.
తెలుగులో ఒకటే ఓటీటీ… గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్, మైహోం రామేశ్వరరావు, అర్జున్ లొల్లా (జ్యూక్)… అతిరథ మహారథులు కదా… కాస్త క్రెడిబులిటీ ఉండాలి కదా… ప్రేక్షకుల పట్ల కనీస నిజాయితీ, పారదర్శకత ఉండాలి కదా… సబ్‌స్క్రిప్షన్‌లో నానా హిడెన్ ఫ్యాక్టర్స్, ఆటోపే అనే పే-ద్ద మాయ, ప్యాకేజీల్లో మర్మం… పరమ చెత్తా సబ్‌స్క్రిప్షన్ సిస్టం…
సబ్‌స్క్రయిబ్ చేద్దామని, బుక్ అయిపోయి, చివరకు ఒక ఎఐ ప్లాట్‌ఫామ్ సాయంతో గంటన్నర తిప్పలు పడి… చివరకు గట్టెక్కిన బాధితుడిని..! ఈ ఓటీటీ బాధ్యులు నిజంగా సిగ్గుపడాలి… ఈ మాట అనడానికి నాకు ఏ సంకోచమూ అడ్డురావడం లేదు… అంత దరిద్రంగా ఉంది వీళ్ల క్రెడిబులిటీ…
Ads
జియో హోమ్ కనెక్షన్ ఉన్నవాళ్లకు, ఎయిర్ ఫైబర్ కావచ్చు, కేబుల్ కనెక్షన్ కావచ్చు… అన్ని ఓటీటీ ప్లాట్‌ఫారాలు ఆ ప్యాకేజీల్లోనే వస్తాయి… నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వంటి ఒకటీరెండు తప్ప… కానీ ఆహా ఉండదు అందులో… చివరకు అంత తోపు ఈటీవీ విన్ కూడా ఉంటుంది… సరే, ఈ సబ్‌స్క్రిప్షన్ మాయామర్మాలు చూద్దాం…
డిజిటల్ వినోదం ఇప్పుడు అరచేతిలోకి వచ్చేసింది… కానీ, ఆ వినోదాన్ని పొందడానికి మనం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు… ముఖ్యంగా ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, అందులోనూ మన ‘ఆహా’ (Aha) వంటి సంస్థలు అనుసరిస్తున్న సబ్‌స్క్రిప్షన్ విధానం చూస్తుంటే, అది వినియోగదారులకు సేవ చేయడానికా లేక వారిని ముప్పుతిప్పలు పెట్టడానికా అన్న అనుమానం కలగక మానదు…

కనిపించని ప్లాన్లు.. వినిపించని గోడు!
సాధారణంగా ఏ వ్యాపారమైనా తక్కువ ధర ప్లాన్లను ముందు ఉంచుతుంది… కానీ ఇక్కడ రివర్స్! మీరు యాప్ ఓపెన్ చేస్తే ₹699, ₹399 ప్లాన్లు తళతళలాడుతూ కనిపిస్తాయి… (పైగా తమిళంతో లింక్)… కానీ సామాన్యుడు కోరుకునే ₹99 లేదా మూడు నెలల 149 బాపతు మొబైల్ ప్లాన్స్ ఎక్కడుందో వెతకడానికి భూతద్దం పట్టుకోవాలి… అది కూడా ‘ఆటో-పే’ (Autopay) ఆప్షన్ పెడితేనే దర్శనమిస్తుంది… అంటే, మీ అనుమతి లేకుండానే ప్రతి మూడు నెలలకోసారి మీ అకౌంట్ నుండి డబ్బులు గుంజేయాలనేది వీరి అసలు ప్లాన్… ఆటో పే లేకుండా సబ్‌స్క్రిప్షన్ ఆప్షనే కనిపించదు…
డబ్బు కట్ అయింది… కానీ సినిమా ఎక్కడ?
ఒక సామాన్య వినియోగదారుడు కష్టపడి ఆ ప్లాన్ ఎంచుకుని, యూపీఐ (UPI) ద్వారా పేమెంట్ చేస్తే అసలు కథ మొదలవుతుంది… “Connecting Securely” అంటూ బఫరింగ్ చక్రం తిరుగుతూనే ఉంటుంది… అకౌంట్ నుండి డబ్బులు కట్ అయిపోతాయి కానీ, సబ్‌స్క్రిప్షన్ మాత్రం యాక్టివేట్ అవ్వదు… ఆ సమయంలో సగటు మనిషికి వచ్చే చిరాకు, ఆందోళన వర్ణనాతీతం… Dark Patterns…
కస్టమర్ కేర్ – ఒక మిధ్య!
సమస్య వస్తే ఫిర్యాదు చేద్దామంటే సరైన దారి ఉండదు… మెయిల్ పంపితే రిప్లై రాదు, ఫోన్ చేస్తే కలవదు… టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవారు ఐపీ ట్రాకింగ్, డీఎన్ఎస్ సెట్టింగ్స్, కాషె క్లియర్ వంటి విద్యలు ప్రదర్శించి ఎలాగోలా బయటపడతారు… మరి ఏమీ తెలియని అనామకుడు ఈ మాయలో చిక్కితే పరిస్థితి ఏమిటి..? రెండుసార్లు పేమెంట్ చేసి మోసపోవడమో, లేక తన డబ్బులు పోయాయని విచారించడమో తప్ప మరో దారి లేదు…
ఇది ‘యూజర్ ఫ్రెండ్లీ’ యా లేక ‘యూజర్ హాస్టైల్’యా?
టెక్నాలజీ పెరిగే కొద్దీ పనులు సులభతరం అవ్వాలి… కానీ ఈ ఓటీటీ సంస్థలు తమ లాభాల కోసం క్లిష్టమైన ప్రాసెస్ (Dark Patterns) ని ప్రవేశపెడుతున్నాయి… ఆటో-పేని రద్దు చేయడం ఎలాగో తెలియక వేలమంది ప్రతి నెలా తమకు తెలియకుండానే డబ్బులు కోల్పోతున్నారు…
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండండి… పేమెంట్ చేసిన వెంటనే మీ బ్యాంక్ లేదా యూపీఐ యాప్‌లో ‘ఆటో-పే’ ఆప్షన్‌ను మాన్యువల్‌గా రద్దు చేసుకోండి… లేదంటే, మీ వినోదం మీకే భారంగా మారుతుంది… హెలో, అల్లు అరవింద్ భాయ్... ఆసియాలోకెల్లా అత్యాధునిక డోల్బీ, లార్జ్ స్క్రీన్లు సరే... నీ ఓటీటీ క్రెడిబులిటీ సంగతి చూడు ఓసారి..!!
Share this Article