.
రచయిత, నిర్మాత, దర్శకుడు ప్రభాకర్ జైనీ పోస్టు… ‘‘కృత్రిమ మేధస్సుతో పాట క్రియేట్ చేయవచ్చు… లిరిక్స్ రాసి ఇస్తే ఎఐ ప్లాట్‌ఫామ్ 30 సెకన్లలో పాట కంపోజ్ అయిపోయింది…’’
ఈ పోస్టు చూడగానే మరో వార్త గుర్తొచ్చింది, నిన్నో మొన్నో కనిపించింది… టుక్ టుక్ అనే సినిమాలో ఓ పాట చిత్రీకరణకు ఎఐ సాయం తీసుకున్నాం, ఇదే మొదటిసారి అని సినిమా టీం ప్రకటించుకుంది… కానీ..?
Ads
ఎఐ సాయం లిరిక్స్ కోసమా, పాట స్వరపరచడానికా..? బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ కోసమా…? లేక హీరోహీరోయిన్ల కదలికలు, స్టెప్పులు, ఎమోషన్లు, నటన కూడా ఎఐ సాయంతో చిత్రీకరించారా..? క్లారిటీ లేదు… సరే, దాన్ని వదిలేస్తే…
ఇప్పుడున్న టెక్కాలజీ యుగంలో ఒక్కసారి ఆలోచించండి… పుష్ప, చావ్లా వంటి మంచి కథ కావాలోయ్ అని మీకు ఏమేం ఫీచర్స్ కావాలో చెప్పండి, ఎఐ మంచి కథను ఇస్తుంది… పాటల్ని అదే రాస్తుంది… స్వరపరుస్తుంది… ఊ అంటావా, కుర్చీ మడతబెట్టి వంటి ఐటమ్ సాంగ్‌తో సహా…
మంచి స్క్రీన్ ప్లే కావాలా..? రెడీ… అంతెందుకు..? మీకు ప్రభాస్, అనుష్క, రానా బాపతు బాహుబలి టీమ్ మొత్తం కావాలా..? అదనంగా జూనియర్, రాంచరణ్ కూడా కథలో భాగం కావాలా..? అన్నీ చేస్తుంది అదే… అంతేకాదు, వాళ్లెవరూ షూటింగుకు రానవసరం లేదు…
వాళ్లను అచ్చంగా దింపేస్తుంది ఎఐ… కోటలు, జలపాతాలు, హిమపర్వతాలు, యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలు ఎట్సెట్రా… మనం ఆర్డర్ చేస్తూ పోవాలి, సరైన ఇన్‌పుట్స్ ఇస్తూ పోవాలి… అంతిమంగా సినిమా డిజిటల్ ప్రింట్ ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్…
మీకు గుర్తుందా..? 18 ఏళ్ల క్రితమే ఏంజెలినా జూలీ మొహం, బాడీ, రూపురేఖలతో ఓ యానిమేషన్ (motion capture animated ) సినిమా (Beowulf) వచ్చింది… అంతెందుకు..? రజినీకాంత్ బిడ్డ సౌందర్య 2014లోనే ఆయన హీరోగా కొచ్చాడియాన్ సినిమా తీసింది… సో, టెక్నాలజీ కొత్తదేమీ కాదు… ఎటొచ్చీ, ఇది విస్తృతంగా అమల్లోకి రాలేదు… కారణం..?
జనానికి ఒరిజినల్ కావాలి… ఎఐ ఎంత బృహత్తర ప్రతిభ చూపినా సరే, ఒరిజినల్ ఒరిజినలే… ప్రభాస్ ఫైట్ చేయాలి… అది తెర మీద కనిపించాలి… ఏ శ్రీలీలో వగలు చూపించాలి… రానా విలనీ కనిపించాలి… ఒక సాయిపల్లవి మొహంలో ఉద్వేగాలు తెరపై ప్రదర్శితం కావాలి…
అంతేతప్ప… పాటలు, సంగీతం, ఫైట్లు, స్టెప్పులు ఏవైనా సరే… గ్రాఫిక్స్, టెక్నాలజీయే సినిమా కాదు… సినిమా పనిని అవి సులువు చేయాలి, అదనపు ఆకర్షణ కావాలి, ప్రయాసను తగ్గించాలి… అంతే… అది టూల్ మాత్రమే, అది రియల్ లైఫ్ కాదు…
ఆమధ్య ఎస్పీ బాలు గొంతుతో ఎవరో ఓ పాట క్రియేట్ చేశారు… బాలు కొడుకు చరణ్ కేసు పెట్టాడు… అలా వాడుకోవడం మీద కాదు, నా రాయల్టీ మాటేమిటని…! సో, కంప్యూటర్లలో ఎఐ సాయంతో ఏదైనా క్రియేట్ చేయవచ్చు… అంతెందుకు అదే మాయాబజార్‌ను ఎఐకి అప్పగించండి… 4కే కాదు, 8 కే క్లారిటీ పిక్చర్ ఇస్తుంది…
కానీ బ్లాక్ అండ్ వైట్‌లో చూస్తేనే ఆ మాయాబజార్ సినిమా థ్రిల్… సేమ్, మనిషికి ఒరిజినల్ కావాలి… ఒరిజినల్‌ను మరిపించే స్థాయిలో డూప్లికేట్ ఉన్నా సరే… ఈ కుట్ కుట్‌లు, టుక్ టుక్‌లు ప్రస్తుతానికి ప్రయోగాలు మాత్రమే,.. అవీ ప్రచారం కోసం మాత్రమే…!!
అంతెందుకు..? సినిమాలకు టెక్నాలజీ ఉపయోగంలో అవతార్ టాప్ కదా… కానీ గ్రాఫిక్స్, టెక్నాలజీ సినిమాను, ప్రేక్షకుల్ని మరోలోకంలోకి తీసుకుపోవడానికి ఉపయోగపడ్డాయి తప్ప అవే సినిమా కాలేదు… కథ, సంగీతం, స్క్రీన్ ప్లే, ప్రజెంటేషన్, ఆర్టిస్టుల నటన ఎట్సెట్రా బ్రహ్మాండంగా కుదిరాయి గనుకే అది బ్లాక్ బస్టర్, అదొక చరిత్ర…!
Share this Article