.
మొన్న ఆదివారం తన కొత్త పలుకు వ్యాసంలో ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ ఏమన్నాడు..?
అయ్యా, విజయసాయీ… నీది మనిషి పుట్టుకే అయితే… నామీద ప్రేలాపనలు మానేసి, బహిరంగచర్చకు రావాలి… నువ్వొక రాజకీయ వ్యభిచారివి… జగన్ నన్ను నమ్మడం లేదూ అంటూ వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్పిస్తానని తిరిగావు… నువ్వు మోసగాడివి అని కేంద్ర మంత్రి అన్నాడు…
Ads
అంతేనా..? నువ్వే స్వయంగా జగన్ తరఫున రాయబేరం తీసుకుని నా దగ్గరకు వచ్చావు..? ఏం ప్రతిపాదన తీసుకొచ్చావో చెప్పాలా..? జగన్ చివరకు ఏ స్థాయికి దిగజారాడో, నా వద్దకు ఎలాంటి బేరాలు తీసుకొచ్చాడో బయటపెట్టాలా..?
ఇక్కడ కాదు, ఢిల్లీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం షూటింగ్ పెడదాం… మీ దిక్కుమాలిన టీవీని కూడా రప్పించుకున్నా సరే.,. అన్నీ కూలంకషంగా చర్చిద్దాం… సవాల్ విసురుతున్నా… స్వీకరించే దమ్ముందా..?’’ అన్నాడు… స్ట్రెయిట్‌గానే ఉంది సవాల్… రాజకీయ నాయకుల బహిరంగచర్చకు సవాల్ వంటి డొల్ల ప్రకటన కాదు…
నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాలని అనుకున్నారు… నిజంగా జగన్ రాధాకృష్ణతో బేరాలు ఆడే ప్రయత్నం చేశాడా…? మరి తనే కదా, నా అసలు ప్రత్యర్థులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అని గంభీరంగా ప్రకటనలు చేశాడు..? నిజంగానే ఆర్కేను ప్రలోభపెట్టి కొనాలని అనుకున్నాడా..? విజయసాయే మధ్యవర్తా..?
మీడియా- పార్టీల నడుమ అక్రమ సంబంధాల నేపథ్యంలో నిజంగానే ఈ బండారాలు కాస్త బయటపడితే బాగుండు అనుకున్నారు అందరూ… కానీ సుప్రసిద్ధ, వరిష్ట పాత్రికేయుడు రాధాకృష్ణ తనంతట తాను ప్రజోపయోగం కోసం అనలు నిజాలు చెప్పడట, విజయసాయి వస్తేనే వెల్లడిస్తాడట…
ఇప్పుడు నిజంగానే విజయసాయి సవాల్‌కు సై అన్నాడు… మద్యం, ఖనిజ సిండికేట్ బ్రోకర్లతో నువ్వు నెరిపిన బ్రోకరిజం గట్రా మొత్తం బయటపెడతాను సరేనా అంటున్నాడు… ఆర్కే అక్రమాస్తుల గుట్టు కూడా విప్పుతాను అంటున్నాడు… ఇంట్రస్టింగు…
సో, తన శీలాన్ని నిరూపించుకునే బాధ్యత రాధాకృష్ణదే… ఢిల్లీలో చర్చ ఏర్పాటు చేసి, అక్కడి ప్రముఖ మీడియా హౌజులను కూడా పిలిచి, వీలైతే మోడీని కూడా రమ్మని, ఎట్ లీస్ట్ అమిత్ షా… తెలుగు ప్రజల కళ్లు తెరిపించే నిజాలను వెల్లడించాలని సగటు తెలుగు వాడి అభిలాష…
మీరు పాత్రికేయంలో పులుకడిగిన ముత్యం… తనేమో సానబెట్టిన వజ్రం… ఆ మెరుపులు ఢిల్లీలో ఈ కాలుష్య వాతావరణంలోనూ ఓసారి మెరవాల్సిన అవసరం ఉంది… భ్రష్టుపట్టింది పాత్రికేయమో, రాజకీయాలో మీరిద్దరూ కలిసి తేల్చేసే తరుణం కోసం అందరమూ ఎదురు చూస్తున్నాం… కమాన్ బాస్, కమాన్…
అవునూ… విజయసాయి ప్రతి సవాల్ ట్వీట్ల వార్త సాక్షిలో ప్రముఖంగా వస్తుందనుకున్నారు అందరూ… రాలేదు… ఎందుకబ్బా..? జగన్ మళ్లీ పక్కన పెట్టేశాడంటారా..? ఏమో… విధుశేఖర భారత స్వామీజీ గారూ, ఎనీ ఐడియా..?!
Share this Article