కొన్ని ఇంటర్వ్యూలను, పత్రికా గోష్టుల్ని మనం ఇగ్నోర్ చేస్తాం… కానీ కొన్ని ప్రశంసించడానికి అర్హత కలిగి ఉంటయ్… నిజానికి పెద్ద విషయాలేమీ కావు, కొన్ని చిన్న అంశాలే వ్యక్తుల అసలు తత్వాల్ని పట్టిస్తయ్…. అజాజ్ పటేల్ మాటలు కూడా అంతే… ఎవరీయన అనడక్కండి… జిమ లేకర్, అనిల్ కుంబ్లే తరువాత ఒకే ఇన్నింగ్సులో పది వికెట్లు పడగొట్టిన బాహుబలి… అది మామూలు ఫీట్ కాదు… అదే ఇండియన్ ప్లేయర్ అయితే ధూంధాం కవరేజీ చెలరేగిపోయేది… అరెరె, తను కూడా ఇండియనే… ముంబైలో పుట్టాడు, చిన్నప్పుడే న్యూజిలాండ్ వెళ్లింది ఆ కుటుంబం… ఆ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు… స్పిన్ బౌలర్… మొన్నీమధ్య ఆ ఫీట్ సాధించాక మాట్లాడుతూ ఏమన్నాడు..?
‘‘ఆ ఒక్క రికార్డుతో జీవితం ఏమీ మారిపోదు, కాకపోతే న్యూజిలాండ్ తరఫున మరికొన్ని టెస్టులు ఆడే అవకాశానికి ఢోకా ఉండదేమో… నిజానికి ఆ ఫీట్ అరుదైనదే… తొమ్మిదో వికెట్ తీసేవరకూ ఓ రికార్డు నా ముందు నిలబడి ఉందని అర్థం కాలేదు… అప్పటికే బాగా అలిసిపోయాను… చాలా ఓవర్లు వేశాను… ప్రతి బంతికీ ఆచితూచి, స్ట్రాటజిక్‌గా విసరాలి… ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రెస్ ఉంటుంది… పది వికెట్లు దొరకడం అనేది ఓ అదృష్టం… ఇప్పటికి 11 టెస్టులే న్యూజిలాండ్ తరఫున ఆడాను, ఈ ఫీట్‌తో ఇంకొన్ని టెస్టులు ఆడతాను..’’ అని చెప్పుకుపోయాడు… ఎంత నిజం…!
Ads
- ఒక అరుదైన ఫీట్ సాధించిన తరువాత కూడా అకస్మాత్తుగా వచ్చిన స్టార్ స్టేటస్‌తో గాలిలో నడవడం లేదు అజాజ్… నేల మీదే ఉన్నాడు… గ్రేట్… అంతేకాదు, నిజాలు మాట్లాడాడు…
- ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టడం వంటి ఫీట్లు అసాధారణం… అవి కొన్నిసార్లు అలా చరిత్రలోకి వచ్చిపడుతుంటయ్… దానికి చాలా పరిస్థితులతోపాటు అదృష్టమూ తోడు రావాలి… ఆ నిజాన్ని అజాజ్ మరిచిపోలేదు…
- న్యూజిలాండ్ క్రికెట్ మేనేజ్‌మెంట్ పక్కా ప్రొఫెషనల్… ఇదే బౌలర్ వరుసగా రెండుమూడు టెస్టుల్లో ఫెయిలైతే నిర్మొహమాటంగా తీసి పక్కన పెడుతుంది… అజాజ్‌కు ఆ నిజమూ మదిలోనే ఉంది…
- ఒకసారి అదృష్టం వరించొచ్చు, కానీ విజయాల్ని సుస్థిరంగా ఉంచడానికి శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రత, సాధన అవసరం… అవే దీర్ఘకాలం తనను టెస్టుల్లో ఉంచుతాయనే స్పృహ అజాజ్ మరిచిపోకపోవడం నచ్చింది…
- ఒక ఘనత మనిషిని గాలిలోకి లేపొద్దు, అది తలకెక్కితే, మనిషి గగనంలోనే బతికితే, ఎప్పుడో ఓసారి నేలమీదికి ఢామ్మని పడిపోవడం ఖాయం… అజాజ్‌లో ఆ సోయి కూడా కనిపించింది… నచ్చావు అజాజ్… కీప్ దట్ స్పిరిట్…
Share this Article