Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇండియాకు వస్తున్నారా… బీ అలర్ట్, ఎబోలా డిక్లరేషన్ తప్పనిసరి!

November 19, 2026 by M S R

.

సంకల్పం మంచిదే… కానీ ఆచరణే అడ్డదిడ్డం ఇండియాలో! అది ఏ విషయంలోనైనా అంతే… ఉదాహరణకు ప్రస్తుతం విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న ఇండియన్లు గానీ, నాన్ ఇండియన్లు గానీ తప్పనిసరిగా ఎబోలా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇమిగ్రేషన్ దగ్గర సబ్మిట్ చేయడం..!!

ప్రమాదం ముంచుకొచ్చాక తీరిగ్గా కళ్లు తెరవడం, ఆపై హడావుడిగా మొక్కుబడి తనిఖీలు చేపట్టడం మన వ్యవస్థలకు కొత్తేమీ కాదు…. కాస్త వివరాల్లోకి వెళ్దాం… ఈ సెల్ఫ్ డిక్లరేషన్ దేేనికంటే..?

Ads

ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో మే నెల నుంచే ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తూ, వేలాది మంది ప్రాణాలను బలిగొంటుంటే మన యంత్రాంగం ఇన్నాళ్లూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. తీరా ఇప్పుడు నవంబర్‌లో ఎబోలా ముప్పు పొంచి ఉందంటూ దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ‘సెల్ఫ్ డిక్లరేషన్’ అంటూ హడావుడి మొదలుపెట్టారు.

air suvidha

నిజానికి ఆఫ్రికాలోని పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల మీద ఇతర దేశాలు నిఘా పెడుతున్నాయి… ఎందుకంటే..? కరోనాకన్నా ఎబోలా ప్రాణాంతకం… కాంగోలో 5 వేల మందికి పైగా మరణించారు… కాకపోతే పెద్ద రిలీఫ్ ఏమిటంటే..? ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ కాదు, అందుకని వేగంగా పాండమిక్ అయిపోదు… లాక్ డౌన్‌లు అవసరం లేదు… కాకపోతే ఎబోలా అని తేలితే కొన్నిరోజులు క్వారంటైన్ బెటర్…

ఇండియాలో… అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ఒక్క కేసు కూడా డిటెక్ట్ కాలేదు, ఐనా సరే, నిఘా అవసరం, కరోనా పీరియడ్‌లో చేసిన తప్పులు ఇప్పుడు చేయకూడదు… ఐతే అది సీరియస్‌గా చేయాలి… నిజానికి ఈ నిఘా కసరత్తు ఎప్పుడో ప్రారంభమై ఉండాల్సింది. పోనీ, ఆలస్యంగానైనా కళ్లు తెరిచారు కదా అని సంతోషించే లోపే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతు చూస్తే ఇదంతా కేవలం ‘తూతూమంత్రం’ వ్యవహారంగానే కనిపిస్తోంది…

ఇండియాకు వచ్చే స్ట్రెయిట్, కనెక్టింగ్ ఫ్లయిట్లలోనూ ఫారాలు ఇస్తూ, నింపి ఇమిగ్రేషన్ దగ్గర ఇవ్వాలని చెబుతున్నారు, తప్పనిసరి అంటున్నారు, విమానం దిగగానే అడుగుతున్నారు… గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించారా? జ్వరం, నీరసం వంటి లక్షణాలు ఉన్నాయా? అన్న వివరాలను అందులో నింపాలి. పాస్‌పోర్టు నంబర్, ఎయిర్ లైన్స్ నంబర్, సీట్ నంబర్, మెయిల్ ఐడీ, అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వాలి తప్పకుండా…

నిజానికి బోర్డింగ్ పాస్ ఇచ్చే దగ్గర, టికెట్ బుకింగ్ దగ్గర ఈ డిక్లరేషన్ విషయం గట్టిగా చెబితే, అక్కడే రాసుకుని, విమానం దిగాక ఇచ్చే వీలుంది, లేదా బోర్డింగ్ కోసం వెయిట్ చేసే టైములోనే ఫారం ఎయిర్ సువిధ సైటులోకి అప్‌లోడ్ చేసే వీలుంది… అసలు తప్పకుండా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలనే అవగాహనే లేదు ఎవరికీ… విమానాల్లో లాండింగుకు ముందు ఫారాలు ఇస్తున్నారు…

సుదీర్ఘ ప్రయాణం చేసి, విమానం దిగిన అలసటలో ఉన్న ప్రయాణికులు ఆ ఫారాలను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇమిగ్రేషన్ దాటాలంటే ఏదో ఒకటి రాసి ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి కాబట్టి, ఆ ప్రశ్నలను సరిగ్గా చదవకుండానే ‘నో’ అని టిక్కులు కొట్టేస్తున్నారు.

