చాటర్… తీరా 99 చెల్లించామా..? అసలు కేన్సిల్ ఆటోపే అనే ఆప్షనే లేదు… చీటింగు కాదా ఇది మిస్టర్ అల్లు అరవింద్…? సరే, కొంతలోకొంత సర్కార్ షో సరదాగా ఉంటుంది… ఈ ఇండియన్ ఐడల్ అదనం…
ఎందుకంటే..? స్థూలంగా ఈటీవీలో వచ్చే పాడుతా తీయగా బాగున్నట్టే అనిపించినా… ఏదో లోపిస్తోంది… అర్థం కాని లోటు ఏదో.,. అందుకే టీఆర్పీలు కూడా చాలా చాలా తక్కువ ఆ షోకు… జీతెలుగు సరిగమప షోను మరీ వెకిలి కామెడీ షోగా మార్చేశారు…
Share this Article