అసలు విడ్డూరం ఏమిటంటే, ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద ఈ ఫారాలను కనీసం కీన్‌గా పరిశీలించే నాథుడే లేడు. ప్రయాణికులు ఇచ్చిన ఆ కాగితాన్ని అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా తీసుకుని, పక్కనే ఉన్న ఒక బుట్టలో పడేస్తున్నారు. పాస్‌పోర్ట్ స్టాంపింగ్‌కు, ఆ సెల్ఫ్ డిక్లరేషన్‌కు ఎక్కడా లింక్ లేకుండా పోయింది…

ఆన్‌లైన్‌లో ‘ఎయిర్ సువిధ’ (Air Suvidha) పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేయాలని నిబంధన పెట్టినా, దాన్ని డిజిటల్‌గా క్రాస్ చెక్ చేసే వ్యవస్థ ఎయిర్‌పోర్టు గేట్ల వద్ద కనిపించడం లేదు… అసలు ఇదంతా అవసరం లేదు…

నిజంగా ఎబోలా వంటి ప్రాణాంతక వైరస్ దేశంలోకి రాకుండా అడ్డుకోవాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, ఈ కాగితపు ఫారాల తతంగం కంటే ఎంతో సులభమైన, కచ్చితమైన మార్గం అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రయాణికుడు ఏ దేశం నుండి ఎక్కడికి ప్రయాణించాడనే పూర్తి సమాచారం (API – Advance Passenger Information) సివిల్ ఏవియేషన్, ఇమిగ్రేషన్ సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది…

గత రెండు నెలల్లో కాంగో, ఉగాండా, కెన్యా, నైజీరియా వంటి ఎబోలా ఉనికి ఉన్న దేశాలకు వెళ్లి వచ్చిన వారు ఎవరు? అక్కడి నుండి కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా భారత్‌కు వస్తున్న వారు ఎవరు? అన్న డేటాను ఒక్క క్లిక్‌తో బయటకు తీయవచ్చు. ఆయా ప్రయాణికుల పాస్‌పోర్ట్ నంబర్లను సిస్టమ్‌లో ఫ్లాగ్ చేస్తే, వారు ఇమిగ్రేషన్ కౌంటర్ వద్దకు రాగానే కంప్యూటర్ అలర్ట్ ఇస్తుంది. అప్పుడు వారిని నేరుగా హెల్త్ కౌంటర్లకు పంపి, 21 రోజుల పాటు పర్యవేక్షించవచ్చు. అంతేకానీ, ఏ దేశం నుండి వచ్చిన వారినైనా ఒకే గాటన కట్టి, వారు రాసిచ్చే కాగితాలను బుట్టలో వేయడం వల్ల వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోగలరు?

ప్రయాణికులకు చిన్న సూచన… వ్యవస్థలో లోపాలు ఎలా ఉన్నా, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులు, విదేశీయులు తమ వంతు బాధ్యతగా అప్రమత్తంగా ఉండటం అవసరం. విమానం దిగాక ఎయిర్‌పోర్టులో క్యూలలో నిలబడి, హడావుడిగా కాగితాలు నింపే కంటే, ప్రయాణానికి ముందే ఆన్‌లైన్‌లో ‘ఎయిర్ సువిధ’ (Air Suvidha) సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని పూర్తిగా, నిజాయితీగా అప్‌లోడ్ చేయడం ఉత్తమం. దాని తాలూకు కన్ఫర్మేషన్ కాపీని ఫోన్‌లో సిద్ధంగా ఉంచుకుని, అరైవల్ గేటు వద్ద చూపిస్తే ప్రయాణం సాఫీగా సాగడమే కాకుండా, అనుకోని ఆరోగ్య తనిఖీలకు కూడా మన వంతు సహకారం అందించినవారమవుతాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియాకు వస్తున్నారా… బీ అలర్ట్, ఎబోలా డిక్లరేషన్ తప్పనిసరి!
  • The son who stole his mother’s night…
  • అమెరికాలో నిత్యావసర వస్తువుల కోసం ప్రజల పరుగులు!
  • ఓసారి నారాయణమూర్తి జాబ్ అప్లికేషన్‌ను విప్రో ప్రేమ్‌జీ రెఫ్యూజ్ చేశాడు…
  • సకల తీర్థాల్లో మునిగి పుణ్యం చేసుకున్న ఆ సొరకాయ చివరికి..?!
  • ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు- రాముడి వారసులు మాత్రం సైలెంట్ !!
  • ఈసారి భద్రతా వ్యవస్థలోనే..! కొనసాగుతున్న అమెరికా *టెక్ కష్టాలు !!
  • ప్రతి పేద ఇంటికీ సర్కారీ భరోసా – రేవంత్ రెడ్డి గుర్తుండిపోతాడు
  • ఎవరి కోసం… ఈ హఠాత్ వరుస టెక్ ఇక్కట్లు !!
  • ‘‘సాక్షి బురద రాతలు- రోత రాతలు- నీచపు రాతలు- తప్పుడు కూతలు’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions